జూలై 6న ఆషాఢ మాసంలో వచ్చే మొదట ఏకాదశి అయినటువంటి తొలి ఏకాదశి చాలా పవిత్రమైనది. తొలి ఏకాదశి నాడు మహావిష్ణువును ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. విష్ణువు అనుగ్రహాన్ని పొందడానికి తొలి ఏకాదశి శక్తివంతమైన రోజు. తొలి ఏకాదశి నాడు ఏం చేయాలి, తొలి ఏకాదశి నాడు ఎటువంటి వాటిని ఆచరించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు, పూజ చేయడం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయి వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
తొలి ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించడం వలన మంచి ఫలితం ఉంటుంది. శరీర, మానసిక శాంతిని పొందవచ్చు. ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది. కుటుంబం సుఖంగా ఉంటుంది. సంపదలను ఆకర్షించవచ్చు.
తొలి ఏకాదశి నుంచే పండుగలు అన్ని మొదలవుతాయి. అందుకనే దీనిని తొలి ఏకాదశి అని, తొలి పండుగ అని అంటారు. దీనినే "శయన ఏకాదశి" అని కూడా అంటారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఇది మొదటిది. విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక కలగాలంటే ఉపవాసం ఉండాలి. విష్ణుమూర్తిని పూజించిన తర్వాత పాలు, పండ్లు వంటి ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి.
ఉపవాస దీక్షను ద్వాదశి రోజు విరమించాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండేది ఆదర్శం. తర్వాత ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. ఇలా చేయడాన్నే తొలి ఏకాదశి వ్రతం అని అంటారు. ఈ వ్రతం చేయడం వలన కుచేలుడికి దరిద్రం తొలగిపోయి సకల సంపదలు కలిగాయని పురాణాల్లో చెప్పబడింది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.