Today Rasi Phalalu : ఈ రాశివారు పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే శుభఫలితాలు
Today Horoscope : ఈరోజు రాశి ఫలాలు 02.10.2023 సోమవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 02.10.2023, వారం: సోమవారం, తిథి : తదియ, నక్షత్రం : భరణి, మాసం : భాద్రపదం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
మేషరాశి
మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. ఇతరులతో వాదనలు కలసిరాకపోగా మానసిక ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంటుంది. సద్గుణాలను పెంచుకుని ఆధ్యాత్మికంగా సాగటం వలన ప్రయోజనం ఉంటుంది. ప్రయాణాలు కలసి వస్తాయి. ఆకస్మిక ధనలాభంతో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మేషరాశివారు ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు మరియు ధనమును పొందెదరు.
వృషభరాశి
వృషభరాశివారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. రక్తప్రసరణ, అజీర్ణం, మూలవ్యాధుల సమస్యలు రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అనవసర ఖర్చులకు పోయి నష్టపోకుండా జాగ్రత్త అవసరం. అప్పుల బారినపడకుండా జాగ్రత్తపడాలి. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.
మిథునరాశి
మిథునరాశివారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీ భాగస్వామి ప్రవర్తన మీకు నచ్చనప్పుడు హాస్య యుక్తి మర్యాద ఉపయోగిస్తే మీకు మరియు తోటివారికి ఉపశమనము కల్గి ఉద్రిక్తతలకు దారితీయకుండా ఉంటుంది. జ్ఞానవృద్ధి, వ్యాపార ప్రయోజనాలను పొందుతారు. మిథునరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.
కర్కాటకరాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. విలాసవంతమైన జీవితం గడుపుతారు. సామాజిక విషయాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ స్థానం. ఉద్యోగ వ్యాపారపరంగా కలసివచ్చును. విద్యార్థులకు అనుకూల సమయం. కర్కాటకరాశివారికి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన మరియు పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.
సింహరాశి
సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. కీర్తి లభించును. కుటుంబంలో ఆనందం. జీవిత భాగస్వామి మరియు పిల్లలతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.
కన్యారాశి
కన్యారాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. నూతన వస్తు, వస్త్రాల ప్రాప్తి. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆభరణాల కొనుగోలు కోసం ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. కన్యారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.
తులా రాశి
తులారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. మీ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు గౌరవిస్తారు. కుటుంబముతో పుణ్య క్షేత దర్శనం చేస్తారు. మానసిక ప్రశాంతత కలుగును. తులారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆహ్హాదముగా గడుపుతారు. వ్యాపారంలో వృద్ధిని పెంచుతుంది. ఆర్ధికంగా లాభదాయకం. సమాజంలో అరుదైన గౌరవం కలుగుతుంది. పోటీలలో విజయం సాధిస్తారు. వృశ్చికరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.
ధనూ రాశి
ధనూరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంది. ఆరోగ్యంపై త్‌ద్ద వహించాలి. నూతన వస్తు, వస్త ప్రాప్తి. బంధుమిత్రులతో ఆనందముగా గడుపుతారు. ధనూరాశివారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.
మకర రాశి
మకరరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. నిద్రలేమి, మానసిక ప్రశాంతత లేకపోవుట. ఖర్చులు అధికమగును. మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఆర్ధిక సమస్యల నుండి బయటపడతారు. మకరరాళివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వ్యాపారాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరదేశాలలో ఉన్నమీ పిల్లల నుండి శుభవార్తలు వింటారు. అన్నింటా విజయం సాధిస్తారు. అనుకూలమైన సమయం. కుంభరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు కష్ట సమయం. ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. విద్యార్థులకు అనుకూలం. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలంగా లేదు. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.