జులై 8, నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి గ్రహదోషం అధికంగా ఉంటుంది
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ08.07.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 08.07.2024
వారం: సోమవారం, తిథి : తదియ,
నక్షత్రం: పుష్యమి, మాసం : ఆషాడము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ఉత్తరాయణం
మేష రాశి
యోగబలం ఉంది. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి సూచనలున్నాయి. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. అధికారం అందుతుంది. వ్యాపార ఫలితాలు ఆశాజనకంగా ఉండనున్నాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కీలక విషయాల్లో నిర్ణయాలు త్వరితగతిన తీసుకోగలరు. వృత్తి, ఉద్యోగంలో నైపుణ్యం పెంచుకుంటారు. లక్ష్మీదేవిని పూజించండి.
వృషభ రాశి
ఆర్థిక ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. రుణ సమస్యల నుంచి కొంత బయటపడతారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. మొహమాటానికి పోవద్దు. పొదుపు ప్రాధాన్యం పెంచాలి. నేర్పుగా సంభాషించాలి. ఓర్పు అవసరం. వ్యాపారంలో స్థిర నిర్ణయాలు తీసుకోండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
మిథున రాశి
శుభప్రదమైన కాలం. మంచి ఫలితాలు సాధిస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. కుటుంబసభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కొత్త ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. ఉద్యోగంలో ఇబ్బందులున్నా, అంతిమ విజయం మీదే. సూర్యభగవానుడిని ధ్యానించండి.
కర్కాటక రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈరోజు బుద్ధిబలం అవసరం. గ్రహదోషం అధికంగా ఉంది. కీలక విషయాల్లో అప్రమత్తతతో వ్యవహరించాలి. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. చాలా సందర్భాల్లో మౌనమే ఉత్తమం. కొన్ని అభాండాలు ఎదురవుతాయి. ఓర్పు అవసరం. నిర్ణయాల్లో చంచలత్వం వద్దు. ఆత్మవిశ్వాసంతో సంభాషించండి. ఆత్మీయులతో కలహాలు తొలగుతాయి. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.
సింహ రాశి
జీవితంలో కొత్త మలుపులు ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు సఫలం అవుతాయి. పనుల్లోనూ పురోగతి ఉంటుంది. గ్రహదోషం అధికం. వ్యాపారంలో అప్రమత్తత అవసరం. కొంతమేర లాభాలు తగ్గినా ఆందోళన వద్దు. నలుగురికీ సాయపడతారు. ఇష్టదైవాన్ని ప్రార్ధించండి.
కన్యా రాశి
అదృష్టం వరిస్తుంది. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. మనోవాంఛ సిద్దిస్తుంది. కొత్త ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. శుభ వార్తలు వింటారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల్ని పెంచుకోడానికి సరైన సమయం. నిర్ణయాలను వాయిదా వేయకండి. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. లక్ష్మీదేవిని ఆరాధించండి.
తులా రాశి
మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. నైపుణ్యాన్ని పెంచుకుంటారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంది. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. అధికారుల అండ లభిస్తుంది. అనవసర సంభాషణలు వద్దు. ముఖ్య నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
వృశ్చిక రాశి
ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. అంకితభావం ముఖ్యం. ప్రతిభతో నలుగురినీ మెప్పిస్తారు. ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. దీర్ఘకాలిక ఆశయాలు నెరవేరుతాయి. చంచలత్వం వద్దు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ధర్మమార్గంలోనే ప్రయాణించండి. వివాదాలకు అతీతంగా వ్యవహరించండి. ఇష్టదైవాన్ని స్మరించండి.
ధనుస్సు రాశి
మనోబలంతో లక్ష్యాలను సాధిస్తారు. ప్రారంభించిన పనుల్ని పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అశ్రద్ధ వద్దు. తేడా వస్తే అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. బలమైన వ్యూహాలతో సిద్ధంగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.
మకర రాశి
శుభప్రదమైన సమయం. సకాలంలో పనులు ప్రారంభించండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. దూరమైపోయిన ఆత్మీయులు మళ్లీ దగ్గరవుతారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి.
కుంభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈరోజు ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. కార్యసిద్ధి ఉంది. స్పష్టమైన ఆలోచనా విధానం అవసరం. వ్యాపారంలో ధనలాభం సూచితం. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెద్దల ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో కొద్దిపాటి సమస్యలు ఎదురవుతాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు. శ్రీమహాలక్ష్మిని ధ్యానించండి.
మీన రాశి
మీ మనోబలమే మిమ్మల్ని కాపాడుతుంది. ఏకాగ్రత అవసరం. ఆర్ధిక పురోగతికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులు సంపదల్ని కురిపిస్తాయి. గ్రహదోషం సూచితం. దీనివల్ల ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. కుటుంబ సభ్యులతో సంప్రదించాకే కీలక నిర్ణయాలు తీసుకోండి. విమర్శల్ని పట్టించుకోవద్దు. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.