జూన్ 22, నేటి రాశి ఫలాలు... ఈ రాశుల వారికి కలిసి రాని రోజు ఇది, ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి-today horoscope june 22nd 2024 rasi phalalu in telugu check your zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ 22, నేటి రాశి ఫలాలు... ఈ రాశుల వారికి కలిసి రాని రోజు ఇది, ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి

జూన్ 22, నేటి రాశి ఫలాలు... ఈ రాశుల వారికి కలిసి రాని రోజు ఇది, ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి

HT Telugu Desk HT Telugu
Jun 22, 2024 12:05 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 22.06.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు (Pexels)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 22.06.2024

వారం: శనివారం, తిథి : పౌర్ణమి,

నక్షత్రం : మూల, మాసం : జ్యేష్టము,

సంవత్సరం:శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండదు. మంచి అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. మీ ప్రయత్నాలకు సన్నిహితుల నుంచి సహకారం లభిస్తుంది. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతిని దూరం చేస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. బంగారు, వెండి, వస్త్ర, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడి ఉంటుంది. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

వృషభరాశివారికి ఈ రోజు అనుకూలంగా లేదు. రావలసిన ధనం చేతికి అందక ఆందోళన చెందుతారు. విద్యార్థులకు తోటివారి వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మిథునరాశి

మిథునరాశివారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ అవసరం. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు కనిపిస్తాయి. ఓర్పు, సహనంతో సమస్యలు పరిష్కారమవుతాయి. మీ లక్ష్య సాధనకు నిరంతరం కృషి, పట్టుదల అవసరమని గమనించండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబీకుల ఆరోగ్య విషయంలో మెళకువ వహించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

కర్కాటకరాశి

కర్కాటక రాశి వారికి మీకు అంత అనుకూలంగా లేదు. చేయాలనుకున్న పనులు వాయిదా వేస్తారు. ప్రింటింగ్‌ రంగాల్లో ఉన్న వారికి పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. హోటల్‌, క్యాటరింగ్‌ రంగాల వారికి లాభదాయకం. పైవేటు సంస్థలలోని వారి నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల యాజమాన్యం కోపతాపాలకు గురి కావలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి, నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి

సింహరాశి వారికి మధ్యస్థ ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. ప్రింటింగ్‌ రంగంలో ఉన్నవారు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. రావలసిన ధనం అందడంతో మీలో పలు ఆలోచనలు వస్తాయి. ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. గృహనిర్మాణాలు, మరమ్మత్తులు జరుగుతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం వల్ల కష్టమవుతుంది. విదేశీయత్నాల్లో స్వల్చ ఆటంకాలు ఎదుర్కొంటారు. కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

తులా రాశి

తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చికరాశి

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గృహానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు. విద్యార్థులు అధిక ఉత్సాహం ప్రదర్శించడం వల్ల సమస్యలను లోనవుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలించవు. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, ఒత్తిడి, చికాకులు తప్పవు. స్వల్ప ఆరోగ్య సమస్యలుంటాయి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. పాతమిత్రుల నుండి ఆహ్వానాలు, లేఖలు అందుకుంటారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. బంధువుల మధ్య అపోహలు తొలగిపోయి. ఆప్యాయతలు మరింత బలపడతాయి. మహిళలకు పనివారితో చికాకులు తప్పవు. అవకాశవాదులు అధికం కావడం వల్ల ఊహించని ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకరరాశి వారికి ఈ రోజు మీకు వ్యాపారపరంగా అనుకూల సమయం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. సోదరీ సోదరుల మధ్య సమస్యలు తలెత్తుతాయి. పత్రిక, మార్కెట్‌ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆత్మీయులను విమర్శించుట వలన చికాకులను ఎదుర్కొంటారు. కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు అధికమగును. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. వచ్చిన సొమ్మును పొదుపు పథకాలవైపు మళ్ళించండి. రావలసిన ధనం చేతికందుతుంది. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. నమ్మకం, పట్టుదలతో ప్రయత్నాలు సాధించండి. సత్ఫలితాలను పొందుతారు. కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలుంటాయి. జాగ్రత్తలు వహించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రతి విషయంలో ఆత్మనిగ్రహం అవసరమని గమనించండి. మహిళలు వాక్‌ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. దూర ప్రయాణాల్లో వస్తువులు జారవిడుచుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. హోటల్‌, కేటరింగ్‌ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000 www.chilakamarthi.com

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel