మార్చి 14, నేటి రాశి ఫలాలు.. దూరమైన వాళ్ళు దగ్గరవుతారు, నూతన బాధ్యతలు అందుకుంటారు-today march 14th 2024 rasi phalalu check your zodiac signs result for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today March 14th, 2024 Rasi Phalalu Check Your Zodiac Signs Result For Daily Horoscope In Telugu

మార్చి 14, నేటి రాశి ఫలాలు.. దూరమైన వాళ్ళు దగ్గరవుతారు, నూతన బాధ్యతలు అందుకుంటారు

HT Telugu Desk HT Telugu
Mar 14, 2024 12:05 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ14.03.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 14, నేటి రాశి ఫలాలు
మార్చి 14, నేటి రాశి ఫలాలు (pinterest)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 14.03.2024

ట్రెండింగ్ వార్తలు

వారం: గురువారం, తిథి : చవితి,

నక్షత్రం : భరణి, మాసం : ఫాల్గుణం

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. పేరు, ప్రతిష్టలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులుంటాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో కష్టానికి తగిన ప్రతిఫలముంటుంది. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మేష రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్పించండి.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. గతంలో ఆగిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలం. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీవల్ల కొందరికి మేలు జరుగుతుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. పలుమార్గాల్లో ఆదాయాన్ని పొందే అవకాశాలున్నాయి. తగిన ప్రయత్నాలు చేయాలి. దత్తాత్రేయుడిని పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. మీ పనితీరు ఇతరులకు ఆదర్శవంతమవుతుంది. దూరమైనవారు దగ్గరవుతారు. పరిస్థితులు క్రమంగా సహకరిస్తాయి. పట్టుదలతో పనులు ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. వ్యాపారస్తులకు కష్ట సమయం. ఉద్యోగస్తులకు పైఅధికారులతో ఇబ్బందులు కలుగును. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి, ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలంగా లేదు. దేనికీ తొందరపడవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి. ఒక విజయం ఉంది. ఒత్తిళ్ళు లేకుండా ప్రతి పనీ ఆలోచించి చేయాలి. శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించాలి. సహనంతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. విఘ్నాలను అధిగమించి విజయాలు సాధిస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పై అధికారులచే గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభదాయకం. మిత్రబలంతో సత్ఫలితాలు సాధిస్తారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. పలు మార్గాల్లో విజయం గోచరిస్తుంది. ధనయోగముంది. కుటుంబసభ్యులతో ఆనందముగా గడుపుతారు. శంకరాచార్య విరచిత దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

తులా రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం తులారాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి. ముఖ్యపనుల్లో శ్రద్ద వహించాలి. వ్యాపారంలో కొంచెం దృష్టిపెడితే అనుకూలంగా ఉంటుంది. నిరుత్సాహం పనికిరాదు. ఖర్చులు నియంత్రించుకోవాలి. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్చించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు లాభదాయకం. పెట్టుబడులు కలసివస్తాయి. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. శుభవార్త వింటారు. మీరు తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. భూ, గృహ, వాహనాది యోగాలున్నాయి. ఉద్యోగస్తులకు ప్రశంసలుంటాయి. పనులు త్వరగా పూర్తవుతాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్ధికంగా బలపడతారు. క్రమంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆరోగ్యం అనుకూలించును. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం శ్రీరామరక్షాస్తోత్రాన్ని పరించండి. శ్రీరామ నామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీ ఆశయాలు నెరవేరతాయి. ఆర్థికంగా కలసివస్తుంది. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. శాంతంగా సమాధానలివ్వాలి. వ్యాపారస్తులకు లాభదాయకం. సమయస్పూర్తితో అటంకాలను అధిగమించాలి. తోటివారి సహకారముంటుంది. మకర రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దత్తాత్రేయుని పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలున్నాయి. మిత్రుల సహాయం అవసరం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో చెప్పి చేసే పనులు విజయం సాధిస్తాయి. ఇబ్బందిపెట్టే వ్యక్తులకు దూరంగా ఉండాలి. ప్రతీ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆత్మవిశ్వాసంగా ముందుకు సాగండి. బాధ్యతలతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలుంటాయి. ఏకాగ్రతత పనిచేయండి. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన బాధ్యతలు చేపట్టే వీలుంది. శుభవార్త వింటారు. మీన రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
WhatsApp channel