వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలన్నీ తొలగిపోయి, సంతోషంగా ఉండొచ్చు. ఎలాంటి అడ్డంకులు ఉన్నా సరే, తొలగిపోతాయి. ప్రతి పనిలో విజయం అందుతుంది. అక్టోబర్ 10 అంటే ఈరోజు సంకష్టహర చతుర్థి. ఈ రోజు వినాయకుడిని ప్రత్యేకించి ఆరాధించడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి.
అదే విధంగా లక్ష్మీ గణపతి అనుగ్రహం ఉంటే, ఏడాది అంతా కూడా డబ్బుకి లోటు ఉండదు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదించొచ్చు, ఆర్థిక ఇబ్బందులే ఉండవు, అప్పులు తీరిపోతాయి. మీకు రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి వస్తుంది. ఇలా దీపారాధన చేస్తే మంచిది.
ఒక ఎర్రటి వస్త్రంలో మూడు గుప్పెట్లు బియ్యం పొయ్యండి. ఈ వస్త్రానికి కొంచెం పసుపు కుంకుమ రాయండి. కొన్ని తమలపాకులు, వక్కలు, ఎండు ఖర్జూరాలు కూడా వేయండి. 11 రూపాయి కాసులు కూడా వెయ్యండి. ఆ తర్వాత మూటను కట్టేసి వినాయకుడి దగ్గర పెట్టి ప్రార్థించండి. ఈ విధంగా సంకష్టహర చతుర్ధి నాడు ఆచరించడం వలన, మనసులో కోరికలన్నీ నెరవేరుతాయి.
ఉదయం పూట ముడుపు కట్టిన తర్వాత, సాయంత్రం ఆ బియ్యంతో పొంగలి చేసి ఇంట్లో వారంతా తింటే మంచిది. లక్ష్మీ గణపతి అనుగ్రహం కలిగి, సకల సంతోషాలు ఉంటాయి, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఖర్చులు తగ్గి, అప్పుల బాధల నుంచి కూడా బయటపడవచ్చు.
ఈసారి శుక్రవారం రావడం మంచిది, లక్ష్మీదేవికి ఆధిపత్యం ఉన్న రోజు. సంకటహర వ్రతం చేస్తే మరీ మంచిది. సాయంత్రం చంద్ర దర్శనం చేయాలి. సంకట నాశన గణేశ స్తోత్రం చదవాలి. ఇలా చేయడం వలన అనుకున్నవన్నీ కలుగుతాయి. ధనం లభిస్తుంది. వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కూడా లభిస్తుంది.
నారద ఉవాచ
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్
భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే..
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్..
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్..
నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్..
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్..
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్..
జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః..
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః..