Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. వీరిని ఆపదలు చుట్టుముడుతాయి-today horoscope telugu for tuesday september 26 2023 check your zodiac sign predictions ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  Today Horoscope Telugu For Tuesday September 26 2023 Check Your Zodiac Sign Predictions

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. వీరిని ఆపదలు చుట్టుముడుతాయి

HT Telugu Desk HT Telugu
Sep 26, 2023 01:00 AM IST

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు(దిన ఫలాలు), తేదీ 26.09.2023 మంగళవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈరోజు రాశి ఫలాలు తేదీ సెప్టెంబరు 26, 2023 మంగళవారం
ఈరోజు రాశి ఫలాలు తేదీ సెప్టెంబరు 26, 2023 మంగళవారం (pixabay)

ఈరోజు రాశి ఫలాలు(దిన ఫలాలు), తేదీ 26.09.2023

ట్రెండింగ్ వార్తలు

వారం: మంగళవారం, తిథి: ద్వాదశి 

నక్షత్రం: శ్రవణం, మాసం: భాద్రపదం, 

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలించును. ప్రయాణాల్లో సమస్యలుంటాయి. మనస్తాపం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి. ధనయోగం ఉంది. కొందరి ప్రవర్తన వలన లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. అధ్యాత్మిక బలాన్ని పెంచుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించండి. శుభం కలుగుతుంది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆర్థికపరమైన సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ప్రమేయంతో ఒక విషయంలో లాభపడతారు. ఆపదలు చుట్టుముడతాయి. వాటిని తెలివిగా పరిష్కరిస్తారు. మీ ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అదృష్టయోగం ఉన్నది. తగినంత శ్రమ అవసరం. కష్టపడి పనిచేస్తే విజయం లభిస్తుంది. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. పట్టుదలతో ఎంతటి కార్యాన్ని అయినా సాధించగలరు. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవాలి. ఆపద నుండి బయటపడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులు సాయపడతారు. రుణ సమస్యలు ఇబ్బందిపెట్టవచ్చు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఆర్థిక వృద్ధి. గృహలాభం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చేయని తప్పుకు నింద పడవలసి రావచ్చు. స్పష్టమైన ఆలోచనలతో ముందుకెళ్తే అపార్థాలకు తావు ఉండదు. శత్రు పీడ తొలగుతుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. పనిగట్టుకుని విమర్శించే వారుంటారు. మరింత శుభ ఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

సింహరాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ధనయోగం ఉన్నది. మంచి ఆలోచనలతో అధికారులను మెప్పిస్తారు. దూరమైనవారు దగ్గరవుతారు. ఆత్మీయుల వల్ల మేలు జరుగుతుంది. విఘ్నాలు ఎదురవుతాయి. పట్టుదలతో పేరు తెచ్చుకుంటారు. మిత్రుల సూచనలతో కార్యాలు సఫలీకృతం అవుతాయి. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ధనలాభం మరియు అధికారం సిద్ధిస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కొత్త పనుల్ని ప్రారంభిస్తారు. సిరిసంపదలు వరిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. జీవితంలో స్థిరపడతారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆస్తి వృద్ధి అవుతుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. శుభయోగాలున్నాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఒత్తిళ్ళను తగ్గించుకొని పని చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం ఉంది. ఆస్తిపరమైన తగాదాలు రాకుండా జాగ్రత్తపడండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుడిని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీదైన పట్టుదలతో కృషితో అందలమెక్కుతారు. సమిష్టి నిర్ణయాలు ఆపదలను దూరం చేస్తాయి. విఘ్నాలు పొంచి వున్నాయి. మిత్రుల సాయంతో ఒక పనిలో విజయం సాధిస్తారు. మొహమాటంతో కొత్త ఇబ్బందులు రావచ్చు. అన్ని విధాలుగా కలసివచ్చును. ప్రశాంతంగా గడుపుతారు. అంతా శుభమే జరుగుతుంది. మరింత శుభఫలితాలు పొందాలంటే బుుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. గతంలో కాని పనుల్ని ఇపుడు పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. మంచి జరుగుతుంది. ప్రశాంతంగా పనిచేస్తే విజయం లభిస్తుంది. ఆనందముగా గడుపుతారు. అదృష్టయోగం ఉన్నది. కుటుంబ సభ్యులతో విభేదించరాదు. నిందారోపణ చేసేవారు ఉన్నారు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి అనుకూలం. ఒక విషయంలో పెద్దలను కలుస్తారు. ఆనందముగా, ఆహ్లాదముగా గడుపుతారు. సొంత నిర్ణయాలు కలసిరావు. అర్హతకు తగిన ప్రతిఫలం ఉన్నది. ఆత్మీయులతో కలసి నిర్ణయాలు తీసుకోవాలి. భూలాభం ఉన్నది. దేవీ ఉపాసన చేయడం మంచిది. రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఎవరు ఏది చెప్పినా పట్టించుకోకుండా మీదైన మార్గంలో ముందుకు సాగండి. తెలివితేటలతో అధికారులను మెప్పిస్తారు. ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. బంధుమిత్రుల ఆదరాభిమానాలు లభిస్తాయి. ఒక వార్త విచారాన్ని కలిగిస్తుంది. విజయం లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు శుభఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. ఖర్చులు అదుపులోకి వస్తాయి. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నలుగురికీ మేలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. విందూ వినోదాల్లో పాల్గొంటారు. సామాజిక స్థితిని పెంచే విధంగా మీ నిర్ణయాలుంటాయి. ద్విచక్ర వాహనంపై మితిమీరిన వేగంతో ప్రయాణించరాదు. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నేడు బుుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000