జూన్ 15, నేటి రాశి ఫలాలు.. ధనపరమైన విషయాలలో తొందరపడి ఎవరికీ మాట ఇవ్వొద్దు-today june 15th 2024 saturday rasi phalalu in telugu check zodiac wise results for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ 15, నేటి రాశి ఫలాలు.. ధనపరమైన విషయాలలో తొందరపడి ఎవరికీ మాట ఇవ్వొద్దు

జూన్ 15, నేటి రాశి ఫలాలు.. ధనపరమైన విషయాలలో తొందరపడి ఎవరికీ మాట ఇవ్వొద్దు

HT Telugu Desk HT Telugu
Jun 15, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ15.06.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూన్ 15వ తేదీ నేటి రాశి ఫలాలు
జూన్ 15వ తేదీ నేటి రాశి ఫలాలు (pinterest )

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 15.06.2024

వారం: శనివారం, తిథి : నవమి,

నక్షత్రం : ఉత్తర ఫల్గుణి, మాసం : జ్యేష్టము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున కొందరి ప్రవర్తన మానసిక చికాకు కలిగిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీరు చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో విందు, వినోదాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుతాయి. వాహన వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో వివాదాలేర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మీరు చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకులేర్పడతాయి. సహనం వహించడం అన్ని విధాల మేలు. కుటుంబ పరిస్థితులు అనుకూలం. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి విమర్శలు తప్పవు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. దూరప్రయాణాలు వాయిదాపడతాయి. ధనపరంగా కొంత చికాకులు ఏర్పడతాయి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో ఊహించని ఇబ్బందులు ఏర్పడతాయి. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. సింహ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారానికి ఆటంకాలు అధిగమిస్తారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రం పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ధనపరమైన విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. కుటుంబమున కొందరి మాటల వలన మానసిక చికాకులు కలుగుతాయి. నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగ వాతావరణం అంత అనుకూలంగా లేదు. అకారణంగా సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో ఆనందముగా గడిపెదరు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహన భూ లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగపరంగా అనుకూల సమయం. వ్యాపారాలలో సమస్యలు తగ్గుతాయి. సంతానపరంగా శుభకార్యాలకు ధనం ఖర్చు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చుట్టు పక్కల వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
WhatsApp channel