Surya Deva Slokas: ఈరోజే రథసప్తమి.. సూర్యుని అనుగ్రహం కలగాలంటే ఆదిత్య హృదయంతో పాటు ఈ మంత్రాలు జపించండి-today is rathasaptami chant these mantras and aditya hrudayam for sun lord blessings surya deva slokas brings happiness ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Surya Deva Slokas: ఈరోజే రథసప్తమి.. సూర్యుని అనుగ్రహం కలగాలంటే ఆదిత్య హృదయంతో పాటు ఈ మంత్రాలు జపించండి

Surya Deva Slokas: ఈరోజే రథసప్తమి.. సూర్యుని అనుగ్రహం కలగాలంటే ఆదిత్య హృదయంతో పాటు ఈ మంత్రాలు జపించండి

Peddinti Sravya HT Telugu
Feb 04, 2025 07:00 AM IST

Surya Deva Slokas: కింద ఉన్న సూర్య దేవుని మంత్రాలను మీకున్న సమస్యను బట్టి జపిస్తే వ్యాధుల నుంచి బయట పడొచ్చు. శారీరక, మేదో, మానసిక సమస్యలు కూడా నయమవుతాయి. మానసిక ప్రశాంతత కలగాలంటే కూడా ఈ సూర్య మంత్రాలను జపించండి. దీంతో సులువుగా బాధల నుంచి బయటపడొచ్చు.

Surya Deva Slokas: ఈరోజే రథసప్తమి.. సూర్యుని అనుగ్రహం కలగాలంటే ఆదిత్య హృదయంతో
Surya Deva Slokas: ఈరోజే రథసప్తమి.. సూర్యుని అనుగ్రహం కలగాలంటే ఆదిత్య హృదయంతో (pinterest)

ఈ రోజే రథసప్తమి. రథసప్తమి నాడు సూర్యుని అనుగ్రహం కలగాలంటే ఆదిత్య హృదయంతో పాటుగా ఈ సూర్యుని మంత్రాలని జపించండి. చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

yearly horoscope entry point

అయితే కింద ఉన్న సూర్య దేవుని మంత్రాలను మీకున్న సమస్యను బట్టి జపిస్తే వ్యాధుల నుంచి బయట పడొచ్చు. శారీరక, మేదో, మానసిక సమస్యలు కూడా నయమవుతాయి. మానసిక ప్రశాంతత కలగాలంటే కూడా ఈ సూర్య మంత్రాలను జపించండి. దీంతో సులువుగా బాధల నుంచి బయటపడొచ్చు.

ఆదిత్య హృదయం

నమస్సవిత్రే జగదేక చక్షుసే

జగత్ప్రసూతి స్థితి నాశహేతవే

త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే

విరించి నారాయణ శంకరాత్మనే

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్

ఉపగమ్యా బ్రవీద్రామమ్ అగస్త్యో భగవాన్ ఋషిః

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్

యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి

ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్

జయావహం జపేన్నిత్యమ్ అక్షయ్యం పరమం శివమ్

సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్

చింతాశోక ప్రశమనమ్ ఆయుర్వర్ధన ముత్తమమ్

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్

పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః

ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః

మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః

వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్

సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్

తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకో‌oశుమాన్

హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః

అగ్నిగర్భో‌உదితేః పుత్రః శంఖః శిశిరనాశనః

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః

ఘనావృష్టి రపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః

కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః

నక్షత్ర గ్రహ తారాణామ్ అధిపో విశ్వభావనః

తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్-నమో‌உస్తు తే

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః

జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః

నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః

నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే

కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే

నమస్తమో‌உభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః

ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ

యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః

ఫలశ్రుతిః

ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ

కీర్తయన్ పురుషః కశ్చిన్-నావశీదతి రాఘవ

పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్

ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి

ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్

ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకో‌உభవత్-తదా

ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్

సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో‌உభవత్

అధ రవిరవదన్-నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః

నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి

సూర్యదేవుని మంత్రాలు

  1. ఓం హామ్ మిత్రయా నమః (ఆరోగ్యం బాగుంటుంది)
  2. ఓం హ్రీం బానవే నమః (మూత్రాశయ సంబంధిత సమస్యలు నయం అవుతాయి)
  3. ఓం హూం సూర్యయా నమః (మానసిక ప్రశాంతత కలుగుతుంది)
  4. ఓం హామ్ పుషనే నమః (బలం, సామర్థ్యం పెరుగుతాయి)
  5. ఓం హ్రీం హిరణ్యగర్భాయ నమః (శారీరిక, మేధో, మానసిక సమస్యలు నయం అవుతాయి)
  6. ఓం మేరీచీ నమః (వ్యాధులు రావు)

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం