ఈరోజు కుజుని మహా సంచారం, కేతువుతో అశుభ సంయోగానికి స్వస్తి.. 4 రాశుల వారికి అపారమైన సంపద, సంతోషంతో పాటు ఎన్నో!-today is maha samcharam mars ketu get separated these 4 rasis receives immense wealth happiness and many more check now ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈరోజు కుజుని మహా సంచారం, కేతువుతో అశుభ సంయోగానికి స్వస్తి.. 4 రాశుల వారికి అపారమైన సంపద, సంతోషంతో పాటు ఎన్నో!

ఈరోజు కుజుని మహా సంచారం, కేతువుతో అశుభ సంయోగానికి స్వస్తి.. 4 రాశుల వారికి అపారమైన సంపద, సంతోషంతో పాటు ఎన్నో!

Peddinti Sravya HT Telugu

కుజుడు కేతువు సంయోగం చెందడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈరోజు అంటే జూలై 28న ఈ సంయోగం తొలగిపోతుంది. దీనితో నాలుగు రాశుల వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కెరీర్‌లో కలిసి వస్తుంది. డబ్బుతో పాటు ఎన్నో లాభాలు ఉంటాయి. పెండింగ్‌లో ఉన్న డీల్స్ ఫైనల్ అవుతాయి. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది.

కుజుని సంచారంలో మార్పు.. ఈ రాశులకు అనేక లాభాలు (pinterest)

గత ఏడాది నుంచి కుజుడు సింహ రాశిలో ఉన్నాడు. దీనితో ప్రపంచంలో, దేశంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. కుజుడు కేతువు సంయోగం చెందడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈరోజు అంటే జూలై 28న ఈ సంయోగం తొలగిపోతుంది. దీనితో నాలుగు రాశుల వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి.

కెరీర్‌లో కలిసి వస్తుంది. డబ్బుతో పాటు ఎన్నో లాభాలు ఉంటాయి. పెండింగ్‌లో ఉన్న డీల్స్ ఫైనల్ అవుతాయి. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. తల్లి నుంచి డబ్బు పొందుతారు. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మరి కుజ-కేతువుల సంయోగం తొలగిపోవడంతో ఏ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు? ఎవరికి ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం:

కుజుని సంచారంలో మార్పు.. ఈ రాశులకు అనేక లాభాలు

1.మేష రాశి:

మేష రాశి వారికి కుజుని సంచారంలో మార్పు రావడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారు కెరీర్‌లో అనేక లాభాలను పొందుతారు. ఈ రాశి వారి మీద నమ్మకం పెరుగుతుంది. దీనితో వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. తల్లి నుంచి డబ్బు పొందుతారు. దీర్ఘకాలిక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. విద్యార్థులు సక్సెస్‌ను పొందుతారు.

2.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది. కెరీర్‌లో మార్పులు చోటు చేసుకుంటాయి. పెండింగ్‌లో ఉన్న డీల్స్ ఫైనల్ అవుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. కొత్త ఉద్యోగం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

3.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది. కుజుని మార్పుతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సీనియర్లు మీ పనిని ప్రశంసిస్తారు. డబ్బును ఆదా చేస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.

4.ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి కుజుడు సంచారంలో మార్పు రావడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. పాత సమస్యలు తీరిపోతాయి. ఓడిపోయిన వాటి నుంచి గెలుపొందుతారు. శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగం వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.