ఈరోజు స్కంద పంచమి, సోమవారం. చాలా మంచి రోజు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన సమస్యలన్నీ తొలగి సంతోషంగా ఉండవచ్చు. ఎలాంటి బాధలు ఉన్నా సరే, ఈరోజు తొలగిపోతాయి. స్కంద పంచమి నాడు ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలని పాటిస్తే మంచిది వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
ఆషాడ మాసంలో వచ్చే ఈ స్కంద పంచమి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకుని 11 సార్లు స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటే మంచిది. అలాగే, “ఓం శం శరవణభవాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. చాలా కాలం నుంచి వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికే వివాహం అయ్యే అవకాశం ఉంది.
సంతానం కలగాలంటే కూడా ఈ పరిహారాలను పాటించండి. రాహు, కేతువుల వలన కాలసర్ప దోషంతో బాధపడే వారు కూడా ఈ పరిహారాలను పాటించవచ్చు. ఇలా చేయడం వలన దోష ప్రభావం తగ్గుతుంది. ఈ విధంగా పాటించడం వలన ఉద్యోగంలో అభివృద్ధి కూడా కలుగుతుంది.
ఇలా పైన చెప్పిన విధంగా ఆరాధించడం వలన రుణబాధలు, రణబాధలు, శారీరక బాధలు, వాహన బాధలు, శత్రు పీడలు, అన్ని రకాల చికాకులు తొలగిపోతాయి. ప్రశాంతంగా, సంతోషంగా ఉండొచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సులువుగా తొలగించుకోవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.