Today Horoscope : వీరు పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయాలి
Today Horoscope : ఈరోజు రాశి ఫలాలు తేదీ 11.09.2023 సోమవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ రాశి ఫలితం ఎలా ఉందో చెక్ చేసుకోండి .
తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 11.09.2023, వారం: సోమవారం, తిథి : ద్వాదశి, నక్షత్రం : పుష్యమి, మాసం : శ్రావణం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
ట్రెండింగ్ వార్తలు
మేషరాశి
మేషరాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు శుక్రునితో కలసి ఉండటం చేత ఉద్యోగస్తులకు అనుకూలముగా, వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండబోతుంది. కుటుంబములో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కోపాన్ని నియంత్రించుకుంటే సత్ఫలితాలు కలుగుతాయి. మేషరాశివారు ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు మరియు ధనమును పొందెదరు.
వృషభరాశి
వృషభరాశివారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. పనులు యందు ఒత్తిళ్ళు అధికముగా ఉందును. గురు రాహువుల ప్రభావం వలన వ్యాపారస్తులకు రాబడి కంటే ఖర్చులు అధికమగును. 5వ ఇంట కుజుని ప్రభావం వలన పట్టుదలకు దూరంగా ఉండాలి. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.
మిథునరాశి
మిథునరాశివారికి ఈ రోజు మీకు ధన స్థానములో శుక్ర, చంద్రుల ప్రభావంచేత ఆర్థికపరంగా అనుకూలమైన ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఈరోజు ఆనందకరముగా ఉండును. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఈరోజు సత్ఫలితాలేర్సడును. విద్యార్థులకు అనుకూలం. మిథునరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.
కర్కాటకరాశి
కర్మాటక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. జన్మరాశియందు చంద్రుడు, అష్టమశని, వాక్ స్థానములో రవి ప్రభావం వలన పనుల యందు ఒత్తిడి, మనస్తాపం కలుగును. తప్పుడు నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడును. కుటుంబ స్థానమునందు రవి ప్రభావం వలన కుటుంబంలో ఘర్షణ వాతావరణం, వాదనలు ఏర్పడును. ప్రతీ పని ఆచి తూచి వ్యవహరించాలి. కర్కాటకరాళివారికి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన మరియు పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.
సింహరాశి
సింహరాశి వారికి ఈ రోజు మీకు ఒత్తిళ్ళతో కూడుకున్నటువంటి రోజు. వ్యయస్థానములో చంద్ర, శుక్రుల ప్రభావంచేత అధికముగా ధనాన్ని ఖర్చుచేసెదరు. ప్తీ సౌఖ్యం కలుగును. వాక్ స్థానములో కుజుని ప్రభావం వలన ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.
కన్యారాశి
కన్యారాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా కలసివచ్చును. పనులలో ఒత్తిళ్ళు ఉన్నప్పటికి మీయొక్క ప్రణాళికతో అనుకున్న పనులు పూర్తి చేసెదరు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సత్ఫ్భలితాలిచ్చును. స్త్రీ సౌఖ్యం ఆనందము పొందెదరు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. వాక్ స్థానమునందు కేతువు ప్రభావం వలన గొడవలకు దూరంగా ఉండాలని సూచన. కన్యారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.
తులా రాశి
తులారాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా కలసివచ్చును. అనుకున్న ప్రతీ పని కలసివచ్చును. లాభస్థానములో రవి, బుధులు, దశమ స్థానములో శుక్ర, చంద్రుల అనుకూల ప్రభావం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు ఈరోజు కలసివచ్చును. స్త్రీలకు కటుంబ సౌఖ్యం కలుగును. విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది. తులారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. భాగ్యములో శుక్ర, చంద్రుల ప్రభావంవలన కుటుంబ సౌఖ్యం పొందెదరు. మీయొక్క పనులన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసెదరు. దశమంలో రవి ఉద్యోగస్తులకు అనుకూల మరియు సత్ఫ్భలితాలిచ్చును. వ్యాపారస్తులకు ఆర్థిక లాభం కలుగును. వృశ్చికరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.
ధనూ రాశి
ధనూరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులు ఉద్యోగంలో ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు అధికారుల మన్ననలు పొందెదరు. వ్యాపారస్తులకు ఈరోజు కలసివచ్చును. కుటుంబ విషయాల యందు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించడం మంచిది. అష్టమశుక్రుని ప్రభావం వలన చికాకులు కలుగు సూచన. ధనూరాశివారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.
మకర రాశి
మకరరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగంలో ఒత్తిళ్ళు, రాజకీయాలు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు ధననష్టం కలుగు సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయం. వాక్ స్థానంనందు శని ప్రభావంవలన గొడవలకు దూరంగా ఉండాలని సూచన. అష్టమ రవి ప్రభావం వలన శారీరతాపము కలుగును. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అప్టోతర శతనామావళి పఠించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. శత్రుస్థానమునందు శుక్ర, చంద్రుల ప్రభావంచేత శత్రు బాధ అధికమగును. రాజకీయ ఒత్తిళ్ళు కలుగు సూచన. ఉద్యోగస్తులకు కష్ట సమయం. వ్యాపారస్తులకు చెడు సమయం. విద్యార్థులు కష్టపదవలసిన సమయం. కుంభరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. పంచమంలో శుక్ర, చంద్రుల అనుకూల స్థితి వలన ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. ఆహ్లాదకరముగా గదిపెదరు. కళత్రమునందు కుజుని ప్రభావం వలన కుటుంబ సభ్యులతో వాదనలు కలుగు సూచన. ఏలినాటి శని ప్రభావం వలన ఆరోగ్య విషయాలయందు త్‌ద్ద వహించాలి. విద్యార్థులకు అనుకూలం. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.