జులై 7, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఒక శుభవార్త కుటుంబంలో ఆనందం నింపుతుంది-today horoscope july 7 th rasi phalalu in telugu check your zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జులై 7, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఒక శుభవార్త కుటుంబంలో ఆనందం నింపుతుంది

జులై 7, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఒక శుభవార్త కుటుంబంలో ఆనందం నింపుతుంది

HT Telugu Desk HT Telugu
Jul 07, 2024 05:18 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ07.07.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జులై 7వ తేదీ నేటి రాశి ఫలాలు
జులై 7వ తేదీ నేటి రాశి ఫలాలు (pixabay )

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 07.07.2024

వారం: ఆదివారం, తిథి : విదియ‌,

నక్షత్రం: పుష్య‌మి, మాసం : ఆషాడ‌ము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ఉత్తరాయణం

మేష రాశి

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా సాగుతుంది. నిత్యకృత్యాల్లో స్వ‌ల్ప‌మార్పులు ఏర్ప‌డ‌తాయి. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతగా ఉండి గుర్తింపులు పొందుతారు. కళాశాల ప్రవేశాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు అదనపు పనిభారం. ఆర్థిక ప‌ర‌మైన ఒత్తిళ్లు ఉంటాయి. ఇతరులపై ఆధిపత్యం చేయ‌కండి. కుటుంబస‌భ్యుల స‌హాయ‌ సహకారాలు మెండుగా అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సాధారణ స్థితి ఉన్న‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లితాలు ల‌భించ‌వు. స్థిరాస్తుల వ్యవహారములకు దూరంగా ఉంటూ ఖర్చుల్లో నియంత్ర‌ణ అవ‌స‌రం.

మిథున రాశి

విద్యా విషయాల్లో శుభ ఫ‌లితాలున్నాయి. విజ్ఞానదాయకంగా ఉంటుంది. కొత్త‌ విషయాలు నేర్చుకుంటారు. కుటుంబంలో ఉత్సాహక‌ర‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. వృత్తి, వ్యాపారాలు గ‌తంతో పోలిస్తే మెరుగ్గా ఉంటాయి. గృహనిర్మాణాది ఆలోచనలు చేస్తారు. రుణ‌ భారం ఎక్కువ కాక‌ముందే త్వ‌ర‌ప‌డండి.

కర్కాటక రాశి

స్థిరాస్తి వ్యవహారములలో మంచి నిర్ణయాలు తీసుకోగలరు. గతంలో ఆగిపోయిన ప‌నుల‌పై దృష్టిపెట్టి సాధించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అంకిత భావంతో ప‌నిచేస్తారు. అధికారుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటారు. కొందరికి కొత్త కొలువులు ఏర్పడతాయి. వాహన, గృహోపకరణములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు, విద్యార్థుల కోరికలు తీరతాయి.

సింహ రాశి

మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చును. వృత్తి, ఉద్యోగాలకు అనువైన స‌మ‌యం. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటూ నిజాయితీకి ప్రాధాన్యత ఇవ్వండి. రుణ‌బాధ‌లు కొంత‌మేర త‌గ్గించుకుంటారు. కృషికి తగిన ప్రయోజనాలు పొందుతారు.

కన్యా రాశి

వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో ఆశాజ‌న‌కంగా ఉంటుంది. కుటుంబంలో క‌ల‌త‌లు ఏర్ప‌డ‌వ‌చ్చు. ఆర్థికంగా ఉత్సాహకరమయిన స్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. విద్యార్థులకు నూతన కోర్సులలో ప్రవేశాలు దొరుకుతాయి.

తుల రాశి

ఉత్సాహంగా స‌మ‌యాన్ని గ‌డుపుతారు. ప్రత్యర్థి వర్గం నుండి కొంత వెసులుబాటు ఏర్పడుతుంది. కుటుంబసభ్యులతో ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన‌ జాగ్రత్తలు అవసరం. ఒక శుభ‌వార్త కుటుంబంలో ఆనందం నింపుతుంది. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది.

వృశ్చిక రాశి

ఇంటా-బయటా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల‌త‌లు ఏర్ప‌డ‌తాయి. ఇత‌రుల‌తో స్నేహంగా మెల‌గండి. న‌మ్మిన‌వారి వ‌ల్ల ఒకింత మాన‌సిక బాధ‌కు గురి అవుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల్లో అంకితభావంతో సాగండి.

ధనుస్సు రాశి

గ‌తంతో పోలిస్తే అనుకూల వాతావ‌ర‌ణం ఉంటుంది. చేపట్టిన ప‌నుల‌ను స‌రైన స‌మ‌యానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులకు క‌లిసి వ‌చ్చే సమయం. మీ ఆకాంక్ష‌లు నెర‌వేరుతాయి. పెట్టుబడులకు దూరంగా ఉండాలి. నూతన వ్యాపార, వ్యవహారాలను చేపట్టగ‌ల‌రు.

మకర రాశి

సంతానంచే చిన్నతరహా ఒత్తిడి ఉంటుంది, నిరాశవాదాలకు గురికాగల సూచనలు ఉన్నాయి. ఆరోగ్య, ఆర్థిక విషయాలు బాగుంటాయి. వ్యాపారులకు, చేతి వృత్తులవారికి ప్రోత్సాహకాలు లభిస్తాయి. రుణయత్నాలు ఉపకరిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. అధికారులు, పెద్దలు వంటివారితో సంయమనం పాటించాలి.

కుంభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారు ఈరోజు ఓర్పుగా ఉండాలి. వ్యక్తిగత విషయాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ‌స‌భ్యుల స‌హ‌కారం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. కొన్ని విష‌యాల ప‌ట్ల‌ మనోధైర్యంతో వ్యవహరించండి. విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది.

మీన రాశి

ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. అవసరాల్ని సమర్థించుకోలేని స్థితులుంటాయి. కొన్ని విష‌యాల్లో కుటుంబ‌స‌భ్యుల స‌హాయం పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మానసిక ధైర్యంతో ముందుకుసాగండి. వ్యాపారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel