Today rasi phalalu: నవంబర్ 16, నేటి రాశి ఫలాలు- కళాకారులు, క్రీడాకారులకు ఇదే మంచి సమయం-today november 16th saturday rasi phalalu in telugu check zodiac wise horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నవంబర్ 16, నేటి రాశి ఫలాలు- కళాకారులు, క్రీడాకారులకు ఇదే మంచి సమయం

Today rasi phalalu: నవంబర్ 16, నేటి రాశి ఫలాలు- కళాకారులు, క్రీడాకారులకు ఇదే మంచి సమయం

HT Telugu Desk HT Telugu
Nov 16, 2024 12:05 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ16.11.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నవంబర్ 16 నేటి రాశి ఫలాలు
నవంబర్ 16 నేటి రాశి ఫలాలు (Pixabay)

రాశిఫలాలు (నేటి రాశిఫలాలు) 16-11-2024

వారం: శనివారం, మాసం: కార్తీకము,

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం

మేషం: కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్ళు తొలగుతాయి. రాబడి బాగుంటుంది. వ్యాపారులకు లాభ సూచన. కళాకారులకు అవకాశాలు అందివస్తాయి. నూతన కార్యక్రమాలు సఫలీకృతమవుతాయి. విద్యార్థులకు ఊహించని ఫలితాలు వస్తాయి.

వృషభం:

ఆస్తివివాదాలు తీరతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. గౌరవమర్యాదలు పెరుగుతాయి. బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలకు కలిసివస్తుంది. కళాకారులు, క్రీడాకారులు మంచి గుర్తింపు పొందుతారు.

మిథునం:

వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కలిసివస్తాయి. అవసరానికి సొమ్ము చేతికందుతుంది. స్థిరాస్తి అగ్రిమెంట్లు, ఇంటి నిర్మాణ యత్నాలు కొలిక్కి వస్తాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఎవరి సాయమూ లేకుండానే ముఖ్యమైన పనులు నిర్వర్తిస్తారు. పారిశ్రామిక వేత్తలకు, రాజకీయ నాయకులకు అనుకున్న విధంగా జరుగుతుంది.

కర్కాటకం:

ఇబ్బందికరంగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. అనుకున్న విధంగా డబ్బు సమకూరదు. వ్యాపార కార్యకలాపాల్లో ఆటంకాలు కలుగుతాయి. కళా, క్రీడారంగాల్లోనివారి అంచనాలు తప్పుతాయి. పనులను వాయిదా వేయవలసి వస్తుంది.

సింహం:

పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. అవసరానికి సొమ్ము చేతికందుతుంది. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలు కలుగుతాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు ముందడుగు వేస్తారు.

కన్య:

ఊహించని విధంగా కలిసివస్తుంది. ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. వివాదాల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయ రంగాల్లోని వారికి అనుకోని విధంగా కలసివస్తుంది. క్రీడాకారులు, కళాకారులకు అనుకూలంగా ఉంటుంది.

నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు.

తుల:

పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు తీరతాయి. ప్రత్యర్థులు కలిసివస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన రోజు. రాజకీయనాయకులు, కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం:

సమస్యలు తీరతాయి. రాదనుకున్న సొమ్ము చేతికి అందుతుంది. భూములు, వాహనాలు కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. వ్యాపార విస్తరణ చేపడతారు. నూతనంగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు శుభవార్త అందుతుంది. కళాకారులు, క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు:

పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. బంధుమిత్రుల నుంచి సాయం అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు అనుకున్న విధంగా జరుగుతుంది. వ్యాపారులకు అంచనాల మేరకు ఆదాయం లభిస్తుంది. రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలకు కలిసివస్తుంది. క్రీడాకారులు, కళాకారులకు గుర్తింపు లభిస్తుంది.

మకరం:

బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకున్న విధంగా డబ్బు చేతికందుతుంది. ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులు విధినిర్వహణలో శ్రద్ధ చూపాలి. కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి అనుకూలమైన రోజు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయనాయకులు అనుకూలంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

కుంభం:

కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆలోచనలు కలసివస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యాపారులు అధిక లాభాలు గడిస్తారు. కొత్త కాంట్రాక్టులు చేసుకుంటారు. కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది. రాజకీయనాయకులకు, పారిశ్రామిక వేత్తలకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనం:

కొన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఊహించని రీతిలో రాబడి దక్కుతుంది. రుణబాధలు తొలగుతా యి. కుటుంబంలో వివాదాలు సర్దుకుంటాయి. బంధువులు మరిన్ని బాధ్యతలు పెంచుతారు. వ్యాపారులు ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూలంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం. క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది.

Whats_app_banner