ఈరోజే గంగా దసరా.. ఈరోజు ఈ 4 పనులు చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి!-today is ganga dussehra do these 4 remedies for happy life wealth and more ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈరోజే గంగా దసరా.. ఈరోజు ఈ 4 పనులు చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి!

ఈరోజే గంగా దసరా.. ఈరోజు ఈ 4 పనులు చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి!

Peddinti Sravya HT Telugu

ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం శుక్లపక్షం దశమి నాడు గంగా దసరాను జరుపుకుంటాము. పాపాలను పోగొట్టే, మోక్షాన్ని అందించే దేవతగా గంగను భావిస్తారు. గంగ రోగాలను కూడా నయం చేస్తుందని నమ్ముతారు. ఈరోజు స్నాన, దానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొన్నిటిని పాటించడం వలన కష్టాలు తొలగిపోతాయి.

ఈరోజే గంగా దసరా (pinterest)

హిందూమతంలో గంగా దసరాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం శుక్లపక్షం దశమి నాడు గంగా దసరాను జరుపుకుంటాము. ఈరోజు గంగ మాత స్వర్గం నుంచి భూమికి అవతరించిందని అంటారు. పాపాలను పోగొట్టే, మోక్షాన్ని అందించే దేవతగా గంగను భావిస్తారు. గంగ రోగాలను కూడా నయం చేస్తుందని నమ్ముతారు.

గంగా దసరా ఎప్పుడు వచ్చింది?

ఈ సంవత్సరం గంగా దసరా జూన్ 5, గురువారంనాడు వచ్చింది. ఈరోజు స్నాన, దానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొన్నిటిని పాటించడం వలన కష్టాలు తొలగిపోతాయి, పుణ్యం లభిస్తుంది. రాత్రిపూట కొన్ని పరిహారాలను పాటిస్తే జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది.

ఈసారి గంగా దసరా రోజు ఏం చేయాలి?, ఎటువంటి వాటిని పాటిస్తే మంచి జరుగుతుంది అంటే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గంగా దసరా నాడు విశేష ఫలితాలను పొందాలంటే ఇలా చేయండి:

1. గంగాజలంతో దీపారాధన:

గంగా దసరా నాడు గంగాజలంతో దీపాన్ని వెలిగిస్తే మంచిది. రాత్రి తులసి మొక్క దగ్గర గంగాజలంలో స్వచ్ఛమైన నెయ్యి కలిపి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పరిహారాన్ని పాటించడం వలన ఇంట్లో సానుకూల మార్పులు వస్తాయి. ఆనందం, శాంతి కలుగుతాయి.

2. గంగాజలంతో ఇంటిని శుద్ధి చేయండి:

గంగా దసరా నాడు గంగాజలాన్ని ఇంట్లో చల్లండి. ఇలా చేయడం వలన నెగటివ్ శక్తి తొలగిపోతుంది. ముఖ్యంగా ఇంటి ముఖద్వారం, పూజ గది, వంటింట్లో గంగాజలాన్ని చల్లాలి. ఇది సానుకూల శక్తిని తీసుకురాగలదు, ప్రతికూల శక్తిని తొలగించగలదు. పేదరికం కూడా తొలగిపోతుంది.

3. గంగా స్తోత్రం లేదా హారతి:

గంగా దసరా నాడు గంగా స్తోత్రం లేదా, గంగా హారతి కానీ రాత్రి చదవడం మంచిది. ఇలా చేయడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. గంగాదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.

4. గంగా నది దగ్గర దీపారాధన:

కుదిరితే గంగా నది ఒడ్డున దీపారాధన చేయడం మంచిది. నువ్వుల నూనె లేదా నెయ్యితో ఆరాధన చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. కష్టాల నుంచి బయటపడొచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.