ఈరోజు రాశి ఫలాలు.. అతిగా నమ్మడం వల్ల మోసపోతారు
Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 24.09.2023 ఆదివారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 24.09.2023
వారం: ఆదివారం, తిథి: దశమి
నక్షత్రం : పూర్వాషాఢ, మాసం: భాద్రపదం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
మేషరాశి
మేష రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. అకాల భోజనం వలన అస్వస్థతకు గురవుతారు. శ్రమాధిక్యత అధికం. రాజకీయాల్లో ఉన్న వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. మిత్రులకిచ్చిన మాట కోసం శ్రమ, ప్రయాసలు పడవలసి ఉంటుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్చ ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వైద్యులు శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మేష రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యుని పూజించడం మరియు సూర్యభగవానుని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఖర్చులు అధికము. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. విద్యార్థులకు ఉన్నత కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది. వృషభ రాశి వారు ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీ సమర్థతను అధికారులు గుర్తిస్తారు. పత్రిక, వార్తా రంగాలలోని వారికి ఊహించని చికాకులు ఏర్పడతాయి. భాగస్వామిక చర్చలు అర్ధాంతరంగా ముగుస్తాయి. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్టకం పఠించాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సోదరులను కలిసి ఆనందముగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ కళత్ర మొండి వైఖరి మిమ్మల్ని మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విదేశాలలోని మీ బంధుమిత్ర వర్గ సహాయ సహకారాలను అందుకుంటారు. ముఖ్యమైన సమస్యలను పరిష్కరిస్తారు. కర్మాటక రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. అరుణం పఠించడం లేదా వినడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్చులకు అనుకూలం. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సింహరాశివారికి మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.
కన్యారాశి
కన్యారాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆకస్మిక ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబములో ఆందోళన. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. అంతగా పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. దైవసేవా కార్యక్రమాలపట్ల ఏకాగ్రత వహిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.
తులా రాశి
తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలంగా ఉన్నది. కొత్త కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. కుబుంబ సభ్యులతో ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ప్రయాణాలు అనుకూలం. విద్యార్థులు క్రీడారంగాలపట్ల ఆసక్తి చూపుతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. తులారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ధనం ఎంత వస్తున్నా పొదుపు చేయలేకపోతారు. ఒక వ్యవహారం నిమిత్తం కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. దూర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. మీ మనసుకు నచ్చని సంఘటనలు జరుగుతాయి. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆర్థిక సమస్యలున్నా మిత్రుల సహకారం లభిస్తుంది. స్త్రీలకు అలంకరణలు, విలాసవస్తువుల మీద మక్కువ పెరుగుతుంది. ఇతరులను అతిగా నమ్మడం వలన నష్టపోయే ప్రమాదం ఉన్నది. జాగ్రత్త వహించండి. నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. మీ యత్నాలకు బంధువులు సహకరిస్తారు. ధనూరాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. మీరు చేయవలసిన పనులలో ఒత్తిడి, జాప్యం, చికాకులు ఎదుర్కొంటారు. సోదరీ, సోదరుల మధ్య కలహాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల కూరగాయలు, చిరు వ్యాపారులకు కలసివస్తుంది. వార్తా సంస్థలలోని సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. మకరరాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్ట్రకాన్ని పఠించండి.
కుంభ రాశి
కుంభరాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహిస్తారు. మొండిబాకీలు వసూలు కాగలవు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నువ్వులతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. మీరు చేసే పనుల్లో ఆటంకాలు, ఒత్తిళ్ళు ఏర్పడతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని చికాకులెదురవుతాయి. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగును.
-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000