జూన్ 4, నేటి రాశి ఫలాలు.. వీరిపై పడిన నిందలు తొలగిపోతాయి, ఉద్యోగులకు కొత్త పదవులు-today june 4th rasi phalalu in telugu check zodiac wise results daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ 4, నేటి రాశి ఫలాలు.. వీరిపై పడిన నిందలు తొలగిపోతాయి, ఉద్యోగులకు కొత్త పదవులు

జూన్ 4, నేటి రాశి ఫలాలు.. వీరిపై పడిన నిందలు తొలగిపోతాయి, ఉద్యోగులకు కొత్త పదవులు

HT Telugu Desk HT Telugu
Jun 04, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ04.06.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూన్ 4 వ తేదీ నేటి రాశి ఫలాలు
జూన్ 4 వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 04.06.2024

వారం: మంగళవారం, తిథి : త్రయోదశి,

నక్షత్రం : భరణి, మాసం : వైశాఖము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలేర్పడతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులు తొలగుతాయి. గృహనిర్మాణం, కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వరునికి దీపారాధన చేయండి. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం మంచిది.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సన్నిహితుల సూచన మేరకు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ధనవ్యయముండును. రాజకీయ నాయకులకు కొత్త పదవులు దక్కవచ్చు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించటం మంచిది. దేవీ ఖద్గమాల పఠించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులు, విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబములో శుభకార్యాలుంటాయి. మీపై వచ్చిన అరోపణలు తొలగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త పదవులు రావచ్చు. అనారోగ్య సమస్యలుంటాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్యుని ఆలయం దర్శించటం మంచిది. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ప్రారంభంలో చికాకులు, సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. విద్యార్థులు పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ధన వ్యయముండును. ఆస్తి వివాదాలుంటాయి. కర్కాటక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆంజనేయ స్వామి వారిని పూజించండి. అప్పాలను ఆంజనేయ స్వామికి నివేదించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. పనులలో ఆటంకాలు తొలగుతాయి. ప్రముఖుల నుంచి సమాచారం అందుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులు మరింత గుర్తింపు పొందుతారు. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించాలి. సుబ్రహ్మణ్యుని ఆలయాన్ని దర్శించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకోని హోదాలుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. బంధువులతో విరోధాలేర్పడు సూచనలున్నాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం మంచిది. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహం, వాహనాల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభించవచ్చు. అరోగ్య సమస్యలుంటాయి. ఆర్థికంగా బలపడతారు. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు దక్కుతాయి. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. పనులు నిదానంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో సామాన్య లాభాలుంటాయి. పెద్దల సలహాలు పాటిస్తారు. ఇంటా బయటా ఒత్తిడులుంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కొత్త రుణ ప్రయత్నాలు సాగిస్తారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. మీ జీవితాశయం నెరవేరుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. ధనవ్యయముండును. కుటుంబసమస్యలుంటాయి. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి.

మకర రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికపరంగా అనుకూలం. పరపతి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువిరోధాలుంటాయి. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. గణపతి స్తోత్రం పఠించాలి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. పనులు చకచకా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఒక సమాచారం విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందముగా గడుపుతారు. ధనవ్యయముండును. కుంభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుడిని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కోర్టు వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. వ్యయప్రయాసలుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel