మే 28, నేటి రాశి ఫలాలు.. దీర్ఘకాలిక పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది-today horoscope may 28 th rasi phalalu in telugu check your zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మే 28, నేటి రాశి ఫలాలు.. దీర్ఘకాలిక పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది

మే 28, నేటి రాశి ఫలాలు.. దీర్ఘకాలిక పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది

HT Telugu Desk HT Telugu
May 28, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ28.05.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మే 28వ తేదీ నేటి రాశి ఫలాలు
మే 28వ తేదీ నేటి రాశి ఫలాలు (pinterest)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 28.05.2024

వారం: మంగళవారం, తిథి : పంచమి,

నక్షత్రం : ఉత్తరాషాఢ, మాసం : వైశాఖము,

సంవత్సరం: శ్రీ కోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. సాహసించి పనులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ప్రయాణాలు కలసివస్తాయి. అన్నదమ్ములతో సఖ్యత ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభాలుంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కొన్నాళ్ళు వాయిదా వేసుకోవటం మంచిది. శుభకార్యాల విషయంలో ఆర్థికంగా కొన్ని చికాకులు తలెత్తవచ్చు. కుటుంబములో చిన్న చిన్న కలహాలు వుంటాయి. విందు వినోదాలకు హాజరవుతారు. మేషరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వరునికి దీపారాధనచేయండి. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం మంచిది.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. ఆస్తి గొడవలు కొంతవరకు పరిష్కారమవుతాయి. విలువైన ఆభరణాలు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వృథా ఖర్చులుంటాయి. మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించటం మంచిది. దేవీ ఖద్గమాల పఠించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. పెట్టుబడుల విషయంలో అజాగ్రత్త పనికిరాదు. పనుల్లో ఆటంకాలు తలెత్తుతాయి. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. పెద్దల సలహాలు పాటించడం అవసరం. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. సహోద్యోగులు, ఉన్నతాధికారులతో అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్యుని ఆలయం దర్శించటం మంచిది. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పరించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. సకాలంలో పనులు చేస్తే అన్నింటా విజయం లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల మూలంగా లాభాలు అందుకుంటారు. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, అనుకూల బదిలీకి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో సాహసంతో ముందడుగు వేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కర్మాటకరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆంజనేయ స్వామి వారిని పూజించండి. అప్పాలను ఆంజనేయ స్వామికి నివేదించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సహోద్యోగులతో మనస్పర్థలు తలెత్తవచ్చు. ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది. పని ఒత్తిడితో అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించాలి. సుబ్రహ్మణ్యుని ఆలయాన్ని దర్శించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబముతో సంతోషంగా గడిపెదరు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. అధికారుల అనాదరణకు గురవుతారు. సహోద్యోగుల సహకారం ఆశించినప్పటికి అంతగా దక్కకపోవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యం అనుకూలించును. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశం ఉంది. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం మంచిది. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. పనులు సకాలంలో పూర్తవుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. తీర్థయాత్రలు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబముతో సంతోషంగా కాలం గడుపుతారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంతకాలం వేచి ఉండటం మంచిది. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. తాత్కాలికంగా అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు అందరి మన్ననలను పొందుతారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబముంతో సంతోషంగా గడిపెదరు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగుల ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. అధికారుల ఆదరణ పొందుతారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. సమయపాలన పాటించడం అవసరం. వ్యాపారస్తులకు మంచి సమయం. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలించును. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి.

మకర రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబముతో సంతోషంగా గడుపుతారు. శారీరక సమస్యలు తీరతాయి. అలసట లేకుండా పనులు చేస్తారు. ప్రయాణాలు కలసి వస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య అనుకూలిస్తుంది. న్యాయవాద, ఉపాధ్యాయ, వైద్యవృత్తిలో ఉన్నవారికి కాలం కలిసివస్తుంది. బంధువులతో మాటపట్టింపులుంటాయి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. గణపతి స్తోత్రం పఠించాలి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. గతంలో ఉన్న సమస్యలు తీరుతాయి. రావలసిన డబ్బు వస్తుంది. పెద్దల సహకారం లభిస్తుంది. విహార యాత్రలు చేపడతారు. గురుభక్తి పెరుగుతుంది. సభలు, సమావేశాలకు హాజరవుతారు. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు తలెత్తుతాయి. పలుకుబడితో పనులు నెరవేరతాయి. బంధువులతో అనవసరమైన చర్చలకు దిగకండి. ఒక శుభవార్త వింటారు. కుంభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం వినాయకుడిని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి.

మీన రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. నలుగురికి సాయం చేస్తారు. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు. మంచివారిలో పరిచయాలు ఏర్పడతాయి. చివరికి అనుకున్నవన్నీ నెరవేర్చగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఊరట లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కూడదు. ఇంట్లో పెద్దవాళ్ళతో చర్చించడం అవసరం. దూర ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. మీన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel