ఈరోజే పరశురామ జయంతి.. మేష రాశి నుంచి మీన రాశి వరకు వేటిని దానం చేయాలో తెలుసుకోండి!-today is parasurama jayanthi check what to donate based on zodiac signs aries tarus to pisces ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈరోజే పరశురామ జయంతి.. మేష రాశి నుంచి మీన రాశి వరకు వేటిని దానం చేయాలో తెలుసుకోండి!

ఈరోజే పరశురామ జయంతి.. మేష రాశి నుంచి మీన రాశి వరకు వేటిని దానం చేయాలో తెలుసుకోండి!

Peddinti Sravya HT Telugu

పరశురామ జయంతి రోజున విష్ణువును ప్రధానంగా పూజిస్తారు. పరశురామ జయంతి పర్వదినం సందర్భంగా మీ రాశిచక్రం ప్రకారం దానం చేయడం వల్ల జీవితంలోని బాధలు, డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

పరశురామ జయంతి

పరశురాముడి ఆరవ అవతారంగా భావించే శ్రీమహావిష్ణువు జన్మదినంగా పరశురామ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. భగవంతుని అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కూడా ఉంటాయి.

పరశురామ జయంతి పర్వదినం సందర్భంగా మీ రాశిచక్రం ప్రకారం దానం చేయడం వల్ల జీవితంలోని బాధలు, డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. పరశురామ జయంతి రోజున వేటిని దానం చెయ్యాలో తెలుసుకోండి.

మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు ఏం దానం చెయ్యాలో తెలుసుకోండి

మేష రాశి: పరశురామ జయంతి రోజున ధాన్యాలు లేదా ఎరుపు రంగు దుస్తులను దానం చేయండి.

వృషభ రాశి: పరశురామ జయంతి రోజున పాలు, బియ్యం దానం చేయండి.

మిథున రాశి: మిథున రాశి వారు పరశురామ జయంతి రోజున కూరగాయలు, పెసరపప్పు దానం చేయాలి.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు పరశురామ జయంతి రోజున పంచదార, ఆహారాన్ని దానం చేయండి.

సింహ రాశి: పరశురామ జయంతి రోజున బెల్లం దానం చేయాలి.

కన్య రాశి: పరశురామ జయంతి రోజున ఉసిరిని దానం చేయాలి.

తులా రాశి: తులా రాశి వారు పరశురామ జయంతి రోజున పెర్ఫ్యూమ్, గంగాజలం, గులాబీ రంగు దుస్తులను దానం చేయండి.

వృశ్చిక రాశి: పరశురామ జయంతి రోజున బెల్లంతో చేసిన మిఠాయిలను దానం చేయాలి.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారు పరశురామ జయంతి రోజున తేనె దానం చేయాలి.

మకర రాశి: పరశురామ జయంతి రోజున నల్ల నువ్వులను దానం చేయాలి.

కుంభ రాశి : కుంభ రాశి వారు పరశురామ జయంతి రోజున నల్ల మినప్పప్పు దానం చేయాలి.

మీన రాశి: పరశురామ జయంతి రోజున పసుపు లేదా బట్టలు, పండ్లు లేదా మరేదైనా వస్తువును దానం చేస్తే మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం