సెప్టెంబరు 8 రాశి ఫలాలు.. చిలకమర్తి వారిచే
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 08.09.2023 శుక్రవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 08.09.2023
వారం: శుక్రవారం, తిథి: నవమి,
నక్షత్రం: మృగశిర, మాసం: శ్రావణం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
మేషరాశి
మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మీయొక్క పనులలో అలసటకు గురవుతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. మీ యొక్క ఆలోచనా శక్తితో సమస్యల నుండి బయటపడెదరు. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. శారీరక సౌఖ్యం, మానసిక ఆనందము కలుగును. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. విద్యార్థులకు కలసివచ్చే రోజు. మీరు చేసే పనుల్లో ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారపరంగా సత్ఫలితాలు పొందుతారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. శుభఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలంగా ఉన్నది. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడిన సమయం. స్త్రీలకు, విద్యార్థులకు మధ్యస్థం నుండి అనుకూలం. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. కుటుంబసభ్యులతో వాదనలు ఏర్పడును. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశి
కర్మాటక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలించును. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు మధ్యస్థం. రైతాంగం, సినీరంగం వారికి మధ్యస్థ సమయం. విష్ణు సహస్రనామం పఠించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
సింహరాశి
సింహరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఒత్తిళ్ళు అధికము. ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారస్తులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
కన్యారాశి
కన్యారాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. చేసేటటువంటి పనులు సత్ఫలితాస్తాయి. పొదుపు పాటించాలి. దాంపత్య జీవితం అందంగా ఉంటుంది. భోగభాగ్యాలు కలుగును. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలం. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. శుభఫలితాలు కలుగుతాయి.
తులా రాశి
తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలంగా ఉన్నది. కష్టపడితేనే విజయం. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. భగవదనుగ్రహంతో ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. కొన్ని సందర్భాల్లో మనసుకు భయం కలుగుతుంది. ఒత్తిడిని జయించాలి. లక్ష్మీదేవిని పూజించాలి. శుభం కలుగుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూలంగా ఉన్నది. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల మాటలు ప్రేరణనిస్తాయి. ఆర్థికంగా శక్తిమంతులవుతారు. మేథా సంపత్తితో విజయాన్నందుకుంటారు. విఘ్నాలను అవలీలగా అధిగమిస్తారు. సహోద్యోగులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగరాదు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విందూవినోదాలతో కాలం గడుస్తుంది. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలంగా ఉన్నది. లక్ష్యంపై దృష్టి పెడితే విజయం మీదే. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. వ్యాపార లాభాలున్నాయి. భూలాభమూ ఉంది. కొత్త వస్తువులు కొంటారు. పెద్దల ఆదరాభిమానాలున్నాయి. వృధా ప్రయాణాలుంటాయి. వ్యయాలు పెరగకుండా జాగ్రత్తపడాలి. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
మకర రాశి
మకర రాశివారికి ఈ రోజు మీకు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం. వ్యయభారం విషయంలో జాగ్రత్తపడాలి. వ్యతిరేకంగా మాట్లాడేవారున్నారు జాగ్రత్త. మాటల్లో తీయదనం ఉండాలి. విమర్శించకూడదు. ప్రమాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు కలసివస్తాయి. గణపతినీ, సుబ్రహ్మణ్యస్వామినీ దర్శించండి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి.
కుంభ రాశి
కుంభరాశి వారికి ఈ రోజుమీ అభీష్టాలు నెరవేరుతాయి. శ్రమ అవసరం. ఆర్థిక విజయం ఉంది. శక్తివంచన లేకుండా పనిచేస్తే సంతృప్తికర ఫలితాల్ని సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. విశ్రాంతి అవసరం. సూర్యధ్యానం ఆరోగ్యాన్నిస్తుంది. లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. మనసు పెట్టి పనిచేస్తే మంచి ఫలితాలను సాధిస్తారు. ఏ విషయంలోనూ అశ్రద్ధ వద్దు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. అధికారుల వద్ద కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అంతా శుభమే జరుగతుంది. కొన్ని పొరపాట్లు జరిగే ఆస్కారం లేకపోలేదు. నిర్ణయాల్లో మిత్రుల సూచనలు తీసుకోవాలి. ధైర్యం, ఏకాగ్రత రెండూ ముఖ్యం. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000