జూన్ 8, నేటి రాశి ఫలాలు.. కొన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి-today horoscope june 8th 2024 rasi phalalu in telugu check your zodiac signs results ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ 8, నేటి రాశి ఫలాలు.. కొన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి

జూన్ 8, నేటి రాశి ఫలాలు.. కొన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి

HT Telugu Desk HT Telugu
Jun 08, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ08.06.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూన్ 8వ తేదీ నేటి రాశి ఫలాలు
జూన్ 8వ తేదీ నేటి రాశి ఫలాలు (pinterest )

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 08.06.2024

వారం: శని వారం, తిథి : విదియ,

నక్షత్రం : ఆరుద్ర, మాసం : వైశాఖము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలు ఆర్థిక పురోగతి సాధిస్తారు. బంధువర్గంతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మేష రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని రంగాల వారికి పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాల విస్తరణలో అటంకాలు అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయపడతారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన వాహన యోగమున్నది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదమై ఆప్తుల నుండి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు పరిష్కార దిశగా వస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. ముఖ్యమైన పనులలో కొంత జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుండి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడగలుగుతారు. ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అవాంతరాలను అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి వ్యాపారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధు మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కర్కాటక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారపరంగా అనుకూల సమయం. చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అవసరానికి ధనసహాయం అందుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి ఊహించని ఆహ్వానాలుంటాయి. కొన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు పొందుతారు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లఖిస్తాయి. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుడిని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. పాత మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ధనపరంగా ఒత్తిడులు పెరుగుతాయి. కన్యా రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణవిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కుటుంబ పెద్దల సహాయంతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. తెలివితేటలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు పొందుతారు. సోదరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కీలక విషయాలు సేకరిస్తారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లఖిస్తాయి. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సోదరుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారపరంగా లాభదాయకం. ఉద్యోగస్తులకు అంచనాలు నిజమవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. మానసిక ఆందోళనలు బాధిస్తాయి. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు అలోచించి తీసుకోవడం మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికమగును. కీలక విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.

కుంభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తగ్గుతాయి. దూరపు బంధువులతో గొడవలుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు. బంధువులు, మిత్రులతో అత్యంత కీలక విషయాలు గురించి చర్చిస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుడిని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. గృహమున కీలక ఆలోచనలు అమలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం అనందం కలిగిస్తుంది. నూతన పనులు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి రోజు. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణవిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పరించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel