మార్చి 10, నేటి రాశి ఫలాలు.. అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి, ఆరోగ్యం జాగ్రత్త-today march 10th 2024 dina phalalu check your zodiac signs result for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మార్చి 10, నేటి రాశి ఫలాలు.. అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి, ఆరోగ్యం జాగ్రత్త

మార్చి 10, నేటి రాశి ఫలాలు.. అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి, ఆరోగ్యం జాగ్రత్త

HT Telugu Desk HT Telugu
Published Mar 10, 2024 12:05 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ10.03.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 10వ తేదీ నేటి రాశి ఫలాలు
మార్చి 10వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 10.03. 2024

వారం: ఆదివారం, తిథి : అమావాస్య

నక్షత్రం : పూర్వాభాద్ర, మాసం : మాఘము,

సంవ త్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేషరాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. అనుకున్న ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. ప్రణాళికాబద్ధంగా పట్టుదలతో కృషిచేయండి. పనులయందు ఒత్తిళ్ళు ఇబ్బందిపెట్టును. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. మిత్రులకు సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు కలుగును. మేషరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్య నమస్కారం వంటివి చేయటం వలన శుభఫలితాలు కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృషభ రాశి

వృషభరాశి వారికి ఈ రోజు వృషభరాశి వారికి అనుకూలంగా ఉన్నది. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. అవకాశాల్ని సద్వినిగయోగం చేసుకోవాలి. గృహ, వాహన యోగాలుంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలించును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్థులకు ఖర్చులతో కూడినటువంటి సమయం. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్య ష్ట్రకాన్ని పఠించండి. నవగ్రహ జపం చేయటం మంచిది.

మిథున రాశి

మిథున రాశివారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఇతరులపై ఆధారపడవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి. స్వల్ప ఇబ్బందులున్నా అధైర్యపడకూడదు. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి. మనోబలంతో పనిచేయండి. అన్నిటా విజయాలు సిద్ధిస్తాయి. మిథున రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అరుణం పారాయణం చేయడం మంచిది. సూర్యభగవానుడికి తర్పణాలు వదలాలి.

కర్కాటక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికంగా ఉండును. వ్యాపారస్తులకు కొంత కష్టకాలం. విద్యార్థులకు ఈరోజు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు, వృత్తి సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టు సూచన. కుటుంబ విషయాలు, అరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్య నారాయణమూర్తిని పూజించండి. చంద్రశేఖాష్టకం పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారపరంగా ఇబ్బందులుంటాయి. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి. అరోగ్యవిషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. సూర్యాష్టకాన్ని పఠించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీ ఆశయాలు నెరవేరతాయి. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు లాభదాయకం. కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి తగిన సమయం. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించడం మంచిది. సూర్యభగవానుని పూజించి బెల్లం పరమాన్నాన్ని నివేదించడం మంచిది. ఆలయాలను దర్శించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలను సాధిస్తారు. భూ గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ కృషి నలుగురికీ తెలుస్తుంది. తులారాశివారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. సూర్య నమస్కారాలు చేయాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారపరంగా లాభదాయకం. మీరు చేసే పనులు పదిమందికి ఆదర్శవంతమవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. స్వయంకృషితో అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడును. ఆదిత్య హృదయాన్ని పఠించాలి. నవగ్రహా ఆలయాల్లో పూజలువంటివి చేయాలి.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. ఏ పని ప్రారంభించినా విజయమే గోచరిస్తుంది. తగిన ప్రణాళికలను సిద్ధం చేయండి. గొప్పవారితో సంభాషిస్తారు. గృహ నిర్మాణాది కార్యాలు సత్ఫలితాలిస్తాయి. విద్యార్థులకు ఈరోజు కలసివచ్చును. సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. నూతన ప్రయత్నాలు కలసివస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. భూసేకరణ, గృహ నిర్మాణాది అంశాలపై దృష్టి సారిస్తారు. ధర్మమార్గంలో ముందుకెళ్ళాలి. శాంతంగా వ్యవహరించాలి. మకర రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహశాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయాలయందు శ్రద్ధ వహించాలి. అనవసర మాటలు పడే స్థితి ఏర్పడును. ఖర్చులు అధికమగును. చెడు ఊహించవద్దు. మొహమాటాన్ని పక్కనపెట్టి పనిచేయండి. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. వ్యాపారస్తులకు కష్టకాలం. విద్యార్థులకు మధ్యస్థ సమయం. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు విజయాన్నిస్తాయి. ఉద్యోగంలో తోటివారి నుండి తగిన సహాయం అందుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొన్ని విషయాలలో స్పష్టత వస్తుంది. భూలాభం సూచన. మనశ్శాంతి లభిస్తుంది. ప్రతిభతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ