జులై 10, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి-today july 10th 2024 rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జులై 10, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి

జులై 10, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి

HT Telugu Desk HT Telugu
Jul 10, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ10.07.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జులై 10 వ తేదీ నేటి రాశి ఫలాలు
జులై 10 వ తేదీ నేటి రాశి ఫలాలు (pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 10.07.2024

వారం: బుధ‌వారం, తిథి : చ‌వితి,

నక్షత్రం: మ‌ఖ‌, మాసం : ఆషాడ‌ము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. కీల‌క స‌మ‌యాల్లో స‌మ‌య‌స్ఫూర్తితో రాణిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ల‌భిస్తుంది. ప్ర‌య‌త్నాలు ఆశాజ‌న‌క ఫ‌లితాలు అందిస్తాయి. చేప‌ట్టిన ప‌నుల‌ను స‌కాలంలో పూర్తి చేస్తారు. బంధువుల ఆక‌స్మిక‌ రాక ఒకింత‌ ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబానికి సంబంధించిన‌ కీలక చర్చల్లో పాల్గొంటారు. పదవులు స్వీకరించేందుకు అనువైన కాలం.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికమ‌వుతాయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. కొన్ని విషయాలు అనుకున్న విధంగా సాగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు స్థిమితంగా పూర్తి చేస్తారు. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న ప‌నులు కొంత‌మేర పూర్తి అవుతాయి. ఆరోగ్యం విష‌యంలో శ్ర‌ద్ధ అవ‌స‌రం.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈరోజు పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. రావలసిన ధనం స‌మ‌యానికి అందుతుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. ఇత‌రుల విష‌యాల్లో అనవసర జోక్యం తగదు. ఆత్మీయుల‌ను క‌లుస్తారు.

కర్కాటక రాశి

లక్ష్యసాధనకు సంకల్పం ముఖ్యం. ధైర్యంగా యత్నాలు కొనసాగిం చండి. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. అవకాశాలను వదులుకోవద్దు. ఖర్చులు ఒకింత అదుపు చేయండి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. కీల‌క కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి.

సింహ రాశి

కీల‌క విష‌యాలకు సంబంధించిన చ‌ర్చ‌లు కొలిక్కి వస్తాయి. వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. పనులు ముందుకు సాగవు. వైద్య సేవలు అవసరమవుతాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది.

కన్యా రాశి

దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ కృషి ఫలిస్తుంది. విజ్ఞతతో అందరినీ ఆకట్టుకుంటారు. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పిల్లల దూకుడు కట్టడి చేయండి. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.

తులా రాశి

గ‌తంలో పోలిస్తే తుల రాశి వారికి అనుకూల వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. కీల‌క ప‌నుల‌పై స్వ‌యంగా దృష్టి పెట్టండి. ఇత‌రుల విష‌యాల‌ను ప‌ట్టించుకోవ‌ద్దు. ప్ర‌ముఖుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతారు.

వృశ్చిక రాశి

కీల‌క విష‌యాల్లో విజయం, ధనలాభం ఉన్నాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉన్నాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఇంట్లో ప్రశాంత వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ఆరోగ్యంప‌ట్ల‌ జాగ్రత్త అవ‌స‌రం. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.

ధనుస్సు రాశి

సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పిల్లల కృషి ఫలిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తగవు.

మకర రాశి

ఆశావహదృక్పథంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. యత్నాలు కొనసాగించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడతారు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడ తాయి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం.

కుంభ రాశి

ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఓర్పుతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అపోహలకు తావివ్వవద్దు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. గిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టిం చేందుకు యత్నిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.

మీన రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆశించిన ఫలితాలున్నాయి. మాట తీరు ఆకట్టుకుంటుంది. రుణ సమస్యలు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. కీల‌క‌ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. నూత‌న ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel