జూన్ 7, నేటి రాశి ఫలాలు.. అవమానకర ఘటనలు ఎదురవుతాయి,స్త్రీలతో వివాదాలు వద్దు-today june 7th 2024 rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ 7, నేటి రాశి ఫలాలు.. అవమానకర ఘటనలు ఎదురవుతాయి,స్త్రీలతో వివాదాలు వద్దు

జూన్ 7, నేటి రాశి ఫలాలు.. అవమానకర ఘటనలు ఎదురవుతాయి,స్త్రీలతో వివాదాలు వద్దు

HT Telugu Desk HT Telugu
Jun 07, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ07.06.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూన్ 7 రాశి ఫలాలు
జూన్ 7 రాశి ఫలాలు (pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 07.06.2024

వారం: శుక్రవారం, తిథి : పాడ్యమి,

నక్షత్రం : మృగశిర, మాసం : వైశాఖము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వస్తు వాహన లాభాలుంటాయి. ఉద్యోగంలో స్థానచలన మార్పులుంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. షేర్‌ మార్కెట్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌ ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. స్టిరాస్తి కొనుగోలు విషయాలు వాయిదా వేయండి. ఆరోగ్యం మధ్యస్థంగా ఉంటుంది. మేషరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కొన్ని వివాదాల వల్ల సమస్యలుంటాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. కుటుంబ పెద్దల ఆరోగ్యం అనుకూలించును. విద్యార్థులకు అనుకూల సమయం. అలంకరణ వస్తువుల కొనుగోలులో అధిక ధనవ్యయం అవుతుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీ శంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. శత్రు బాధలు తొలగుతాయి. అనుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలం. ధనవ్యయం అధికమవుతుంది. శుభకార్య ప్రయత్నాలు వేగవంతమవుతాయి. విదేశీ ప్రయత్నాల్లో తగిన సలహాలు అందవు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల వలన సౌఖ్యం కలుగుతుంది. విద్యార్థులకు మధ్యస్థ సమయం. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరమవుతాయి. పట్టుదలతో పనులన్నీ పూర్తిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగంలో అధికారుల అండదండలుంటాయి. స్థాన చలన మార్పులుంటాయి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పఠించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఊహించిన లాభాలుంటాయి. ఉన్నత పదవులు చేపడతారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమపడాల్సిన సమయం. కోర్టు వ్యవహారాలలో అనుకూలత లేదు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. రుణబాధల నుంచి విముక్తి. రాజకీయ నాయకులకు మంచి పదవులు దక్కుతాయి. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్థాలు వంటివి పంచిపెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్పించండి. పశువులకు బెల్లం, తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు, అధికారులతో సమస్యలుంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ సమస్యలుంటాయి. దూర ప్రాంత ప్రయాణాలుంటాయి. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి విషయాలు లాభదాయకం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీకృష్ణుడిని పూజించాలి. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లలితా స్తోత్రాన్ని పఠించండి. లక్ష్మీ అష్టోత్తర నామాలను పఠించడం ఆర్థిక సమస్యలు తొలగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కొన్ని కీలక విషయాల నిమిత్తం పెద్దలను సంప్రదిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తతో ఉండాలి. అధికారయోగమున్నది. స్త్రీలతో వివాదాలు వద్దు. ఎన్ని సమస్యలున్నా ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కొన్ని విషయాలలో మాటపడవలసి వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు పనులు కొంత ఆలస్యమవుతాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. శుభకార్య ప్రయత్నాలు వేగవంతమవుతాయి. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. అధికారులతో ఉన్న సమస్యలు సర్దుకుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం అనుకూలించును. విదేశీ ప్రయత్నాలలో శుభవార్త అందుతుంది. నిందలు పడవలసి వస్తుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులుంటాయి. ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలం. వృశ్చికరాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్థాలు వంటివి పంచిపెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్పించండి. పశువులకు బెల్లం, తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బదిలీలు అనుకూలం. ప్రయాణాలు కలసివస్తాయి. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. వ్యాపార భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. పని ఒత్తిడి వలన ఇంటి పనులు నిర్వహించలేరు. ఇతరులను నమ్మి కొత్త ప్రయత్నాలు చేయరాదు. పాత ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పఠించాలి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. అన్ని రంగాల వారికి అనుకూల సమయం. ఉద్యోగంలో బదిలీలుంటాయి. మొండీ బాకీలు వసూలవుతాయి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలలో శుభఫలితాలున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలాసవంతమైన జీవితం గడుపుతారు. కుటుంబములో స్వల్ప అభిప్రాయభేదములేర్పడును. షేర్‌ మార్కెట్ వ్యాపారులకు అనుకూలం. స్థిరాస్తి కొనుగోలుకు మంచి సమయం. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. బంధువర్గంతో విభేదాలేర్పడును. మీ కృషికి తగిన గౌరవం లభించదు. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు సర్దుకుంటాయి. అవమానకర ఘటనలు ఎదురవుతాయి. కొన్ని అడ్డంకులుంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు ఏర్పడు సూచనలున్నాయి. అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారం అనుకూలిస్తుంది. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీ శంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.

మీన రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. సమస్యలను పట్టుదలతో పరిష్కరిస్తారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ధనలాభం ఉంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలవలన అలసట. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తవుతాయి. విద్యార్థులు చికాకులు తప్పవు. షేర్‌ వ్యాపారులకు అనుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి. ఆరోగ్యం కొంత ఇబ్బందికరం. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీఅష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel