నవంబర్ 3, నేటి రాశి ఫలాలు- ఈ రాశి వారికి భూముల క్రయ విక్రయాలలో భారీ లాభాలు
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ03.11.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు(నేటి రాశిఫలాలు) 03-11-2024
వారం: ఆదివారం, మాసం: కార్తీకం,
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మేషం
ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. పూజలలో ప్రథమ తాంబూలాన్ని వాడండి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. రాజకీయ రంగాల్లోని వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. శుభకార్యాలు సానుకూలపడతాయి. రహస్య సమాచారం తెలుసుకుంటారు. బ్యాంకు ఉద్యోగస్తులకు బాగుంటుంది.
వృషభం
కీలకమని భావించిన విషయాలలో తొందరపాటు తగదు, జాగ్రత్త వహించండి. సెంటిమెంట్ వస్తు భద్రత పట్ల జాగ్రత్తలు అవసరం. ముఖ్యమైన పనులు సన్నిహితుల సహకారంతో పూర్తి చేస్తారు. ఆలోచనలకు కార్య రూపం ఇస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. గృహం, వాహనం అమ్మకాలు, కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
మిథునం
చేపట్టిన పనులు నిదానంగా పూర్తి అవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సహోద్యోగులతో అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. షేర్లు, భూముల క్రయ విక్రయాల్లో మెలకువ అవసరం. సంఘ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి.
కర్కాటకం
అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. బంధువుల ద్వారా ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాల్లో సాంబ్రాణి, త్రిశూల్ పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు లభిస్తాయి. భూ వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి.
సింహం
నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. గతాన్ని మర్చిపోలేక ఇబ్బంది పడతారు. కోర్టు వ్యవహారాలు, తీర్పులు అనుకూలంగా వున్నప్పటికీ రావాల్సిన ప్రయోజనాలు ఆలస్యంగా చేతికి వస్తాయి. సౌర కంకణం ధరించండి. ఆరోగ్యం బాగవుతుంది. రుణ బాధల నుండి బయట పడడానికి ఎంతగానో శ్రమిస్తారు. స్వల్ప ధనం లాభం పొందుతారు.
కన్య
సంగీతం పట్ల ఆసక్తి కనబరుస్తారు. ప్రజాదరణ లభిస్తుంది. మీకంటూ ఒక గుర్తింపు కోసం పరితపిస్తారు. స్త్రీ సంతానం పట్ల మక్కువ కలిగి వుంటారు. వాళ్లకు విలువైన వస్తువులు, వస్త్రాలు కొనిస్తారు. కాలక్షేపం కోసం కాలాన్ని వృథా చేస్తున్నారన్న నిందలు పడతారు. షేర్లు, భూముల క్రయ-విక్రయాల్లో ఆశించిన లాభాలు అందుతాయి.
తుల
మీరు చేసే పనికి ఎవరూ వంకలు పెట్టలేరు. అంతలా కష్టపడి పని చేస్తారు. ఈ విషయాన్ని కొంతమంది కచ్చితంగా గుర్తిస్తారు. మీకు రావాల్సిన క్రెడిట్, సముచిత స్థానం లభిస్తాయి. వ్యాపారంలో ఆదాయం బాగుంటుంది. నూతన చిన్న వ్యాపారానికి పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తారు. తండ్రి తరపు వారితో చిక్కులు కలుగుతాయి. ఇంట్లో, వ్యాపార ప్రదేశంలో సాంబ్రాణి, త్రిశూల్ పొడితో ధూపం వేయడం మంచిది.
వృశ్చికం
ధనరూపంలో హామీలు ఇవ్వవద్దు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యూహాలు, ప్రతివ్యూహాలు అమలు చేస్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి పదవుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. జిల్లేడు వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం మంచిది. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. రాజకీయ పైరవీలు మీకు మేలు చేస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో కల్పించుకోవడం మీకు ఏమాత్రం ఇష్టం ఉండదు.
ధనుస్సు
స్థిర, చరాస్తులకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలు, విషయాలు నత్తనడకన సాగుతాయి. అయినవాళ్లతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది స్నేహితుల ద్వారా ఉపయుక్తమైన సమాచారం అందుకుంటారు. అరటినార వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం మంచిది. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుంటారు.
మకరం
సినీ కళాకారులకు అనుకూలం. నూతన అవకాశాలు, ప్రాజెక్టులు అందుకుంటారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి అనుకూలమైన మార్పులు, హోదాలు ఏర్పడతాయి. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. వాతావరణంలో మార్పుల ప్రభావం వల్ల తొందరగా అనారోగ్య సమస్యలు అవకాశాలున్నాయి. ఆరోగ్య సలహాలు, సూచనలు పాటించండి.
కుంభం
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వాళ్ళు ఒకానొక సందర్భంలో ముఖ్యమైన సమాచారం, వస్తువులు ఆలస్యంగా మీకు చేరడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితి రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. ఆరోగ్య విషయంలో కచ్చితమైన నియమాలు పాటించడం అత్యవసరం. దూర ప్రాంత ప్రయాణాలు ఉద్దేశపూర్వకంగా వాయిదా సుకుంటారు.
మీనం
దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సమేతంగా వెళ్లాలని తేదీలు నిర్ణయించుకుంటారు, తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. వృత్తిరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. చేతికి కుబేర కంకణం ధరించండి. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మన శత్రువర్గం ఎవరెవరు? అన్న విషయాలు గ్రహిస్తారు. సహోదర, సహోదరి వర్గంతో సమయ స్ఫూర్తితో, వాక్చాతుర్యంతో సమస్యలు తలెత్తకుండా ప్రయత్నిస్తారు.
అందించిన వారు: అధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ