అక్టోబర్ 26, నేటి రాశి ఫలాలు- శనివారం పన్నెండు రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ26.10.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 26.10.2024
వారం: శనివారం, తిథి : దశమి,
నక్షత్రం: ఆశ్లేష, మాసం : అశ్వయుజము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
శుభకాలం నడుస్తోంది. అంతా మంచే జరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. మనోధైర్యం అవసరం. ఉద్యోగంలో కలిసొస్తుంది. ఆత్మీయులు ఆదరిస్తారు. సమాజంలో గుర్తింపు పొందుతారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మిత్రులు సహకరిస్తారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.
వృషభం
శుభప్రదమైన కాలం. పదవీయోగం ఉంది. కోరుకున్నట్టుగానే భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకుంటారు. వ్యాపారం విస్తరిస్తుంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. సమయానుకూలంగా వ్యవహరిస్తూ అవరోధాలను అధిగమిస్తారు. ఊహించని ఖర్చులున్నా, రుణ సమస్యలు తొలగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి.
మిథునం
పట్టుదలతో విజయం సాధిస్తారు. ముఖ్య విషయాల్లో మరింత శ్రద్ధ అవసరం. పరిస్థితులకు తగినట్టు వ్యూహాన్ని మార్చుకోవాలి. ఆత్మీయులు సూచనలు మేలు చేస్తాయి. చెడును ఊహించకండి. చిన్నపాటి అవరోధాలకు నిరుత్సాహం వద్దు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. మీ సహనాన్ని పరీక్షించేవారున్నారు జాగ్రత్త. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.
కర్కాటకం
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి విజయావకాశాలు ఉన్నాయి. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మీ శాంతమే మీకు రక్ష. తెలివితేటలతో వ్యాపారాన్ని లాభదాయకం చేస్తారు. నేటి పెట్టుబడులు దీర్ఘకాలంలో మేలు చేస్తాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. భూ, గృహ యోగాలున్నాయి. లక్ష్మీదేవిని ధ్యానించండి.
సింహం
ఉద్యోగంలో పదోన్నతి సూచనలు ఉన్నాయి. ప్రారంభించిన పనులన్నీ విజయవంతం అవుతాయి. భవిష్యత్తు దృష్టితో నిర్ణయాలు తీసుకోండి. మీ చొరవ వల్ల కొందరు లాభపడతారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మేలు. మంచి జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.
కన్య
వ్యాపారం విజయవంతంగా సాగుతుంది. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. అదృష్టయోగం సూచితం. ఉద్యోగ జీవితంలో అవరోధాలున్నాయి. అయినా, చిత్తశుద్ధితో అధిగమిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం వద్దు. ఎందుకంటే, మేలు చేయాలని ప్రయత్నించినా, కీడు జరిగే పరిస్థితులు ఉన్నాయి. సూర్యుడిని ధ్యానించండి.
తుల
అవసరాలకు తగిన డబ్బు అందుతుంది. గతంలో ఆరంభించిన పనులు ఇప్పుడు ఫలితాల్ని ఇస్తాయి. అవరోధాలు ఉన్నా ఏకాగ్రతతో పనిచేయండి. వెనకడుగు వద్దు. సకాలంలో లక్ష్యాలను పూర్తిచేయడం ద్వారా ఒత్తిడిని అధిగమిస్తారు. కొందరు ఇబ్బంది కలిగించాలని చూసినా, మనోబలంతో ఆ ప్రయత్నాల్ని తిప్పికొడతారు. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి.
వృశ్చికం
మనోబలంతో పనులు ఆరంభించండి. వృత్తి ఉద్యోగాల్లో సమయపాలన అవసరం. దేని గురించీ లోతుగా ఆలోచించకండి. కర్తవ్య నిర్వహణలో పేరు తెచ్చుకుంటారు. జన్మ శుక్రయోగం వల్ల ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. రుణ సమస్యలున్నా తేలిగ్గా అధిగమిస్తారు. వ్యాపారంలో స్వయంకృషి అవసరం. ఓ విజయం లభిస్తుంది. ఇష్టదేవతను స్మరించండి.
ధనుస్సు
మంచికాలం నడుస్తోంది. ఆశించిన ఫలితాలు ఉంటాయి. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. లాభాలు వెల్లువెత్తుతాయి. అదృష్టయోగం సూచితం. గతంలోని ఇబ్బందులు దూరం అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఉన్నాయి. ఆత్మీయుల మధ్య అపోహలు తొలగి పోతాయి. శ్రీమహాలక్ష్మిని పూజించండి.
మకరం
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వాళ్ళకు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించడం ద్వారా గుర్తింపును పొందుతారు. వ్యాపారంలో అవరోధాలున్నా, తేలిగ్గా అధిగమిస్తారు. బద్ధకాన్ని వదిలించుకోండి. ఓ ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్య నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యులను సంప్రదించండి. కులదైవాన్ని ప్రార్ధించండి.
కుంభం
మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. ప్రణాళికాబద్ధంగా బాధ్యతలు నిర్వర్తించండి. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. స్పష్టమైన ఆలోచనా విధానం అవసరం. కృషికి తగిన ఫలితం ఉంటుంది. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. తెలియని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆపదలు పొంచి ఉన్నాయి. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
మీనం
మనోబలంతో పనిచేయండి. మీ ధైర్యమే మిమ్మల్ని నడిపిస్తుంది. అవరోధాలను అధిగమిస్తారు. భాగ్య శుక్రయోగం వల్ల ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మిత్రులు సహాయ సహకారాలు అందుతాయి. ఇతరుల భావాలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. ఓ మంచి జరుగుతుంది. వినాయకుడిని పూజించండి.