జూన్ 20, నేటి రాశి ఫలాలు.. వృత్తి, వ్యాపారాల్లో ధన లాభం, సమయం వృధా చేసుకోవద్దు-today horoscope june 20th 2024 rasi phalalu in telugu check your zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ 20, నేటి రాశి ఫలాలు.. వృత్తి, వ్యాపారాల్లో ధన లాభం, సమయం వృధా చేసుకోవద్దు

జూన్ 20, నేటి రాశి ఫలాలు.. వృత్తి, వ్యాపారాల్లో ధన లాభం, సమయం వృధా చేసుకోవద్దు

HT Telugu Desk HT Telugu
Jun 20, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ20.06.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూన్ 20 వ తేదీ నేటి రాశి ఫలాలు
జూన్ 20 వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 20.06.2024

వారం: గురువారం, తిథి : త్రయోదశి,

నక్షత్రం : అనూరాధ, మాసం : జ్యేష్టము,

సంవత్సరం:శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలుంటాయి. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు సాధిస్తారు. నూతన వ్యాపారాల విషయాల గురించి ఆలోచన చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. నూతన పరిచయాలు కలసివస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. దేవాలయాలు సందర్శన చేస్తారు. విద్యార్థులకు అనుకూలం. మేషరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్పించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో కలసి ఆనందముగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పైఅధికారులతో ఇబ్బందులుంటాయి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి ముందుకు సాగుతారు. కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ప్రయాణాలు వలన ఖర్చులు అధికమవుతాయి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుణ్ణి పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. విలాసవంతమైన వస్తువుల కోసం అధికంగా ధనమును ఖర్చు చేస్తారు. నూతన పరిచయాలు కలసివస్తాయి. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తగును. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా వుంటాయి. భాగస్వామితో ఆనందముగా గడుపుతారు. అన్నదమ్ముల సహాయ సహకారములు లభించును. మీవంతు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. కుటుంబములో చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆనందముగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఆనందముగా ఉంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సంతాన అభివృద్ధి మీకు అనందం కలిగిస్తుంది. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీరు చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకులేర్పడతాయి. మానసికంగా బలహీనంగా ఉంటారు. అనవసరమైన ఖర్చులుంటాయి. ఉద్యోగస్తుల పనితీరును అధికారులు గుర్తిస్తారు. సంతానం విషయంలో ప్రతికూలత ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక ఆలోచన చేస్తారు. సంఘము నందు చేయు వ్యవహారములలో తెలివిగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. నూతన పరిచయాలు లాభిస్తాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ధనలాభం కలుగును. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధికంగా ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రయాణాలు కలసివస్తాయి. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శంకరాచార్య విరాచిత దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసరమైన ఆలోచనలతో సమయాన్నివృధాగా గడపకండి. చెడు కార్యాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఆటంకాలుంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికి సమయానికి ధనం అందుతుంది. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తులారాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురుదక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్పించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మానసికంగా బలహీనంగా ఉంటారు. ఇతరులతో వాదనకు దూరంగా ఉండాలి. చేయు పనుల్లో ఆవేశంగా కాకుండా నిదానంగా ఆలోచించి చేయండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. ఇతరులతో తొందరపాటు మాటలు మాట్లాడవద్దు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృశ్చిక రాశి మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుణ్ణి పూజించాలి. దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కీలకమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతో కొద్దిపాటి కలహాలు రాగలవు. కుటుంబనందు ప్రతికూలత వాతావరణం ఉంటుంది. అనవసర ఆలోచనలతో సమయాన్ని వృధా చేయకండి. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం శ్రీరామరక్షాస్తోత్రాన్ని పఠించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

మకర రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వైవాహిక జీవితంలో మనస్పర్థలు రావచ్చు. ఆరోగ్యం మీద జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును. ఆధ్యాత్మిక ఆలోచన చేస్తారు. కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగిస్తాయి. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దత్తాత్రేయుణ్ణి పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబములో సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థుల ప్రతిభ కనబడుతుంది. కుటుంబములో శుభకార్య ఆలోచనలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కీలకమైన విషయాలలో ధైర్యంగా ముందడుగు వేయండి. కుటుంబ సభ్యులు మద్దతు మీకు ఉంటుంది. బంధుమిత్రులతో నూతన ప్రయత్నాలు గూర్చి ఆలోచన చేస్తారు. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుణ్ణి పూజించాలి. శ్రీ గురుచరిత్ర పఠించాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఆందోళనగా ఉంటారు. అకారణంగా గొడవలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక ఆలోచన చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. పనుల్లో అధిక శ్రమ ఉంటుంది. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీన రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel