Mauni Amavsya: ఈరోజే మౌని అమావాస్య.. ఈరోజు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి, ఇలా చేస్తే కోటి జన్మల పాపాలు తొలగిపోవచ్చు
Mauni Amavsya: అమావాస్య నాడు పితృదేవతలను ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటాము. వారి పేరు చెప్పి తర్పణాలు వదులుతూ ఉంటాము. అమావాస్య గురించి చెప్పుకుంటే చాలా ఉంది. అయితే, ఈసారి వచ్చే అమావాస్యని మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తాము. ఈ అమావాస్య నాడు కొన్ని పాటించడం వలన మంచి ఫలితం ఉంటుంది.
అమావాస్యకు మనం ఎంతో ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము. అమావాస్య నాడు పితృదేవతలను ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటాము. వారి పేరు చెప్పి తర్పణాలు వదులుతూ ఉంటాము. అమావాస్య గురించి చెప్పుకుంటే చాలా ఉంది. అయితే, ఈసారి వచ్చే అమావాస్యని మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తాము. ఈ అమావాస్య నాడు కొన్ని పాటించడం వలన మంచి ఫలితం ఉంటుంది.

అలాగే కొన్ని పొరపాట్ల చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు కొన్నిటిని పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రం నుంచి కూడా బయటపడడానికి అవుతుంది. పుష్య మాసంలో కృష్ణపక్ష అమావాస్యని చొల్లంగి అమావాస్య లేదంటే మౌని అమావాస్య అని పిలుస్తారు.
ఈ సంవత్సరం మౌని అమావాస్య ఎప్పుడు?
ఈసారి మౌని అమావాస్య జనవరి 29న వచ్చింది. దీనినే చొల్లంగి అమావాస్య అంటారు. ఈ అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. మౌని లేదా చొల్లంగి అమావాస్య నాడు ఏ పనులు చేస్తే మంచిది, ఏ పనులు చేయకూడదు వంటివి తెలుసుకుందాం.
చొల్లంగి అమావాస్య నాడు ఏం చేయాలి?
- చొల్లంగి అమావాస్య నాడు వేకువజామున నిద్ర లేవాలి.
- సాధన, తపస్సు చేస్తే భగవంతుడు అనుగ్రహాన్ని పొందవచ్చు.
- తల స్నానం చేయాలి. తలను మాత్రం రుద్దుకోకూడదు.
- సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.
- అలాగే స్నానం చేసేంత వరకు ఏమీ మాట్లాడకూడదు. మౌనంగా ఉంటే మంచిది.
- ఈ అమావాస్య నాడు పెద్దలు పేర్లు చెప్పి తర్పణాలు వదిలితే దరిద్రం తొలగిపోతుంది.సంతోషంగా ఉండొచ్చు. పూర్వీకుల ఆశీస్సులు మనపై ఉంటాయి.
- అమావాస్య నాడు కచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి.
- మౌని అమావాస్యనాడు గంగా స్నానం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది.
- పిండిలో పంచదార కలిపి దానిని చీమలకి ఆహారంగా పెడితే విశేష పలితాన్ని పొందవచ్చు.
- అమావాస్యనాడు పవిత్ర నదిలో స్నానం చేసాకా నల్ల నువ్వుల్ని దానం చేస్తే కూడా పూర్వికులు సంతృప్తి చెందుతారు.
- నల్ల నూనె, దుప్పట్లు, ఉసిరికాయ, నల్లని వస్త్రాలు పేదవాళ్లకు దానం చేస్తే కోటి జన్మల పాపం తొలగిపోతుంది.
- ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసి, రాత్రి ఫలహారాన్ని తీసుకోవడం మంచిది.
చొల్లంగి అమావాస్య నాడు ఏం చేయకూడదు?
- ఈరోజు మధ్యాహ్నం నిద్ర పోవడం అసలు మంచిది కాదు. అలా చేస్తే దరిద్రం పట్టుకుంటుంది.
- చొల్లంగి అమావాస్య నాడు తలకు నూనె రాసుకోవడం కూడా మంచిది కాదు.
- జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం లాంటివి కూడా చేయకండి.
- ఈరోజు అస్సలు ఎవరినీ మోసం చేయకూడదు.
- ఆలస్యంగా నిద్ర లేవడం కూడా మంచిది కాదు.
- పెద్దలని తిట్టడం, దూషించడం లాంటివి అస్సలు మంచిది కాదు.
- ఎవరితో గొడవపడడం అసలు మంచిది కాదు.
- ఎవరినీ శపించడం, తిట్టడం లాంటివి చేయకూడదు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం