ప్రతీ సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు బుద్ధ పూర్ణిమను జరుపుకుంటాము. బుద్ధ బౌద్ధమతంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు బుద్ధుడు జ్ఞానోదయాన్ని పొంది, ప్రపంచానికి దుఃఖాల నుంచి విముక్తి మార్గాన్ని చూపించారు. ఈసారి బుద్ధ పూర్ణిమ మే 12 అంటే ఈరోజు వచ్చింది. మతపరంగానే కాదు జ్యోతిష్య శాస్త్ర కోణం నుంచి కూడా ఇది చాలా ముఖ్యమైన రోజు.
ఈరోజు వరియన్, రవి యోగాలు ఏర్పడ్డాయి. ఈ యోగాల వలన కొన్ని రాశుల వారికి ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ యోగాల ప్రభావం వారి జీవితంలో సానుకూల మార్పులని, కొత్త అవకాశాలని ఇస్తుంది. బుద్ధ పూర్ణిమ తర్వాత ఏ రాశుల వారికి ఎక్కువ ఫలితాలు ఉంటాయి, ఎటువంటి లాభాలను పొందవచ్చు వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.
వృషభ రాశి వారికి బుద్ధ పూర్ణిమ కలిసి వస్తుంది. జీవితంలో సంతోషం ఉంటుంది. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. మానసికంగా కూడా సమస్యలు తొలగిపోతాయి. పాత సమస్యలు తీరుతాయి. నమ్మకం పెరుగుతుంది. కెరియర్ లో కూడా సక్సెస్ ని అందుకోవచ్చు. గౌరవం కూడా పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
కర్కాటక రాశి వారికి బుద్ధ పూర్ణిమ రోజు కలిసి వస్తుంది. జీవితంలో పరిపూర్ణత తెస్తుంది. సుఖాలు, విలాసాలు పెరుగుతాయి. విద్యా రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి శుభప్రదం.
చదువుల్లో సానుకూల మార్పులు ఉంటాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి. కొత్తగా పెళ్లయిన జంటలకు ఈ సమయం ఆహ్లాదకరంగా ఉంటుంది. పని ప్రదేశంలో కూడా సక్సెస్ ని అందుకోవచ్చు.
ధనస్సు రాశి వారికి బుద్ధ పూర్ణిమ రోజు కలిసి వస్తుంది. సానుకూల మార్పులని తీసుకొస్తుంది. కొత్త నైపుణ్యాలని నేర్చుకోవడంలో ఆసక్తి ఉంటుంది. కెరియర్లో విజయాలు ఉంటాయి. కృషి, జ్ఞానాన్ని చూసి పై అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి.
ఆర్థిక పరంగా కూడా ప్రయోజనం ఉంటుంది. సంపద పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. పేరు, ప్రతిష్టలు వస్తాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.