జులై 11, నేటి రాశి ఫలాలు.. మేషం సహా ఈ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం-today july 11th 2024 rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జులై 11, నేటి రాశి ఫలాలు.. మేషం సహా ఈ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం

జులై 11, నేటి రాశి ఫలాలు.. మేషం సహా ఈ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం

HT Telugu Desk HT Telugu
Jul 11, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ11.07.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జులై 11వ తేదీ నేటి రాశి ఫలాలు
జులై 11వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik )

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 11.07.2024

వారం: గురువారం, తిథి : పంచ‌మి,

నక్షత్రం: పూర్వ ఫ‌ల్గుణి, మాసం : ఆషాడ‌ము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ఉత్త‌రాయానం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు కుటుంబంలో ఆనందక‌ర వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. కీల‌క విష‌యాలకు సంబంధించిన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. గృహ‌ప‌ర‌మైన ప‌రిస్థితులు సంతృప్తినిస్తాయి. ఆత్మీయుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధన లాభయోగం ఉంది.

వృషభ రాశి

నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, లాభాలు ఉన్నాయి. ఆకస్మిక ధన యోగం ఉంది. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది. మనస్సు చంచలంగా ఉంటుంది. ఆత్మీయుల‌తో వివాదాల‌కు దూరంగా ఉండండి.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు ఈరోజు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెల‌కొంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కీల‌క విష‌యాల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగ ఉంటుంది. మానసికానందం లభిస్తుంది. గ‌తంలో వాయిదా వేసిన ప‌నుల‌ను పూర్తి చేస్తారు. వృత్తిప‌ర‌మైన జీవితంలో ఒకింత జాగ్ర‌త్త అవ‌స‌రం.

కర్కాటక రాశి

నూత‌న ప్ర‌య‌త్నాల్లో ఇబ్బందులు ఎదుర‌వుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగండి. రుణ ప్ర‌య‌త్నాలు చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. వృత్తి రీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. వివాదాల‌కు దూరంగా ఉండండి.

సింహ రాశి

విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబకలహాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ధ‌న న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్ర‌త్త అవ‌స‌రం. వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది.

కన్యా రాశి

వృత్తిరీత్యా ఇబ్బందులు అధిగమిస్తారు. మానసిక ఆందోళ‌న‌తో కాలం గడుపుతారు. కీల‌క విష‌యాల్లో స‌మ‌స్య‌లు ఎదురువుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డుతుంది. నిరుత్సాహం త‌గ‌దు. ఆత్మీయుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు. శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం ల‌భిస్తుంది.

తులా రాశి

ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళ‌న తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. బంధు, మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. గొప్ప వ్యక్తులతో సంబంధం ఏర్ప‌డుతుంది .

వృశ్చిక రాశి

రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. చేప‌ట్టిన ప‌నులు సంపూర్ణంగా పూర్తి చేస్తారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.రుణ ప్ర‌య‌త్నాలు సుల‌భంగా ఫ‌లిస్తాయి. బంధుమిత్రుల‌తో గొడ‌వ‌లకు దూరంగా ఉండండి.

ధనుస్సు రాశి

అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నా. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు ఉంటాయి. బంధుమిత్రుల‌తో వివాదాలకు దూరంగా ఉండండి. నూత‌న ప్ర‌య‌త్నాలు చేస్తారు.

మకర రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్ప‌డే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనారోగ్య బాధ వ‌ల్ల‌ బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు.

కుంభ రాశి

ఆకస్మిక ధనలాభ యోగముంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణ ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. కుటుంబంలో సుఖ, సంతోషాలుంటాయి. ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యములు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి.

మీన రాశి

వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండుట మంచిది. ఆకస్మిక భయము, ఆందోళన ఆవహిస్తాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner