జూన్ 28, నేటి రాశి ఫలాలు.. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు వనరులు సమకూరతాయి
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ28.06.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 28.06.2024
వారం: శుక్రవారం, తిథి : సప్తమి,
నక్షత్రం: పూర్వాభాద్ర, మాసం : జ్యేష్టము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ఉత్తరాయణం
మేష రాశి
మేష రాశి వాళ్ళు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. యాంత్రికంగా పనులను పూర్తి చేస్తారు. సహోద్యోగులతో సఖ్యత ఏర్పడుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల వల్ల అలసిపోతారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. కచ్చితమైన ప్రణాళికలు రూపొందిస్తారు.
వృషభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వాళ్ళు చేపట్టిన పనులు నిదానంగా పూర్తి అవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ, ఆరోగ్య సమస్యలు ఎదురవు తాయి. సహోద్యోగులతో అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో మెలకువలు పాటించండి.
మిథున రాశి
ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. కొత్త వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కోర్టుకు సంబంధించిన విషయాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కావలసిన వనరులను సమకూర్చుకుంటారు.
కర్కాటక రాశి
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రుల నుండి సలహాలు తీసుకుంటారు. మనో నిబ్బరంతో ముందడుగు వేసి ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు సాగిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
సింహ రాశి
కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పెద్దల ఒత్తిడితో అయిష్టంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
కన్యా రాశి
మంచి ఫలితాలు సాధించాలంటే మంచి పరిచయాలు కూడా అవసరమని భావిస్తారు. ఆ దిశగా దృష్టి సారిస్తారు. మంచి-చెడులను విశ్లేషించుకొని అడుగులను జాగ్రత్తగా ముందుకు వేస్తారు. ఒక సమస్య తీరితే మరో సమస్యను పరిష్క రించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఓర్పు వహించండి. జనాకర్షణ పెరుగుతుంది.
తులా రాశి
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రచన ప్రాధాన్యంగా కలిగినటువంటి రంగంలోని వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు ఉపయుక్తంగా పరిణమిస్తాయి. మంచి-చెడులను విడమరచి చెప్పే సన్నిహిత వర్గం ఉంటారు. వృతి, ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడుదుడుకులేమీ ఏర్పడవు. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కళలు, రాజకీయ, రంగాల లోని వారికి సన్మానయోగం. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వివాహాది శుభ కార్యాలు సానుకూల పడతాయి. కీలకమైన విషయాలలో తొందరపాటు తగదు.
ధనుస్సు రాశి
ముఖ్యమైన వస్తువుల భద్రత పట్ల జాగ్రత్తలు పాటించండి. కీలకమైన పనులను సన్నిహితుల సహకారంతో పూర్తి చేస్తారు. ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. గృహం,వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. ఎదుటివారు మీరు చెప్పేది ఆసాంతం వినకుండా మీ మీద నిందలు వేయడం అసహనానికి గురి చేస్తుంది. నూతన ఒప్పందాలు చేసుకుంటారు.
మకర రాశి
కీలక నిర్ణయాలలో ముఖ్యుల సలహాలు పాటిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా సమయానికి సర్దుబాటు చేసుకుంటారు. బంధువులు, మిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఒప్పందాల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. వృత్తి, వ్యాపారాలలో మరింత శ్రద్ధ అవసరం.
కుంభ రాశి
వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడి చేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. బాధ్యతలు పెరగడం వల్ల శ్రమ అధికమవుతుంది. ఇంట్లో, వ్యాపార ప్రదేశంలో అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న చిన్న వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారకుండా జాగ్రత్తలు వహించండి.
మీన రాశి
కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కారమవుతాయి. మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుతాయి. గృహం, స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహకారం అందిస్తారు. సాంకేతిక రంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది.