జులై 5, నేటి రాశి ఫలాలు..ఏ రాశి వాళ్ళు ఏ విధంగా పూజ చేస్తే శుభ ఫలితం కలుగుతుందంటే
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ05.07.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 05.07.2024
వారం: శుక్రవారం , తిథి : అమావాస్య,
నక్షత్రం: ఆర్ధ్ర, మాసం: జ్యేష్టము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ఉత్తరాయణం
మేషం
సహ ఉద్యోగులతో సఖ్యత పెంచుకుంటారు. మీ పనులు వేరే వాళ్లతో పూర్తి చేయించుకుంటారు. మీకు కావాల్సిన ప్రయోజనాలు దక్కించుకుంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. సంతానం పట్ల శ్రద్ధ కనబరుస్తారు. అపోహలతో అభద్రతా భావం కలిగి వుంటారు.
వృషభం
విదేశాలలో వ్యాపారాలు ప్రారంభించడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయ. కీళ్ల నొప్పులతో సతమతమవుతారు. ఆరోగ్య సలహాలు పాటించండి. నిద్ర మానుకొని చేసే దీర్ఘాలోచనల వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదని గ్రహించాలి. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారిని స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నూతన ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పక పాటించండి. సంతాన పురోగతి రీత్యా కీలకమైన నిర్ణయాలు అమలు పరుస్తారు. పూజల్లో నాగబంధం కుంకుమను ఉపయోగించండి.
కర్కాటకం
అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు ఆలోచనలు చేస్తారు. పిల్లల భవిష్యత్తు గురించి దీర్ఘాలోచనలు చేస్తారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వినోదభరితమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు.
సింహం
స్థలాల అమ్మకాలు కొనుగోలు వ్యవహారాలలో లాభాలు పొందుతారు. ప్రయత్న పూర్వకంగా కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన విద్యల పట్ల ఆసక్తి కనబరుస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. గవర్నమెంట్ ఉద్యోగం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. క్రయ- విక్రయాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు.
కన్య
ప్రేమ వ్యవహారాలు మీకు అంతగా కలిసి రావు. ఇంట్లో శుభ కార్యాలకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది. కార్యానుకూలత కోసం చేసే కొన్ని కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. చేతికి కుబేర కంకణం ధరించండి.
తుల
నూతన అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారం అభివృద్ధి దిశలో నడుస్తుంది. కుటుంబ పరిరక్షణ కోసం నూతన బాధ్యతలు చేపడతారు. పెంపుడు జంతువుల పట్ల ఆసక్తి కనబరుస్తారు. స్నేహితుల సహాయ సహకారాలు అందుకుంటారు.
వృశ్చిక
వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. లాభాలు అందుకుంటారు. ప్రయాణాలలో స్వల్ప ఆటంకాలు ఏర్పడతాయి. అనుకున్న సమయానికి పనులు కాకపోవడంతో చికాకు పడతారు. సహచర బృందంతో సన్నిహితంగా మెలుగుతారు. ప్రతిరోజూ దేవతలకు ప్రథమ తాంబూలం సమర్పించండి. శుభ వార్తలు వింటారు.
ధనుస్సు
శుభకార్య వ్యవహారాలకు సంబంధించిన ఆలోచనలు ముడిపడతాయి. ముహూర్తాలు కుదుర్చుకుంటారు. ఇరుగు-పొరుగు వారితో సఖ్యతగా మెలగాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కొంతమంది ప్రవర్తన మీకు ఏమాత్రం నచ్చదు. వాళ్ల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. జిల్లేడు వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం మంచిది.
మకరం
మీ కోసం, కుటుంబం కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు పాటిస్తారు. వ్యాపారాన్ని మరింత విస్తరింప చేయాలని ఆలోచిస్తారు. సంగీతం, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది.
కుంభం
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ప్రయోజనాలు ఆశించి స్నేహితుల ద్వారా రాయబారాలు నడుపుతారు. చేసిన పని కాక మళ్లీ ప్రయత్నాలు ప్రారంభిస్తారు.
మీనం
దూర ప్రాంతంలో వాళ్లు మీకు ఎంత సహకరించినా కొన్ని పనులు పూర్తికావు. కోరుకున్న మనిషిని పెళ్లి చేసుకోవడానికి అడ్డంకులు ఏర్పడతాయి. నూతన గృహానికి సంబంధించిన ఆలోచనలు చేస్తారు. అష్టమూలికా తైలం, లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయండి.