నవంబర్ 20, నేటి రాశి ఫలాలు- వ్యాపారులకు లాభసాటి అవకాశాలు కానీ ఎవరినీ నమ్మొద్దు-today november 20th rasi phalalu check mesham to meenam horoscope predictions in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నవంబర్ 20, నేటి రాశి ఫలాలు- వ్యాపారులకు లాభసాటి అవకాశాలు కానీ ఎవరినీ నమ్మొద్దు

నవంబర్ 20, నేటి రాశి ఫలాలు- వ్యాపారులకు లాభసాటి అవకాశాలు కానీ ఎవరినీ నమ్మొద్దు

HT Telugu Desk HT Telugu
Nov 20, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ20.11.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నవంబర్ 20 నేటి రాశి ఫలాలు
నవంబర్ 20 నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (నేటి రాశిఫలాలు) 20-11-2024

మాసం: కార్తీకము, తిథి: బ.పంచమి, వారం: బుధవారం, నక్షత్రం: పునర్వసు

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం

మేషం

చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. రాబడి బాగుంటుంది. క్రొత్త వారితో పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తగ్గుతాయి. వ్యాపారులకు లాభ సూచన. కళాకారులకు అనుకోని అవకాశాలు కలసి వస్తాయి. నూతన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. విద్యార్థులకు బాగుంటుంది.

వృషభం

వివాదాలు తీరతాయి. భూములు, వాహనాలు కొంటారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభ సమాచారం అందుకుంటారు. రాజకీయ వేత్తలకు కలసి వస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది.

మిథునం

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారి సమస్యలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. కొత్త అగ్రిమెంట్లు కుదుర్చుకుంటారు. ఆదాయం బాగుంటుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకూలమైన రోజు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ముఖ్యమైన పనులు నిర్వహించి గుర్తింపు పొందుతారు. తగిన గుర్తింపు లభిస్తుంది.

కర్కాటకం

చిక్కులు తొలగుతాయి. అన్నింటా శుభకరంగా ఉంటుంది. విద్యార్థులకు కలసివచ్చే కాలం. అనుకోని విధంగా ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఉద్యోగుల శ్రమకు గుర్తింపు లభిస్తుంది. పనులు చకచకా పూర్తవుతాయి. కళాకారులకు, రాజకీయనాయకులకు కలసి వస్తుంది.

సింహం

పరిస్థితులు అన్నీ కలసివస్తాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. సొమ్ము చేతికందుతుంది. కొత్త పరిచయాలతో లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు కొత్త పనులు చేపడతారు.

కన్య

అనుకోని విధంగా అన్నీ కలసి వస్తాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం బాగుంటుంది. పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక, రాజకీయ రంగాల్లోని వారికి అవకాశాలు కలసివస్తాయి. క్రీడాకారులు, కళాకారులకు అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగులు శుభసమాచారం అందుకుంటారు.

తుల

ఆశ్చర్యకరమైన ఫలితాలు లభిస్తాయి. చిక్కులు తొలగిపోతాయి. అందరూ కలసివస్తారు. వ్యాపారులకు, ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. పారిశ్రామికవేత్తలకు కలసివస్తుంది. రాజకీయనాయకులు, కళాకారులు, క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది.

వృశ్చికం

సమస్యలు తీరతాయి. రాదనుకున్న సొమ్ము చేతికందుతుంది. భూములు, వాహనాలు కొనే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకు శుభ సమాచారం అందుతుంది. వ్యాపార విస్తరణ చేపడతారు. క్రొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకు కలసివస్తుంది.

ధనుస్సు

అన్ని పనులు జయప్రదంగా పూర్తి చేస్తారు. మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా ఇతరుల నుంచి సాయం అందుతుంది. ఉద్యోగులు కోరుకుంటున్న విధంగా జరుగుతుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలకు కలసి వచ్చే కాలం. క్రీడాకారులు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మకరం

నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి అనుకోని విధంగా ఆదాయం సమకూరుతుంది. బాధ్యతలు సక్రమంగా పూర్తి చేస్తారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూలమైనరోజు. మాట అదుపులో ఉంచుకోవాలి. తొందరపాటుగా వ్యవహరించవద్దు. పనుల్లో శ్రద్ధ చూపండి. అందరి నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది.

కుంభం

కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కొత్త కాంట్రాక్టులు చేసుకుంటారు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. రాజకీయనాయకులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు పై అధికారుల మెప్పు పొందుతారు. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనం

సమస్యలు తీరతాయి. అనుకోని విధంగా ఆదాయం సమకూరుతుంది. అందరిలో గుర్తింపు లభిస్తుంది. కొన్ని కార్యక్రమాలు అనుకున్నట్టే పూర్తి అవుతాయి. రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో వివాదాలు సర్దుకుంటాయి. ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు శుభసమాచారం అందుతుంది. క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది.

Whats_app_banner