మే 22, నేటి రాశి ఫలాలు..నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి-today horoscope may 22nd 2024 rasi phalalu in telugu check your zodiac signs results ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మే 22, నేటి రాశి ఫలాలు..నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి

మే 22, నేటి రాశి ఫలాలు..నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి

HT Telugu Desk HT Telugu
May 22, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ22.05.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మే 22వ తేదీ నేటి రాశి ఫలాలు
మే 22వ తేదీ నేటి రాశి ఫలాలు ( pinterest )

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 22.05.2024

వారం: బుధవారం, తిథి : చతుర్దశి,

నక్షత్రం : స్వాతి, మాసం : వైశాఖము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. దీర్ఘకాలిక పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబములో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు కలసివస్తాయి. అన్నదమ్ములతో కలసిమెలసి ఉంటారు. శుభకార్యాల విషయంలో ఆర్థికంగా ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. శుభవార్త వింటారు. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు ఆలయాన్ని దర్శించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆనందముగా కాలం గడిపెదరు. విలువైన ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచి వ్యక్తులతో పరిచయమవుతారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యలుంటాయి. ప్రశాంతంగా ఉంటారు. వృధా ఖర్చులుంటాయి. సమయపాలన పాటించడం మంచిది. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం కృష్ణుని ఆలయాలు దర్శించటం మంచిది. కృష్ణాష్టకం పఠించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. పెద్దల సలహాలు పాటించండి. ఉద్యోగులకు విధి నిర్వహణలో పని ఒత్తిళ్ళు ఉంటాయి. ఉన్నతాధికారులతో అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. అరోగ్యం అనుకూలించును. పనుల్లో ఆటంకాలు తలెత్తుతాయి. పెట్టుబడుల విషయంలో అచితూచి వ్యవహరించాలి. ఆర్థికంగా కలసి వస్తుంది. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీమన్నారాయణుడు/ శ్రీమహావిష్ణువుకు సంబంధించిన ఆలయాన్ని దర్శించడం మంచిది. విష్ణుమూర్తి ఆలయాలలో అర్చన జరిపించుకోవాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు అందుకుంటారు. కొత్త వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, అనుకూల బదిలీకి అవకాశముంది. వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. తీర్ధయాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో అభిప్రాయభేదములు ఏర్పడవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఖర్చులు అధికమగును. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పని ఒత్తిడితో అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. పై అధికారులతో ఇబ్బందులుంటాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. బాల్య స్నేహితులను కలుసుకుంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం అనుకూలించును. వ్యాపారస్తులకు అనుకూల సమయం. క్యాటరింగ్‌, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు లాభాలు పొందుతారు. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పరించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబముతో సంతోషంగా కాలం గడుపుతారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులుంటాయి. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. వాహన మరమ్మత్తులుంటాయి. రావలసిన డబ్బు అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పనులలో సకాలంలో పూర్తిచేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయాలి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పరించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. అనుకున్న పనులు నెరవేరతాయి. బంధువలతో సఖ్యత నెలకొంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంతకాలం వేచి ఉండటం మంచిది. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. పెద్దల సూచనలు పాటించడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు అందరి ప్రశంసలను పొందుతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గణపతి అష్టోత్తరం పఠించాలి. వినాయకుని ఆలయాన్ని దర్శించాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారులకు అనుకూల సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల ఆదరణ పొందుతారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారం లఖిస్తుంది. శుభవార్త వింటారు. శ్రద్ధతో పనులు చేయడం అవసరం. అనవసరమైన ఆలోచనలు తలెత్తుతాయి. ఆచితూచి వ్యవహరించాలి. సమయపాలన అవసరం. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. శారీరక సమస్యలు తీరతాయి. అలసట లేకుండా పనులు చేస్తారు. ప్రయాణాలు కలసివస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు విదేశీ ప్రయాణం, ఉన్నత విద్య అనుకూలిస్తుంది. న్యాయవాద, ఉపాధ్యాయ, వైద్య వృత్తిలో ఉన్నవారికి కాలం కలిసొస్తుంది. బంధువులతో భేదాభిప్రాయములు తలెత్తవచ్చు. వాహన మరమ్మతుల వల్ల ఖర్చులు పెరుగుతాయి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు యొక్క ఆలయాన్ని దర్శిచండం మంచిది.

కుంభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. పెద్దల సహకారం లభిస్తుంది. విహార యాత్రలు చేస్తారు. సహోద్యోగులతో అభిప్రాయభేదములు తలెత్తవచ్చు. బంధువులతో అనవసర చర్చలు వద్దు. భూలావాదేవీల్లో లాభాలు పొందుతారు. సభలు, సమావేశాలకు హాజరవుతారు. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు తలెత్తుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. గతంలోని సమస్యలు తీరతాయి. అరోగ్యం మెరగవుతుంది. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అవకాశాలుంటాయి. కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆరోగ్యంగా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. మంచి ఆలోచనలు వస్తాయి. దైవభక్తి పెరుగుతుంది. మంచివారితో పరిచయాలేర్పడతాయి. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పరించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner