మే 18, నేటి రాశి ఫలాలు.. లక్ష్మీ కటాక్షంతో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు-today may 18th 2024 rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మే 18, నేటి రాశి ఫలాలు.. లక్ష్మీ కటాక్షంతో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు

మే 18, నేటి రాశి ఫలాలు.. లక్ష్మీ కటాక్షంతో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు

HT Telugu Desk HT Telugu
Published May 18, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ18.05.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మే 18వ తేదీ నేటి రాశి ఫలాలు
మే 18వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 18.05. 2024

వారం: శనివారం, తిథి : దశమి,

నక్షత్రం : ఉత్తర ఫల్గుణి, మాసం : వైశాఖము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. పెద్దల సలహాలు పాటించడం మంచిది. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు పెరుగుతాయి. సహోద్యోగులు, ఉన్నతాధికారులతో అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం అనుకూలించును. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థికంగా కలసివస్తుంది. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, అనుకూల బదిలీలుంటాయి. కొత్త వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల మూలంగా లాభాలు అందుకుంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ధైర్యంగా ముందడుగు వేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు కలసివస్తాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత నెలకొంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం మంచిది. శుభకార్యాల విషయంలో ఆర్థికంగా కొన్ని చికాకులు తలెత్తవచ్చు. కుటుంబములో చిన్న చిన్న కలహాలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఉత్సాహంగా ఉంటారు. సాహసించి పనులు చేస్తారు. విందు, వినోదాలకు హాజరవుతారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. మంచి వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉ౦టారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. రాబడి పెరిగినప్పటికీ అందుకు తగిన ఖర్చులుంటాయి. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. విలువైన ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలుంటాయి. సమయపాలన పాటించడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కుటుంబముతో ఆనందముగా, ఆహ్లాదకరముగా గడిపెదరు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు పెరుగుతాయి. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తారు. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. వాహన మరమ్మతులుంటాయి. అలంకరణ వస్తువుల కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన డబ్బు అందుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. పెద్దల సూచనలు పాటించడం మంచిది. పాత బాకీలు వసూలు అవుతాయి. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు అందరి ప్రశంసలను పొందుతారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంత కాలం వేచి చూడటం మంచిది. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సహోద్యోగులతో భేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలున్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఆటంకాలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పని ఒత్తిడితో అనాలోచిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. సహనంతో వ్యవహరించండి. రాబడి బాగుంటుంది. అనవసర ఖర్చులుంటాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. క్యాటరింగ్‌, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారాల్లో మంచి లాభాలుంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశం ఉంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. రోజువారీ వ్యాపారం సాఫీగా సాగుతుంది. ఉద్యోగులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సహోద్యోగుల సహకారం ఆశించినప్పటికి అంతగా దక్కకపోవచ్చు. ఆరోగ్యం మెరుగవుతుంది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. సభలు, సమావేశాలకు హాజరవుతారు. విహారయాత్రలు చేపడతారు. గురుభక్తి పెరుగుతుంది. సహోద్యోగులతో సమస్యలు తలెత్తవచ్చు. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు తలెత్తుతాయి. పలుకుబడితో పనులు నెరవేరతాయి. బంధువులతో అనవసరమైన చర్చలకు దిగకండి. ఒక శుభవార్త వింటారు. భూ లావాదేవీల్లో లాభాలు పొందుతారు. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు. చివరికి అనుకున్నవన్నీ నెరవేర్చగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఊరట లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంట్లో పెద్దవాళ్ళతో చర్చించడం అవసరం. దూర ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలించును. నలుగురికి సాయం చేస్తారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. సమయపాలన పాటించడం మంచిది. వ్యాపారస్తులకు మంచి సమయం. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. రోజువారీ పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. అనవసరమైన ఆలోచనలు తలెత్తవచ్చు. సహనంతో వ్యవహరించండి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. శ్రద్దతో పనులు చేయడం మంచిది. ఆరోగ్యం అనుకూలం. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి కాలం కలసివస్తుంది. బంధువులతో అభిప్రాయ భేదములు ఏర్పడవచ్చు. వాహన మరమ్మత్తుల వల్ల ఖర్చులు పెరుగుతాయి. కుటుంబముతో సంతోషంగా గడుపుతారు. అలసట లేకుండా పనులు చేస్తారు. శారీరక సమస్యలు తీరతాయి. ప్రయాణాలు కలసివస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య అనుకూలిస్తుంది. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner