Today Horoscope : ఈ రాశివారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు.. జాగ్రత్త-today horoscope telugu check your zodiac sign here for sunday 17th september 2023 ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  Today Horoscope Telugu Check Your Zodiac Sign Here For Sunday 17th September 2023

Today Horoscope : ఈ రాశివారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు.. జాగ్రత్త

ఈ రోజు రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు

Today Horoscope : నేటి రాశి ఫలాలు తేదీ 17.09.2023 ఆదివారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ రాశి ఫలితం ఎలా ఉందో చూసుకోండి.

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 17.09.2023, వారం: ఆదివారం, తిథి : విదియ నక్షత్రం : హస్త, మాసం : భాద్రపదం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

ట్రెండింగ్ వార్తలు

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మనస్తాపాలు కలుగకుండా చూసుకోవాలి. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో సమస్యలుంటాయి. కుటుంబ సభ్యులతో సమన్వయ లోపం రానీయకండి. ధనయోగం ఉనన్నది. కొందరి ప్రవర్తన వల్ల లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవాలి. మేషరాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు సుబ్రహ్మణ్యుని పూజించడం మరియు సూర్యభగవానుని ఆరాధించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. సూర్యాష్టకం చదువుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని తెలియ చేస్తున్నాను.

వృషభరాశి

వృషభరాశివారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. చిత్తశుద్ధితే పనిచేస్తే విజయం లభిస్తుంది. ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల ప్రమేయంతో ఒక విషయంలో లాభపదతారు. ఆపదలు చుట్టుముడతాయి. తెలివిగా వాటిని పరిష్కరిస్తారు. ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అదృష్టయోగం ఉన్నది. తగినంత శ్రమ అవసరం. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది. వృషభరాశివారు ఈరోజు క్రిష్టాష్టకం పఠించడం వల్ల వృషభరాశి వారికి మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మిథునరాశి

మిథునరాశివారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. చంచల స్వభావంతో పనిచేయకండి. పట్టుదలతో ఎంతటి కార్యాన్ని అయినా ఇట్టే సాధించగల సమర్థత మీకుంది. వృథా వ్యయాల్ని తగ్గించుకోవాలి. రుణ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మిత్రుల సలహాతో ఆపదనుండి బయటపడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులు సాయపడతారు. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకరాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. వినయవిధేయతలే మీ విజయానికి మూలం. పనిగట్టుకుని విమర్శించేవారున్నారు. ఆర్థిక వృద్ధి ఉంది. గృహలాభం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చేయని తప్పుకు నిందపడాల్సి రావచ్చు. స్పష్టమైన ఆలోచనలతో ముందుకెళ్తే అపార్థాలకు తావు ఉండదు. శత్రుపీడ తొలగుతుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. అరుణం పఠించడం లేదా వినడం మంచిది.

సింహరాశి

సింహరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. పట్టుదలతో పేరు తెచ్చుకుంటారు. ధనయోగం ఉంది. మంచి ఆలోచనలతో అధికారులను మెప్పిస్తారు. దూరమైనవారు దగ్గరవుతారు. ఆత్మీయుల వల్ల మేలు జరుగుతుంది. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. జీవితానికి అర్ధం పరమార్థం సిద్ధిస్తాయి. విఘ్నాలు ఎదురవుతాయి. మిత్రుల సూచనలతో కార్యాలు సఫలీకృతమవుతాయి. సింహరాశివారికి మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ధనలాభం ఉన్నది. అధికారం సిద్ధిస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కొత్త కార్యాల్ని ఆరంభిస్తారు. సిరిసంపదలు వరిస్తాయి. (శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంది. క్రమక్రమంగా జీవితంలో స్థిరపడతారు. స్థాన చలన సూచనలు వున్నాయి. ఆస్తి వృద్ధి అవుతుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలంగా ఉన్నది. ఆటుపోట్లు తట్టుకుని నిలబడతారు. మీరు నమ్మిన ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒత్తిడిని తగ్గించుకుని పనిచేయండి. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం ఉంది. ఆస్తిపరమైన తగాదాలు రాకుండా జాగ్రత్తపడండి. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. తులారాశివారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అంతా శుభమే జరుగుతుంది. ప్రశాంతంగా కాలం గడుపుతారు. మిత్రుల సాయంతో ఒక పనిలో విజయం లభిస్తుంది. పట్టుదల సడలనీయకంది. విఘ్నాలు పొంచి వున్నాయి. సమిష్టి నిర్ణయాలు ఆపదలను దూరం చేస్తాయి. మొహమాటంతో కొత్త ఇబ్బందులు రావచ్చు. మీదైన ప్రతిభ మిమ్మల్ని అందలమెక్కిస్తుంది. ఇంటా బయటా శుభకాలం ఉన్నది. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, నవగ్రహా ఆలయాల్లో పూజలు వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. అదృష్ట ప్రాప్తి ఉన్నది. ఆనందంగా కాలం గడుపుతారు. ప్రశాంతంగా పనిచేస్తు విజయం లభిస్తుంది. గురువుల అనుగ్రహం ఉంటుంది. గతంలో కాని పనుల్ని ఇప్పుడు పూర్తి చేస్తారు. మనోభీష్టం నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో విభేదించరాదు. నిందారోపణ చేసేవారున్నారు. శుభవార్త వింటారు. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. క్షీరాన్నాన్ని ఆలయాల్లో ప్రసాదంగా పంచడం మంచిది.

మకర రాశి

మకర రాశివారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆనందముగా కాలం గడుపుతారు. సొంత నిర్ణయాలు కలసిరావు. ఆర్థిక స్థితి శుభప్రదం. ఒక విషయంలో పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. ముఖ్య సందర్భాల్లో తద్దగా మాట్లాడండి. ఆత్మీయులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. భూలాభం ఉన్నది. అర్హతకు తగినంత ప్రతిఫలం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. మనోబలాన్ని పెంచుకోవాలి. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. విజయం ఉంది. అదృష్టవంతులు అవుతారు. ఎవరు ఏది చెప్పినా పట్టించుకోకుండా మీదైన మార్గంలో ముందుకు సాగండి. తెలివితేటలతో అధికారులను మెప్పిస్తారు. ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. బంధుమిత్రుల ఆదరాభిమానాలు లభిస్తాయి. ఒక వార్త విచారాన్ని కలిగిస్తుంది. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నువ్వలతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికంగా బలపడతారు. ఖర్చులు అదుపులోకి వస్తాయి. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నలుగురికీ మేలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. విందూ వినోదాల్లో పాల్గొంటారు. సామాజిక స్థితిని పెంచే విధంగా మీ నిర్ణయాలుంటాయి. కార్థానాల్లో అజాగ్రత్త వద్దు. వాహన చోదనలో అతివేగం ప్రమాదకరం. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగును.

WhatsApp channel