నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 26.06.2024
వారం: బుధవారం, తిథి : పంచమి,
నక్షత్రం: ధనిష్ఠ, మాసం : జ్యేష్టము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ఉత్తరాయణం
మేష రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. శ్రమకు ఫలితం దక్కనుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి.
వృషభ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొన్ని కీలక విషయాల్లో సన్నిహితులతో రాజీ పడాల్సి ఉంటుంది. చర, స్థిరాస్తుల వృద్ధి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. కనకధారాస్తోత్రాలు పఠించండి.
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈరోజు పలు విషయాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు సఫలీకృతమవుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇంటి నిర్మాణంలో ఎదురైన ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగ రంగంలో గుర్తింపు లభిస్తుంది. పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి.
దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ధన, వస్తులాభాలున్నాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి నూతనోత్సాహం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
పనులలో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు, మీ నిర్ణయాలను బంధువులు వ్యతిరేకిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. హనుమాన్ చాలీసా పఠించండి.
అవసరాలకు సరిపడా ఆదాయం సమకూరి ఆనందంగా గడుపుతారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఒక సమాచారంతో ఊరట పొందుతారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. శివపంచాక్షరి పఠించండి.
నూతన పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తు, వస్త్రలాభాలున్నాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబసభ్యుల్లో అనుమానాలు నివృత్తి చేస్తారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయి. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం. గణేశాష్టకం పఠించండి.
అనుకున్న ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటా బయటా మీదే పైచేయిగా ఉంటుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. సంఘంలో గొప్ప పరిచయాలు ఏర్పడుతాయి. విద్యార్థులకు శుభ ఫలితాలు అందుతాయి. ఉద్యోగులు ఆనందంగా గడుపుతారు. గణేశాష్టకం పఠించండి.
గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితులు కాస్త ఆశాజనకంగా మారతాయి. తలపెట్టిన పని పూర్తయ్యే వరకూ విశ్రమించరు. ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు తీరే సమయమిది. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వస్తు,వాహన యోగం ఉంది. వ్యాపారులకు ఆశాజనక ఫలితాలు రానున్నాయి. ఉద్యోగపరమైన చిక్కులు తొలగుతాయి. రాఘవేంద్రస్వామిని స్మరించండి.
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి అనుకున్న పనులను సమయానుగుణంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలుకు ఉన్న అడ్డంకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని ఖర్చులు చేస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. వ్యాపారాభివృద్ధికి సరైన సమయం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
వివాహాది ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఒక వ్యక్తి ద్వారా అత్యంత కీలక విషయాలు తెలుస్తాయి. ఉద్యోగంలో సమస్యలు తీరతాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహం పెరుగుతుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
ఎటువంటి వ్యవహారమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. విద్యార్థుల యత్నాలు కొలిక్కి వచ్చే వీలుంది. ఆర్థిక లావాదేవీలు చాకచక్యంగా నిర్వహిస్తారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలుకు వస్తున్న ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో సమర్ధతను చాటుకుంటారు. రాజకీయవర్గాలకు ఒక ఊహించని పదవి దక్కవచ్చు. శివాష్టకం పఠించండి.