Today Rasi Phalalu : నేటి రాశి ఫలాలు.. ఈరోజు మీ రాశి ఎలా ఉంది?
Today Horoscope : నేటి రాశి ఫలాలు తేదీ 14.09.2023 గురువారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ రాశి ఫలితం ఎలా ఉందో చెక్ చేసుకోండి.
తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 14.09.2023, వారం: గురువారం, తిథి : అమావాస్య, నక్షత్రం : పుబ్బ, మాసం : శ్రావణం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
ట్రెండింగ్ వార్తలు
మేషరాశి
మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలం. భూమి కొనుగోలు లేదా ఏమైనా ఉగ్యోగంలో స్థిరపడుట జీతం పెరుగును. సరైన నిర్ణయాలు మీ యొక్క కృషితో సాధిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం అనుకూలించును. దూర ప్రయాణాలు కలసివస్తాయి. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
వృషభరాశి
వృషభరాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. సోమరితనం వలన కార్యభారము, పని ఒత్తిడి అధికమయ్యే అవకాశం. స్నేహితులు మీ మాటలకు ఎక్కువ విలువనిస్తారు. సంతానం వృద్ధిలోకి వస్తారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మిథునరాశి
మిథునరాశివారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా ఉంది. వస్తు, వస్తాభరణాలు వాహనం మరియు ఆస్తి వృద్ధి. ప్రేమ విషయాలు నెరవేరుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు గొప్ప సామాజిక ఖ్యాతిని పొందుతారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
కర్కాటకరాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం అనుకూలించును. దూర ప్రయాణాలు కలసివస్తాయి. పదోన్నతి లేదా వేతనాలు పెరిగే అవకాశం. మొత్తం మీద మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. శివపార్వతులు అర్జానారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
సింహరాశి
సింహరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. పెట్టుబడులు లాభదాయకముగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించును. ఆరోగ్యం అనుకూలించును. ప్రయాణాలు లాభించును. అధిక ఖర్చులు చేస్తారు. ఖర్చులు నియంత్రిచుకోవాలని సూచన. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
కన్యారాశి
కన్యారాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. రాజకీయంగా పలుకుబడి వస్తుంది. ఆదాయ వృద్ధి అవుతుంది. సోదరులు మరియు స్నేహితులు మీకు అండగా నిలుస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల సమయం. మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
తులా రాశి
తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కీర్తి ప్రతిష్టలు కలుగును. సంపద వృద్ధి అగును. ఆర్థిక సమ్యల నుండి బయటపడతారు. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. స్నేహితుల నుండి సహాయం లభించును. శివపార్వతులు అర్జానారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. విలాసవంతమైన జీవితం గడుపుతారు. చేసే ప్రయత్నాలకు అనుగుణంగా ఆదాయం కూడా పెరుగుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. అనారోగ్య సూచన. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారాలు అనుకూలించును. ఆర్యోగంపై శ్రద్ధ వహించాలి. పిల్లలు చదువులో ముందడుగు వేస్తారు. విలాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులు పై అధికారులతో మన్ననలు పొందుతారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం శెనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
మకర రాశి
మకర రాశివారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాలపై వైద్యుని సలహా పాటించాలి. కుటుంబ సభ్యులతో సమస్యలను ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలలో అధికారుల నుండి ఒత్తిడి ఏర్పడును. గణపతినీ, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. శివపార్వతులు అర్జానారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.
కుంభ రాశి
కుంభరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. విద్యార్థులకు అనుకూలం. చదువులకు ఇతరదేశాల్లో అవకాశం. దూర ప్రయాణాలు కలసివస్తాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వ్యాపారం పెరుగుతుంది. బంధుమిత్రులతో గడుపుతారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం ఈరోజు బృహస్పతి అనుగ్రహం కోసం శెనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.