జూన్ 18, నేటి రాశి ఫలాలు.. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు, గౌరవం పెరుగుతుంది-today june 18th rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ 18, నేటి రాశి ఫలాలు.. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు, గౌరవం పెరుగుతుంది

జూన్ 18, నేటి రాశి ఫలాలు.. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు, గౌరవం పెరుగుతుంది

HT Telugu Desk HT Telugu
Jun 18, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ18.06.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూన్ 18 నేటి రాశి ఫలాలు
జూన్ 18 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 18.06.2024

వారం: మంగళవారం, తిథి : ఏకాదశి,

నక్షత్రం : స్వాతి, మాసం : జ్యేష్టము

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. దూరపు బంధువులను కలుసుకుని ఆనందముగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు చేపడతారు. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు అనుకోని హోదాలు లభిస్తాయి. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వరునికి దీపారాధన చేయండి. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కొన్ని విషయాలలో చికాకులు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలముండదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్ధికపరంగా కూడా అంత అనుకూలంగా లేదు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించటం మంచిది. దేవీ ఖద్గమాల పఠించండి.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలున్నాయి. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు రాగలవు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ధన వ్యయముండును. ఆశ్చర్యకమైన విషయాలు తెలుస్తాయి. అనారోగ్య సమస్యలుంటాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్యుని ఆలయం దర్శించటం మంచిది. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు అందరిచేత ప్రశంసలు అందుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు చిక్కులు తొలగుతాయి. ధనవ్యయముండును. అనారోగ్య సమస్యలుంటాయి. కర్కాటక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆంజనేయస్వామి వారిని పూజించండి. అప్పాలను ఆంజనేయస్వామికి నివేదించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. అప్తులు, బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. రుణ బాధలు తొలగుతాయి. వాహనాలు, గృహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. స్థిరాస్తి వృద్ధి అగును. వ్యాపారాలు అనుకూలిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలుంటాయి. మిత్రులతో వివాదాలేర్పడు సూచనలున్నాయి. మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించాలి. సుబ్రహ్మణ్యుని ఆలయాన్ని దర్శించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కొత్త పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వస్తు, వస్త్ర లాభాలుంటాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. వ్యాపారాలలో లాభాలుంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులుంటాయి. ధనవ్యయముండును. కళారంగం వారికి సత్కారాలుంటాయి. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గా దేవిని పూజించడం, ఆరాధించడం మంచిది. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగపరంగా ఉద్యోగస్తులు తమ విధులు నిర్వహిస్తారు. విద్యార్థులకు మరింత అనుకూల సమయం. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. ఆస్తి వివాదాలుంటాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. భూముల వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలేర్పడతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. అనారోగ్య సమస్యలుంటాయి. రాజకీయ నాయకులకు కొత్త పదవులు దక్కే అవకాశముంది. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ఉద్యోగులకు ఊహించని విధంగా హోదాలు దక్కుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దూరప్రయాణాలుంటాయి. ఆరోగ్యపరంగా సమస్యలుంటాయి. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని అలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. శుభవార్తలుంటాయి. ఆర్థిక లావాదేవీలు క్రమంగా పుంజుకుంటాయి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. గణపతి స్తోత్రం పఠించాలి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. బంధువుల చేయూతతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అనుకూల ఫలితాలు సాధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలేర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. అనుకోని ఖర్చులుంటాయి. కొన్ని సమస్యలు తీరతాయి. కుంభ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి.

మీన రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. యుక్తితో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. పదోన్నతులు రాగలవు. ఆస్తి వివాదాలుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. శ్రమ పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కళారంగం వారికి అనుకూల సమయం. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం రుణవి మోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel