జులై 1, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి శుభ సమయం ఆసన్నమైంది
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ01.07.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 01.07.2024
వారం: సోమవారం, తిథి : దశమి,
నక్షత్రం: అశ్వినీ, మాసం : జ్యేష్టము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ఉత్తరాయణం
మేష రాశి
మేష రాశి వారికి శుభసమయం ఆసన్నమైంది. నిరుత్సాహం వీడండి. గొప్ప వ్యక్తులతో పరిచయాలు బలపడతాయి. అవసరాలకు ధనం అందుతుంది. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఏ విషయాన్నీ మనసుకు తీసుకోవద్దు . పిల్లలకు శుభఫలితాలున్నాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. కుటుంబ విషయాల్లో మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత లభిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్ని ఇస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మీ ఇష్టాయిష్టాలకు మంచి స్పందన లభిస్తుంది. కొన్ని విషయాల్లో ఆందోళన తగ్గుతుంది.
మిథున రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి శ్రమ అధికమవుతుంది. శ్రమకు తగిన ఫలితం మాత్రం లభించదు. అనవసర ఆలోచనలతో సతమతమవుతారు. మీ కష్టం వేరొకరికి కలిసి వస్తుంది. పట్టుదలతో ప్రయత్నించండి. చికాకులు త్వరితగతిన తీరతాయి. మీ కృషి ఫలించే రోజు త్వరలోనే ఉంది. మీ భాగస్వామి సలహా పాటించండి. ఖర్చులు విపరీతమవుతాయి. రాబడిపై దృష్టి పెట్టండి. ఆప్తుల సాయంతో ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.
కర్కాటక రాశి
ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంది. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. అనవసర ఆలోచనల నుంచి బయటపడేందుకు ఏదైనా వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. ఇంటి విషయాలు పట్టించుకోండి. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు.
సింహ రాశి
శుభవార్త వింటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. పదవులు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ధనలాభం, నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించండి.
కన్యా రాశి
గ్రహస్థితి కారణంగా కన్యారాశికి అనుకూల సమయం. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ శక్తిసామర్ధ్యాలపై నమ్మకం కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. నూతన వాహనాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. సంతోషంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.
తులా రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం తులా రాశి వారు మీమీ రంగాల్లో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. అనునయంగా మెలగండి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.
వృశ్చిక రాశి
ప్రతికూలతలు అధికం. మీ కష్టం మరొకరికి కలిసి వస్తుంది. పట్టుదలతో శ్రమించండి. ఆత్మీయుల సూచనలు మీపై సత్ప్రభావం చూపుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి.
ధనుస్సు రాశి
సర్వత్రా అనుకూలదాయకమే. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆశించిన పదవులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచిదే. వివాదాలకు దిగవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చూడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
మకర రాశి
లక్ష్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. రుణాలు, చేబదుళ్ళు తప్పవు. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మీయుల చొరవతో ఒక సమస్య సద్దుమణు గుతుంది.
కుంభ రాశి
పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. పొగిడేవారితో జాగ్రత్త. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యవహారాలన్నీ మీ సమక్షంలో సాగుతాయి. మీ సలహా ఉభయులకు ఆమోదయోగ్యమవుతుంది. పిల్లల చదువులపై దృష్టి పెడతారు.
మీన రాశి
సంకల్పం సిద్ధిస్తుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సకాలంలో చెల్లింపులు జరు పుతారు. పనులు చురుకుగా సాగుతాయి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది.