Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. వీరు మహాలక్ష్మి అష్టకం పటించాలి-today horoscope telugu check moon sign predictions according to vedik astrology for friday june 09 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope Telugu Check Moon Sign Predictions According To Vedik Astrology For Friday June 09 2023

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. వీరు మహాలక్ష్మి అష్టకం పటించాలి

HT Telugu Desk HT Telugu
Jun 09, 2023 01:02 AM IST

Today Rasi Phalalu: ఈరోజు తేదీ 09.06.2023 శుక్రవారం కోసం రాశిఫలాలను పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu: ఈరోజు 09.06.2023 శుక్రవారం రాశి ఫలాలు

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయనం,

మాసం: జ్యేష్టము వారం: శుక్రవారం,

తిథి: కృ. షష్టి నక్షత్రం: ధనిష్ట

మేషరాశి ఈరోజు ఫలాలు

మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్థము నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. చికాకులు అధికముగా ఉండును. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మేషరాశికి జన్మస్థానమునందు బుధ, గురు, రాహువులు, వాక్‌ స్థానం నందు రవి ప్రభావంచేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. చతుర్ధ స్థానము నందు కుజ, శుక్రుల ప్రభావంచేత కుటుంబ విషయాలయందు చికాకులు ఏర్పడు సూచన. పనుల యందు ఆటంకములు, చికాకులు కలుగును. కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సూచనలు అధికముగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన.

ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి.

వృషభరాశి నేటి రాశి ఫలాలు

వృషభరాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వ్యయ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత ప్రయాణములు, ఖర్చులు అధికముగా ఉండును. జన్మరాశి యందు రవి ప్రభావం చేత అనారోగ్య సూచనలు అధికము. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. శారీరక శ్రమ, ఒత్తిడి అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితములు ఉండును. వ్యాపారస్తులకు ఖర్చులు అధికముగా ఉండును. వృషభ రాశి వారికి దశమము నందు శని ప్రభావంచేత ఆర్ధికపరంగా లాభము చేకూరును.

ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

నేటి మిథునరాశి ఫలితాలు

మిథున రాశివారికి ఈ వారం మధ్యస్థముగా ఉంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ఖర్చులు అధికమగును. వాక్‌ స్థానము నందు కుజుడు, వ్యయస్థానము నందు రవి ప్రభావం చేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల చికాకులు ఇబ్బందులు కలుగుగును. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుటచేత మిథున రాశి వారికి కొన్ని పనులు అనుకూలించును. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము.

ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటకరాశి నేటి దిన ఫలాలు

కర్కాటక రాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. జన్మరాశియందు కుజుని, అష్టమ శని ప్రభావంచేత శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు ఏర్పడును. లాభస్థానము నందు రవి, దశమ స్థానము నందు బుధ గురు, రాహువుల ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరోగ్య విషయములయందు కుటుంబ వ్యవహారములయందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి ఈనాటి రాశి ఫలాలు

సింహరాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యయ స్థానములో కుజ, శుక్రుల సంచారంచేత ఖర్చులు అధికమగును. ఇష్టమైన వస్తువులు కొనే ప్రయత్నం చేసెదరు. లాభ స్థానములో శుక్రుడు దశమస్థానములో రవిప్రభావంచేత భాగ్య స్థానములో బుధ, గురు, రాహువుల ప్రభావం చేత సింహరాశి వారికి ప్రతి పని అనుకూలించును. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు అధికముగా జరుగు సూచన. నూతన వస్తువుల కోసం ధనాన్ని అధికముగా ఖర్చు చేస్తారు. ఆర్థికపరమైన నిర్ణయాలు అనుకూలించును. విద్యార్థులకు అనుకూలమైన సమయము. స్త్రీలు కుటుంబవిషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి.

మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి ఈరోజు రాశి ఫలాలు

కన్యారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార విషయాలు లాభించును. కన్యారాశి వారికి లాభస్థానములో కుజ, శుక్రుల ప్రభావంచేత ధనలాభము కలుగును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. అష్టమస్థానము నందు బుధ, గురు, రాహువుల సంచారం వలన ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. స్త్రీ సౌఖ్యం కలుగును. కన్యారాశి వారికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ప్రయాణములు లాభించును. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

నేటి తులా రాశి దిన ఫలాలు

తులారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. దశమ స్థానమునందు కుజ, శుక్రుల ప్రభావంచేత తులారాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఏర్చడును. కళత్ర స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత కుటుంబము నందు చికాకులు ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగస్తులకు అనుకూలము. కుటుంబ విషయాలయందు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. కళత్ర స్థానమునందు రవి ప్రభావంచేత కుటుంబమునందు సమస్యలు ఏర్పడు సూచన. అర్ధాష్ట శని ప్రభావంచేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. కుటుంబ విషయాల యందు శ్రమ అధికముగా ఉండును. స్త్రీలకు మధ్యస్థ సమయము. విద్యార్థులకు అనుకూల సమయము.

లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి నేటి రాశి ఫలాలు

ధనూరాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. అష్టమ కుజ, శుక్రుల ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సభ్యులతో సమస్యలు ఏర్పడు సూచన. ఐదో స్థానమందు నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించును. ధన లాభము కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి వారం. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము.

ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

నేడు మకర రాశి ఫలాలు

మకరరాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రయాణములు అనుకూలించును. ఆరోగ్యము అనుకూలించును. ఖర్చులు పెరుగు సూచన. చతుర్ధ స్థానమునందు బుధ, గురు, రాహువుల అనుకూలత వలన పంచమ స్థానము నందు రవి అనుకూలత వలన అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. వ్యాపారస్తులకు కష్టకాలము. విద్యార్థులకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మకరరాశివారికి ఏలినాటి శని ప్రభావంచేత ధన విషయమునందు జాగ్రత్తలు వహించాలి.

ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

కుంభ రాశి నేటి రాశి ఫలాలు

కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థమునుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఏలినాటిశని ప్రభావంచేత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరో స్థానమునందు కుజ, శుక్రులు ప్రభావంచేత శత్రు పీడ అధికమగును. పనులయందు ఆలస్యములు ఏర్పడినప్పటికి అనుకున్న పనులు ఏదోవిధంగా పూర్తి చేసెదరు. ధనపరమైనటువంటి విషయాలయందు శ్రమ అధికమగును. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి సమయము. విద్యార్థులకు మధ్యస్థ ఫలితములు కలుగును.

ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి ఈరోజు రాశి ఫలాలు

మీన రాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నవి. ప్రయాణాలు అనుకూలించును. ఆరోగ్య విషయాలకై ధనమును ఖర్చు చేసెదరు. ఏలినాటి శని ప్రభావం, వాక్‌ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉద్యోగ వ్యాపారాలయందు చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఆర్ధిక సమస్యలు అధికముగా ఉండును. విద్యార్థులకు మధ్యస్థ సమయము. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ 9494981000

WhatsApp channel