Today Horoscope : ఈ రాశివారికి నరఘోష అధికమగును.. వెంకటేశ్వర సుప్రభాతం చదవాలి-today horoscope telugu check your zodiac sign for wednesday 13th september 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Horoscope : ఈ రాశివారికి నరఘోష అధికమగును.. వెంకటేశ్వర సుప్రభాతం చదవాలి

Today Horoscope : ఈ రాశివారికి నరఘోష అధికమగును.. వెంకటేశ్వర సుప్రభాతం చదవాలి

HT Telugu Desk HT Telugu
Sep 13, 2023 02:10 AM IST

Today Horoscope : నేటి రాశి ఫలాలు తేదీ 13.09.2023 బుధవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ రాశి ఫలితం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

ఈరోజు రాశి ఫలాలు
ఈరోజు రాశి ఫలాలు (pixabay)

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 13.09.2023, వారం: బుధవారం, తిథి : చతుర్దశి, నక్షత్రం : మఖ, మాసం : శ్రావణం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. బుధవారానికి అధిపతి అయిన బుధుడు రవితో కలసి పంచమ స్థానములో అనుకూలంగా ఉండటంచేత సంతాన సౌఖ్యం. కుటుంబ సౌఖ్యం పొందెదరు. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా అనుకూలం. ప్తీలకు అనుకూలమైన సమయం. విద్యార్థులకు కలసివచ్చే రోజు. విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయాలి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్చించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

వృషభరాశివారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. రవి, బుధుల కేంద్రంలో అనుకూల ప్రభావంచేత వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. దశమంలో శని అనుకూల ప్రభావం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు ఈరోజు కలసివచ్చును. విద్యార్థులకు అనుకూలం. భగవద్గీత వినడం, చదవడం వల్ల, కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్చించాలి.

మిథునరాశి

మిథునరాశివారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. కేంద్రం నందు కుజుని ప్రభావం వలన ఒత్తిళ్ళు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కుటుంబములో సమస్యలు, మనస్పర్థలు వేధించును. ఉద్యోగ వ్యాపారపరంగా మధ్యస్థముగా ఉన్నది. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.

కర్కాటకరాశి

కర్మాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. బుధవారానికి అధికపతి అయిన బుధుడు ధనస్థానములో ఉ౦డటంచేత వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసెదరు. భాతృ స్థానములో కుజుని ప్రభావం వలన భాతృ వర్గీయులతో జరుపు చర్చలు సఫలీకృతమగును. ఆరోగ్య మరియుకుటుంబ విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి

సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. జన్మరాశియందు రవి, బుధుల ప్రభావం అలాగే వ్యయస్థానము నందు శుక్రుని ప్రభావం వలన అధిక ఖర్చులు ఇబ్బందిపెట్టును. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు శారీరక శ్రమ, కుటుంబమునందు అశాంతి ఏర్చడు సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయం. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు బుధుని ప్రభావం వలన అనుకూలమైన ఫలితాలు కలుగును. వ్యాపారస్తులకు వ్యాపారసంబంధమైన ఖర్చులు కలిగినప్పటికి లాభదాయకంగా ఉండును. సౌఖ్యం పొందెదరు. స్త్రీలకు కుటుంబములో సమస్యలు వేధించును. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. శ్రీకృష్ణుడిని పూజించాలి. కృష్ణాష్టకం పఠించాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్చించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. జన్మరాశియందు కేతువు, వ్యయస్థానమునందు కుజుని ప్రభావం వలన కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడు సూచన. ఉద్యోగస్తులకు దశమంలో శుక్రుని ప్రభావం వలన అనుకూల ఫలితాలు కలుగును. వ్యాపారస్తులకు ఖర్చులు అధికముగా ఉండును. ప్రయాణములు కలసివచ్చును. కుటుంబ సౌఖ్యం పొందెదరు. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. బుధవారానికి అధిపతి అయిన బుధుడు దశమంలో రవితో కలసి అనుకూలంగా సంచరించడం వలన ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలం. లాభంలో కుజుని ప్రభావం వలన స్త్రీలకు కుటుంబ సౌఖ్యం కలుగును. విద్యార్థులకు సత్ఫలితం కలుగును. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. గురుడు భాగ్యములో రవితో కలసి ఉండటం చేత వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును. స్త్రీలకు కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధించును. విద్యార్థులకు అన్ని విధాలుగా ఈరోజు కలసివచ్చును. శని మరియు గురు, రాహువుల అనుకూలత వలన అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకరరాశి వారికి ఆయుః స్థానమందు రవి, బుధుల ప్రభావం వలన మనస్తాపమును శారీరక శ్రమ మరియు అనారోగ్యం కలుగు సూచన. ఆరోగ్య విషయాలయందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించండి. గురు, రాహువులు మరియు కుజుని అనుకూల ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి బుధుడు, రవితో కలసి కళత్రములో సంచరించుటచేత వ్యాపారస్తులకు సత్ఫలితాలు కలుగును. చంద్రుని అనుకూల ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. మూర్ధపు వాదనలకు దూరంగా ఉండాలని సూచన. విద్యార్థులకు ఈరోజు కలసివచ్చును. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం కలుగును. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. శత్రు స్థానములో రవి బుధుల సంచారం వలన నరఘోష అధికమగును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఏలినాటి శని ప్రభావం వలన అనవసర ధన వ్యయం కలుగును. వాక్‌ స్థానములో గురు, రాహువుల ప్రభావం వలన చర్చలకు, గొడవలకు దూరంగా ఉండాలి. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

WhatsApp channel