ఈరోజు మహా సంయోగం.. సిద్ధయోగం+స్వాతి నక్షత్రం.. ఈ మూడు రాశుల వారికి విపరీతమైన అదృష్టం, పట్టిందల్లా బంగారమే!-today maha samyogam siddha yoga and swathi star it gives lots of luck and immense wealth to aries gemini and leo ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈరోజు మహా సంయోగం.. సిద్ధయోగం+స్వాతి నక్షత్రం.. ఈ మూడు రాశుల వారికి విపరీతమైన అదృష్టం, పట్టిందల్లా బంగారమే!

ఈరోజు మహా సంయోగం.. సిద్ధయోగం+స్వాతి నక్షత్రం.. ఈ మూడు రాశుల వారికి విపరీతమైన అదృష్టం, పట్టిందల్లా బంగారమే!

Peddinti Sravya HT Telugu

సిద్ధ యోగం, స్వాతి నక్షత్రం కారణంగా రెండు యాదృచ్ఛికాలు చోటు చేసుకోవడంతో, కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలను తీసుకువస్తుంది. ఈరోజు కొత్త ప్రణాళికలు వేయాలన్నా, కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్నా, ఆస్తులను కొనుగోలు చేయాలన్నా మంచిది. ముఖ్యంగా, ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

సిద్ధ యోగం, స్వాతి నక్షత్రం (pinterest)

ఈరోజు జూలై 5న కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది. ఈరోజు రెండు శుభయోగాలు ఏర్పడ్డాయి. సిద్ధ యోగం, స్వాతి నక్షత్రం కారణంగా రెండు యాదృచ్ఛికాలు చోటు చేసుకోవడంతో, కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలను తీసుకువస్తుంది.

ఈరోజు కొత్త ప్రణాళికలు వేయాలన్నా, కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్నా, ఆస్తులను కొనుగోలు చేయాలన్నా, వాహనాలను కొనుగోలు చేయాలన్నా, కొత్త కళ నేర్చుకోవాలన్నా ఈ రోజు మొదలు పెడితే మంచిది. ఇది కేవలం ఈరోజుకే కాదు, కొన్ని రోజులు వరకు శుభ ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా, ఈ రాశుల వారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది.

సిద్ధ యోగం

ఈరోజు ఈ యోగం కారణంగా కొత్త పనులు ప్రారంభించడానికి శుభ సమయం, ఈ యోగం సానుకూల మార్పులను తీసుకువస్తుంది. రాత్రి 8:05 వరకు ఇది ఉంటుంది.

స్వాతి నక్షత్రం

స్వాతి నక్షత్రం కూడా ఈ ప్రత్యేకమైన రోజున ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైనది. స్వాతి నక్షత్రం దాతృత్వం, తెలివితేటలు, ధైర్యం, ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ప్రశాంతమైన, ఆకట్టుకునే స్వభావం కలిగి ఉంటారు.

ఈ మూడు రాశులకు లాభాలు

1.మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. సిద్ధ యోగం పురోగతిని తీసుకువస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు ఈరోజు ఊపందుకుంటాయి. కెరీర్‌కి సంబంధించిన కొత్త ప్రణాళికలు వేస్తారు. కొత్త దిశలో అడుగు వేయాలని అనుకుంటే, ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఉపశమనం కలుగుతుంది.

2.మిథున రాశి

మిథున రాశి వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సిద్ధ యోగం, స్వాతి నక్షత్రం ఆర్థిక ప్రయోజనాలను తీసుకువస్తుంది. పాత పనులు పూర్తవుతాయి, సక్సెస్‌ను ఇస్తాయి. కొత్త ప్రాజెక్టులను మొదలు పెడతారు. జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.

3.సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది. ఈ రెండు యోగాల వలన ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టడానికి ఈ రోజు బాగుంటుంది. ఇప్పటి వరకు పూర్తి కాని పనులు ఈరోజు పూర్తవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు, గౌరవం పెరుగుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.