మే 13, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వాళ్ళు పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి-today may 13th 2024 rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మే 13, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వాళ్ళు పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి

మే 13, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వాళ్ళు పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి

HT Telugu Desk HT Telugu
May 13, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ13.05.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మే 13వ తేదీ నేటి రాశి ఫలాలు
మే 13వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 13.05. 2024

వారం : సోమవారం, తిథి : షష్టి

నక్షత్రం : పునర్వసు, మాసం : వైశాఖము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం : ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. గృహ, వాహన యోగాలున్నాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు. శత్రువులు మిత్రులుగా మారతారు. రావలసిన సొమ్ము అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగకావశాలేర్పడును. స్థిరాస్తి వివాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. మేష రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు, ధనమును పొందెదరు.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు ఆశించిన పెట్టుబడులుంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు రావచ్చు. గృహ నిర్మాణాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఎదుటివారిని నొప్పించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలుంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ ఆశయాలు నెరవేరతాయి. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులుంటాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. సకాలంలో రావలసిన ధనం సమకూరడంతో అవసరాలు తీరతాయి. మీరు తీసుకునే నిర్ణయాలను కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. మిథున రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలుంటాయి. వ్యాపారస్తులకు ఊహించని పెట్టుబడులు. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగవకాశం. కర్కాటకరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన, పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. సోదర, సోదరీలతో వివాదాలు పరిష్కారం. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారస్తులు ఆశించిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. విద్య, ఉద్యోగావకాశాలుంటాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలుంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గుతుంది. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వ్యాపారస్తులు సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు పదోన్నతులుంటాయి. ఆస్తుల వ్యవహారాల్లో చిక్కులు పరిష్కారమవుతాయి. శత్రువులను ఆకట్టుకుంటారు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలుంటాయి. ఆరోగ్య సమస్యలుంటాయి, జాగ్రత్త వహించాలి. కన్యా రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలం. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. వాహన, గృహయోగాలుంటాయి. వ్యాపారస్తులు నష్టాలను అధిగమిస్తారు. ఉద్యోగులకు సహచరుల నుంచి సాయం అందుతుంది. విద్యార్థులకు విదేశీ విద్యావకాశం. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. తులా రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీ ఆలోచనలు కలసివస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. కుటుంబములో శుభకార్యాల నిర్వహిస్తారు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. ఆస్తుల వ్యవహారంలో గందరగోళం తొలగుతుంది. అందరిలోనూ మీమాటే నెగ్గుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వృశ్చిక రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలున్నాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. రావలసిన డబ్బు అందుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగులకు పని నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి సమాచారం ఆనందాన్నిస్తుంది. కొన్ని పనులు కుటుంబసభ్యుల సాయంతో పూర్తి చేస్తారు. ధనూ రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకం పఠించి శివారాధన చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. సోదరీ సోదరులతో ముఖ్య విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. వాహన యోగముంది. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు దక్కవచ్చు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలుంటాయి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. విద్యార్థులు, నిరుద్యోగులకు కోరుకున్న అవకాశాలుంటాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయం. వ్యాపారులకు ఊహించని లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. ధనపరమైనటుంటి లాభాలున్నాయి. ఆత్మీయుల సలహా మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. కుంభ రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనయోగముంది. ఆదాయం పెరుగుతుంది. భూ వివాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. విద్యార్థులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

WhatsApp channel