సెప్టెంబరు 21 రాశి ఫలితాలు.. ఈ రాశి స్త్రీలకు కుటంబ సమస్యలు
Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు తేదీ 21.09.2023 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈరోజు రాశి ఫలాలు, తేదీ 21.09.2023
ట్రెండింగ్ వార్తలు
వారం: గురువారం, తిథి: షష్టి,
నక్షత్రం: అనూరాధ, మాసం: భాద్రపదం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. గృహమున మంగళకర వాతావరణము. ఉన్నత ఉద్యోగము. వృద్ధి. కుటుంబ విషయములు అనుకూలించును. సంతాన వృద్ధి. ఆదాయం గౌరవప్రదముగా ఉండును. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం. ధన సంపాదన, భూయోగం కలుగుతుంది. ఆరోగ్యమునకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు విదేశీయోగం కలసివచ్చును. వృత్తి, వ్యాపారపరంగా అనుకూల సమయం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. వ్యాపారపరంగా అనుకూలం. సినీరంగం వారికి కలసివచ్చును. కుటుంబమునందు సౌఖ్యము, ఆనందము కలుగును. స్త్రీలకు అనుకూలం. ధనలాభము. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగములో రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నప్పటికి మీయొక్క కృషితో విజయం వైపు దూసుకుపోవుదురు. వ్యాపారంలో చికాకులు అధికముగా ఉండును. ఆరోగ్య సమస్యలు కలుగును. స్త్రీలకు కుటుంబ సమస్యలు మరియు ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు ఏర్పడును. సినీరంగం వారికి చెడు సమయం. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు ఉద్యోగము నందు రాజకీయ ఒత్తిళ్ళు పెరుగును. వ్యాపారస్తులకు లాభదాయకం. కుటుంబ సౌఖ్యం ఆనందము కలుగును. సినీరంగం వారికి మధ్యస్థం. విద్యార్థులకు అనుకూలం. ఆరోగ్యం అనుకూలించును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి.
కన్యా రాశి
కన్యారాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగములో శమ ఒత్తిడి ఉన్నప్పటికి విజయం మీదే అవుతుంది. మీ దూకుడు ప్రవర్తన వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడును. శని అనుకూల ప్రభావం చేత విజయాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు లాభదాయకం. రైతాంగానికి అనుకూల సమయం. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
తులా రాశి
తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలకు కుటుంబ సమస్యలు, మానసిక ఇబ్బందులు అధికమగును. సినీరంగం వారికి కలిసివచ్చేటటువంటి రోజు. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అలాగే ధనలాభము ఉద్యోగము నందు కీర్తి కలుగును. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఉద్యోగమునందు చికాకులు, సమస్యలు. శతృత్వం అధికమగును. వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు. విద్యార్థులకు మధ్యస్థం. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. మానసిక ఒత్తిళ్ళు మరియు కుటుంబ సమస్యలు అధికముగా ఉండును. రైతాంగానికి మధ్యస్థ సమయం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూరాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యం కలుగును. విదేశీ విద్య అనుకూలించును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు ప్రమోషన్లు. స్రీలకు అనుకూలం. విద్యార్థులకు అన్ని విధాలుగా కలసివచ్చేటటువంటి రోజు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంనుండి చెడు ఫలితాలున్నాయి. ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు ఎదుర్మోనలసినటువంటి స్థితి. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఆవేశపూరిత నిర్ణయాలు పనికిరావు. వ్యాపారస్థులకు మధ్యస్థం. వ్యాపారం నందు అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడును. స్త్రీలకు కుటుంబము నందు సమస్యలు వేధించును. ఆర్థిక సమస్యలు మరియు ఒత్తిళ్ళు పెరుగును. గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి.
కుంభ రాశి
కుంభరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో చికాకులు, సమస్యలు మరియు వేదనలు అధికమగును. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. స్త్రీలకు అనారోగ్య సమస్యలు వేధించును. విద్యార్థులకు మధ్యస్థ సమయం. సినీరంగం వారికి అనుకూలంగా లేదు. ధనము సమయానికి సర్దుబాటు కాదు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు కఠినమైన సమయం. ఉద్యోగము నందు రాజకీయ ఒత్తిళ్ళు అధికం. వ్యాపారంలో నష్టములు, ఆర్థిక సమస్యలు ఏర్పడును. విద్యార్థులకు మధ్యస్థం. స్త్రీలు ఆరోగ్య విషయముల యందు జాగ్రత్తలు వహించాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉందాలి. రైతాంగం, సినీరంగం వారికి మధ్యస్థ సమయం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000