Sheetala Saptami 2025: ఈరోజే శీతల సప్తమి.. పూజా విధానం, ముహూర్తం, నైవేద్యంతో పాటు పూర్తి వివరాలు ఇవిగో-today is sheetala saptami 2025 check pooja vidhanam muhurtam naivedyam and mantras details from here ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sheetala Saptami 2025: ఈరోజే శీతల సప్తమి.. పూజా విధానం, ముహూర్తం, నైవేద్యంతో పాటు పూర్తి వివరాలు ఇవిగో

Sheetala Saptami 2025: ఈరోజే శీతల సప్తమి.. పూజా విధానం, ముహూర్తం, నైవేద్యంతో పాటు పూర్తి వివరాలు ఇవిగో

Peddinti Sravya HT Telugu

Sheetala Saptami 2025: శీతల సప్తమి రోజున వ్రతం చేసి పూజ చేయడం వల్ల దద్దుర్లు వంటి వ్యాధులను నియంత్రిస్తుందని, వాటి నుండి రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు. శీతల సప్తమి పూజా విధానం, ముహూర్తం, నైవేద్యం, మంత్రాలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఈరోజే శీతల సప్తమి

శీతల అష్టమికి ఒక రోజు ముందు శీతల సప్తమి పండుగను జరుపుకుంటారు. శీతల సప్తమి, శీతల అష్టమి రెండు రోజులూ పూజిస్తారు. శీతలా సప్తమి మరియు అష్టమి రెండింటినీ బసోడా అంటారు. రెండు రోజులూ అమ్మవారికి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పండుగ చైత్రమాసం కృష్ణపక్ష సప్తమి, అష్టమి తిథులలో జరుపుకుంటారు.

శీతల సప్తమి పూజ ఎప్పుడు జరుగుతుంది?

సప్తమి తిథి 21 మర్చి 2025న తెల్లవారుజామున 02 గంటల 45 నిమిషాలకు ప్రారంభమై, 22 మర్చి 2025న ఉదయం 04 గంటల 23 నిమిషాలకు ముగుస్తుంది. శీతల సప్తమి పూజ 21 మర్చి 2025, శుక్రవారం జరుగుతుంది.

శీతలా సప్తమి పూజ ముహూర్తం

శీతల సప్తమి పూజ ముహూర్తం ఉదయం 06 గంటల 24 నిమిషాల నుండి సాయంత్రం 06 గంటల 33 నిమిషాల వరకు ఉంటుంది. పూజ మొత్తం 12 గంటల 09 నిమిషాలు ఉంటుంది.

శీతలమ్మను ఎలా పూజించాలి?

  1. ముందుగా ఉదయం లేచి స్నానం చేసి, శీతలమ్మ ఫోటో లేదా విగ్రహాన్ని పూజా స్థలంలో ప్రతిష్ఠించండి.
  2. దీపారాధన చేసి, ఆ తరువాత శీతలమ్మకు పూలు, పండ్లను నైవేద్యంగా సమర్పించాలి.
  3. అమ్మవారికి హారతి ఇచ్చి నమస్కరించండి.

శీతలమ్మకు ఏ నైవేద్యం సమర్పించాలి?

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, శీతలమ్మకు చల్లని ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున భక్తులు కూడా చల్లని ఆహారం మాత్రమే తీసుకుంటారు. పూజా దినాన ఎటువంటి వేడి పానీయాలు లేదా ఆహార పదార్థాలను తీసుకోకూడదు.

శీతల సప్తమి పూజకు శుభ ముహూర్తాలు

బ్రహ్మ ముహూర్తం- 04:49 AM నుండి 05:36 AM వరకు

ప్రాతః సంధ్య - 05:13 AM నుండి 06:24 AM వరకు

అభిజిత్ ముహూర్తం- 12:04 PM నుండి 12:53 PM వరకు

విజయ ముహూర్తం- 02:30 PM నుండి 03:18 PM వరకు

గోధూళి ముహూర్తం- 06:32 PM నుండి 06:55 PM వరకు

సంధ్యా సమయం- 06:33 PM నుండి 07:44 PM వరకు

అమృత కాలం- 04:08 PM నుండి 05:53 PM వరకు

శీతల సప్తమి రోజున భద్రా ఎప్పుడు ముగుస్తుంది?

శీతల సప్తమి రోజున భద్రా ఉంటుంది. 21 మార్చి 2025న ఉదయం 06 గంటల 24 నిమిషాలకు భద్రా ప్రారంభమై మధ్యాహ్నం 03 గంటల 38 నిమిషాలకు ముగుస్తుంది.

శీతలమ్మ మంత్రం

శీతలమ్మను పూజించేటప్పుడు, నైవేద్యం సమర్పించేటప్పుడు ''శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా. శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమో నమః'' అనే మంత్రాన్ని జపించాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం