జూన్ 23, నేటి రాశి ఫలాలు.. వీరికి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కోరిక నెరవేరబోతుంది-today horoscope june 23rd rasi phalalu in telugu check your zodiac signs results ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ 23, నేటి రాశి ఫలాలు.. వీరికి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కోరిక నెరవేరబోతుంది

జూన్ 23, నేటి రాశి ఫలాలు.. వీరికి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కోరిక నెరవేరబోతుంది

HT Telugu Desk HT Telugu
Published Jun 23, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ23.06.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూన్ 23వ తేదీ నేటి రాశి ఫలాలు
జూన్ 23వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik )

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 23.06.2024

వారం: ఆదివారం, తిథి : పాడ్య‌మి,

నక్షత్రం: పూర్వాషాఢ‌, మాసం : జ్యేష్టము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ఉత్తరాయణం

మేష రాశి

నూత‌న వ్యక్తులతో ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌తాయి. దాంతో ఈరోజు అంతా సంతోషంగా ఉంటుంది. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయ‌డానికి క‌లిసొచ్చే కాలమిది. మీ ఆశయ సాధ‌న‌కు బంధువుల స‌హ‌కారం అందుతుంది. విద్యార్థుల‌కు అన్నివిధాలుగా శుభ‌దాయ‌క‌మైన కాలం. చిరకాల మిత్రులతో మంచిచెడ్డ‌లు చ‌ర్చిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మొండి బ‌కాయిలు వ‌సూలు అవుతాయి. ఇబ్బందులు తొలగుతాయి. మీ నిర్ణయాలకు ఆమోదం లభిస్తుంది. వివాహ ప్ర‌య‌త్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో క్రమేపీ లాభాలు ఆర్జిస్తారు. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. మీ సత్తా చాటుకుంటారు. విధుల్లో అడ్డంకులు తొలగుతాయి. శివాష్టకం పఠించండి.

వృషభం

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు త్వ‌రిత‌గ‌తిన పూర్త‌వుతాయి. ఇంత‌కాలం వాయిదా ప‌డిన ప‌నులు సైతం ఒక కొలిక్కి వ‌స్తాయి. భూ, వాహనయోగాల‌కు అవ‌కాశం ఉంది . ఆత్మవిశ్వాసంతో రాణిస్తారు. ఆనందంగా గ‌డుపుతారు. నూత‌న కాంట్రాక్టులు ద‌క్క‌డంతో ఉత్సాహంగా ఉంటారు. ధనప్రాప్తి క‌లుగుతుంది. పెద్ద‌ల‌ నిర్ణయాలను గౌరవించండి. కుటుంబ‌స‌భ్యుల ప్రేమ ద‌క్కుతుంది. వృత్తిప‌రంగా ప‌దోన్న‌తులు సూచితం. పెద్ద‌ల‌ ప్ర‌శంస‌లు అందుకుంటారు. వివాహ యత్నాలు సానుకూలం. వ్యాపారంలో లాభాలు సూచితం. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆంజనేయ దండకాన్ని భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ప‌ఠించండి.

మిథునం

నిరుద్యోగుల‌కు క‌లిసి వ‌చ్చే కాలం. కోరుకున్న ఉద్యోగంలో స్థిర‌ప‌డ‌తారు. సమస్యల ప‌రిష్కారానికి మార్గం సుగ‌మం అవుతుంది. ఆర్థిక‌ప‌ర‌మైన విష‌యాల్లో ఇబ్బందులు తొల‌గుతాయి. జీవిత‌ భాగ‌స్వామి ద్వారా ధ‌న‌లాభం సూచితం. మీ ప‌ట్ల కుటుంబ‌ స‌భ్యులు సంతోషంగా ఉంటారు. ముఖ్య‌మైన విష‌యాల్లో పెద్దల సలహాలు పాటించండి. శుభ‌కార్యాల్లో భాగం అవుతారు. రుగ్మతల నుంచి బయటపడతారు. వ్యాపార‌ప‌రంగా భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. శ్రీలక్ష్మీ నృసింహ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం

మీమీ రంగాల్లో నూత‌న‌ విషయాలు నేర్చుకుంటారు. ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక కోరిక‌ నేర‌వేరుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త‌ ఆలోచనలు అమలుచేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. భూ, వ‌స్తు, వాహ‌న కొనుగోలులో ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న ఆటంకాలు తొల‌గిపోతాయి. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సైతం అందుకుంటారు. రుణబాధలు తొలగుతాయి. మీ మాట‌కు విలువ వ‌స్తుంది. దాంప‌త్య జీవితంతో స‌ఖ్య‌త నెల‌కొంటుంది. సంతానపర‌మైన ఇబ్బందులు తొల‌గుతాయి. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పైస్థాయి వారి నుంచి ప్రోత్సాహం అందుతుంది. రాజకీయవేత్తలకు క‌లిసి వ‌స్తుంది. మహిళలకు ఆస్తిలాభాలు సూచితం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం

ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. న‌మ్మిన‌వారే మీపై అప‌వాదులు వేస్తారు. అప్ర‌మ‌త్తంగా ఉండండి. ఆలోచ‌న‌ల్లో చంచ‌ల‌త్వం క‌నిపిస్తుంది. శ్ర‌మ పెరుగుతుంది. ఆల‌యాలు సంద‌ర్శిస్తారు. ధ‌నానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త రుణాలు అందుతాయి. కుటుంబసభ్యులతో లేనిపోని వివాదాలు. సోద‌రుల‌తో ఆస్తి త‌గాదాల‌కు తావివ్వొద్దు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు, పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు చికాకు పరుస్తాయి. మహిళలకు మానసిక అశాంతి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

కన్య

మీ ఆలోచ‌న‌ల‌తో ముందుకు సాగుతారు. ప‌లు విష‌యాల్లో మీ అభిప్రాయాలు అందరికీ ఉపయోగపడతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ ఖ్యాతి మరింత విస్తరిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. సంతానపరంగా నెలకొన్న చిక్కులు తొలగుతాయి. వేడుకల్లో పాలుపంచుకుంటారు. వ్యాపార రంగంలో నెల‌కొన్న అవాంత‌రాలు అధిగ‌మిస్తారు. నూతన పెట్టుబడులు సమకూరతాయి. లాభాలు చ‌విచూస్తారు. ఉద్యోగులకు కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు ఊహించని విదేశీ పర్యటనలు, మహిళలకు మానసికోల్లాసం. ఆదిత్యహృదయం పఠించండి.

తుల

నూత‌న వ్య‌క్తుల ప‌రిచ‌యం ఆనందాన్ని నింపుతుంది. శుభవార్త వింటారు. మిత్రుల‌తో నెల‌కొన్న విభేదాలు స‌మ‌సిపోతాయి. చిర‌కాల కోరిక నెర‌వేరుతుంది. అవసరాలకు తగినంతగా సొమ్ము. అందుతుంది. అందరితోనూ సఖ్యతగా మసలుకుంటారు. జీవితభాగస్వామి నుంచి తగినంత ప్రోత్సాహం అందుతుంది. సోదరులు, సంతానం నుంచి ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. మహిళలకు విశేష గౌరవం లభిస్తుంది. ప‌ర‌మ‌శివుడిని పూజించ‌డంతో మంచి క‌లుగుతుంది.

వృశ్చికం

నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. వ్యయప్రయాలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. న‌మ్ముకున్న‌వారే శ‌త్రువులుగా మారే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని విష‌యాల్లో మీ శ్ర‌మ‌కు త‌గిన గుర్తింపు రాదు. నిరుద్యోగులు తమ ప్రయత్నాలను వాయిదా వేసుకుంటారు. ఆర్థికప‌ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపార విస్త‌ర‌ణ‌లో భాగ‌స్వాముల‌తో త‌గాదాలు నెల‌కొనే అవ‌కాశం ఉంది. ఉద్యోగులు పనిభారంతో సతమతమవుతారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఎదుర‌వుతుంది. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు

చేప‌ట్టిన ప‌నుల‌ను అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి. స‌మాజంలో గౌర‌వం పెరుగుతుంది. ప‌రిచయాలు కూడా విస్తృతం అవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. బంధువుల నుంచి ధనలాభాలు పొందుతారు. పెద్దల సలహాలతో కొన్ని కీల‌క‌ నిర్ణయాలు తీసుకుంటారు. ప్ర‌శంస‌లు అందుకుంటారు. కుటుంబ‌స‌భ్యుల‌తో నెల‌కొన్న వివాదాలకు ముగింపు ప‌లుకుతారు. వ్యాపార విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు. కొత్త భాగస్వాములతో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు సంభవం, ఉన్నతాధికారులు మీరంటే మరింత ఇష్టపడే సమయం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

మకరం

ఉరకలెత్తే ఉత్సాహంతో కొన్ని ప‌నులు పూర్తి చేస్తారు. నూత‌న‌ నిర్ణయాలు తీసుకుంటారు. భూ, వాహ‌న కొనుగోల‌కు స‌రైన స‌మ‌యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అందుతుంది. రుణభారాలు తొలగి ఊరట చెందుతారు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు అందుతాయి. కుటుంబసభ్యులతో సఖ్యత నెలకొంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ప‌దోన్న‌తులు సూచితం. అంగారక స్తోత్రాలు పఠించండి.

కుంభం

ప‌నుల్లో ఇబ్బందులు తొల‌గుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. మీ ఉన్నతికి వారు స‌హాయ ప‌డ‌తారు. కాంట్రాక్టర్లకు కలసివచ్చే సమయం. ఆకస్మిక ధనలాభంతో అవసరాలు తీరతాయి. మీ ప్రేమాభిమానాలతో కుటుంబసభ్యులు ఆనందిస్తారు. మీ నిర్ణయాలు సోదరులతో పంచుకుంటారు. ఆస్తిలాభం. సంతానపరంగా శుభవార్తలు వినే అవ‌కాశం ఉంది. వ్యాపారంలో లాభాలు సూచితం. ఉద్యోగులు విధుల్లో మీ సమర్థతను చాటుకుంటారు. ఉన్నతాధికారులను మెప్పిస్తారు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

మీనం

స్నేహితుల నుంచి ఒత్తిడులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. అవసరాలకు తగినంత సొమ్ము సమ కూరుతుంది. మొండి బకాయిలు వ‌సూలు అవుతాయి. ఆపదలో ఉన్నవారికి ధనసహాయం చేస్తారు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. బంధువుల్లో మీపై గౌర‌వం పెరుగుతుంది. మీ మాట‌కు వాళ్లు విలువ‌నిస్తారు. సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు తొలగుతాయి. కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. మహిళలకు మనోధైర్యం పెరుగుతుంది. ఆదిత్య హృదయం మూడుసార్లు పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner