జులై 20, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా ఇబ్బందులు కలుగుతాయి-today july 20th 2024 rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జులై 20, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా ఇబ్బందులు కలుగుతాయి

జులై 20, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా ఇబ్బందులు కలుగుతాయి

HT Telugu Desk HT Telugu

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ20.07.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జులై 20వ తేదీ నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 20.07.2024

వారం: శ‌నివారం, తిథి : చ‌తుర్ద‌శి,

నక్షత్రం: పూర్వాషాఢ‌, మాసం : ఆషాఢ‌ము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి. బంధువులు మీతో మాట్లాడాల‌ని అనుకుంటారు. వ్యాపారలాభాలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు గుర్తింపు ల‌భిస్తుంది. వృత్తియందు అనుకూల స‌మ‌యం. అనుకున్న పనులు అనుకున్న స‌మ‌యానికి నెరవేరుతాయి.

వృష‌భ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి ఈరోజు స‌మ‌యం మీకు అనుకూలంగా లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రమకు తగిన ప్ర‌తిఫ‌లం రాదు. కుటుంబమునందు బాధ్యతలు పెరుగుతాయి. చికాకులు, ఇబ్బందులు కలుగును. కొన్ని శుభ పరిణాలు కనిపించును.

మిథున రాశి

అనుకూల స‌మ‌యం కాదు. వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమ ఉంటుంది. గృహానికి సంబంధించిన వస్తువులు కొంటారు. వ్యాపారపరంగా లాభదాయకంగా ఉంటుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు.

క‌ర్కాట‌క రాశి

క‌ర్కాట‌క రాశివారికి అనుకూల స‌మ‌యమిది. అనుకున్న పనులు నెరవేరును. సంతానపరంగా సౌఖ్యం. విందుభోజనాల్లో పాల్గొంటారు. శారీరక శ్రమ తగ్గును. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆనందం, ఆహ్లాదంగా గడుపుతారు. గృహ సంబంధమైన పనులు పూర్తిచేస్తారు. ధనప్రాప్తి క‌లుగుతుంది. శత్రువుల‌పై విజ‌యం సాధిస్తారు.

సింహ రాశి

స‌మ‌యం మీకు అనుకూలంగా లేదు. కాస్త జాగ్ర‌త్త‌గా ఉండండి. బాకీలు వసూలు కాక ధనప‌ర‌మైన‌ ఇబ్బందులు కలుగును. ఉద్యోగస్తులు పైఅధికారులచే మాట ప‌డ‌తారు. శుభకార్యక్రమాలు వాయిదా పడుట, ఒత్తిడి అధికముగా ఉండును. ఇంటాబయట సమస్యలు ఉండును.

కన్యా రాశి

ఇది మీకు ఒకింత ఇబ్బందులు క‌లిగించే స‌మ‌యం. ధనవ్యయము అధికమగును. కొన్ని ఇబ్బందులు వలన ప్రశాంతత చేకూరదు. అనవసర ప్రయాణములు వలన చికాకులు.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు స‌మ‌యం అన్నివిధాలుగా ఇబ్బందులు క‌లిగించును. వృత్తి, ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు అధికంగా ఉండ‌ను. ఆర్థిక ఇబ్బందులు నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు.

వృశ్చిక రాశి

తెలివితేటలతో మంచి పనులు చేస్తారు. గతంలో పూర్తి కాని పనులు పూర్తిచేస్తారు. శారీరక, మానసిక అలసటకు గురవుతారు. అయినవారి మధ్య అవగాహనలోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా కళత్రంతో ఘర్షణ వాతావరణం.

ధ‌న‌స్సు రాశి

ఖ‌ర్చులు అధికమగును. వ్యతిరేకులపై విజయం సాధిస్తారు. ఉద్యోగాభివృద్ధి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొంత అనుకూలం. ప్రయాణముల యందు జాగ్రత్త అవసరం. స్త్రీ మూలక సౌఖ్యము క‌లుగును.

మ‌క‌ర రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈరోజు సుఖమునకు ఇబ్బందులు ఏర్ప‌డును. ప్రయాణములు యందు విఘ్నములు క‌లుగును. కార్యహాని. వ్యాపారులకు వ్యాపారం అంతంత మాత్రమే. ఆశించిన మేర ఫలితములు ఉండవు.

కుంభ రాశి

స‌మ‌యం అంత అనుకూలంగా లేదు. వ్యవసాయదారులకు కొంత అనుకూలం. కుటుంబములో మాటపట్టింపులతో భేదాభిప్రాయములు. ప్రయాణముల యందు అపశృతులు. ఖర్చులధికమగును. అధికారులు మూలక ఒత్తిడి. దూరప్రయాణమువలన అలసట.

మీన రాశి

వృత్తిపర లాభములు పొందుతారు. వ్యాపారములో కొద్దిపాటి లాభములు ఉండును. శ్రమ, ప్రత్యర్థుల ఒత్తిడి వల్ల కొన్ని అపవాదులు. ఆర్థిక పరిస్థితి బాగుండుటచే సమస్యలకు పరిష్కారం. అనారోగ్య సమస్యలు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ