జులై 12, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వాళ్ళు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఉండాలి-today horoscope july 12th 2024 rasi phalalu in telugu check your zodiac signs results ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జులై 12, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వాళ్ళు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఉండాలి

జులై 12, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వాళ్ళు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఉండాలి

HT Telugu Desk HT Telugu

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ12.07.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జులై 12వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 12.07.2024

వారం: శుక్ర‌వారం, తిథి: ష‌ష్టి,

నక్షత్రం: ఉత్త‌ర ఫ‌ల్గుణి, మాసం: ఆషాడ‌ము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ఉత్తరాయణం

మేష రాశి

ఆదాయానికి తగిన ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో వ్యక్తుల మధ్య సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గతంలో మీరు ఇచ్చిన మాట‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తాయి. ఉద్యోగులు ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారులకు ప్రభుత్వపరమైన చిక్కులు ఎదురవుతాయి. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించండి.

వృషభ రాశి

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తరచూ మానసిక ఒత్తిడికి గురవుతారు. కాళ్లకు సంబంధించిన రుగ్మతలు అధికం అవుతాయి. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు అవమానకర సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శివాభిషేకం ఉత్త‌మ ఫ‌లితాలు ఇస్తుంది.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈరోజు ప్రథమార్ధం అనుకూలంగా ఉంటుంది. కొన్ని విష‌యాల్లో ఇంటా బయటా వ్యతిరేక ధోరణులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాల్లో శ్రద్ధ చూపుతారు. విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ఆవేశానికి లోనుకావద్దు. ఉద్యోగులకు బదిలీలుంటాయి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి. దుర్గా సప్తశతీ పారాయణతో శుభం కలుగుతుంది.

కర్కాటక రాశి

రక్త సంబంధీకుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. అపూర్వ దేవతా దర్శనాలు లభిస్తాయి. కుటుంబంలో సంతోష‌క‌ర వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగులు అధికారుల మన్ననలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ సిద్ధి కలుగుతుంది. వ్యవసాయదారులు ప్రభుత్వ సహాయం పొందుతారు. దేవీ ఖడ్గమాలను పఠించండి.

సింహ రాశి

మానసిక ఆనందం పొందుతారు. కుటుంబ‌స‌భ్యుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఒకరికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. గతంలో ఏర్పడిన చిక్కుల నుంచి బయటపడతారు. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగులు మంచి ఫ‌లితాలు అందుకుంటారు. వేంకటేశ్వరుడిని ఆరాధించండి.

కన్యా రాశి

ఆదాయానికి తగిన ఖర్చులుంటాయి. తలపెట్టిన పనులను సామర్థ్యంతో నిర్వహిస్తారు. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగులు అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకతలు ఎదుర్కొంటారు. విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి.

తులా రాశి

ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యుల మ‌ధ్య ఒకింత ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వస్త్రాభరణాలను సమకూర్చుకుంటారు. విద్యార్థులకు క‌లిసి వ‌చ్చే కాలం. ఉద్యోగులు బదిలీల కోసం ప్రయత్నించకపోవడం మంచిది. వ్యాపార విషయాల్లో అధిక క్రమశిక్షణ అవసరం. శ్రీరామ పట్టాభిషేక సర్గ‌ను పారాయణం చేయండి.

వృశ్చిక రాశి

కుటుంబంలో ఆహ్లాదకర వాతావ‌ర‌ణం ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు లాభిస్తాయి. చర్మసంబంధ రుగ్మతలు కలిగే అవకాశాలున్నాయి. సంతానాభివృద్ధి సంతోషదాయకమవుతుంది. పాతబకాయిలు వసూలవుతాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగులు, సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. రాహు కేతు దోష నివార‌ణ‌కు శ్రీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామికి అభిషేకం నిర్వ‌హించండి.

ధనుస్సు రాశి

ముఖ్య విష‌యాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. రాజకీయంగా పలుకుబడి సంపాదిస్తారు. ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు గడిస్తారు. స్థిరాస్తులపై పెట్టుబడులు పెడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. ఉద్యోగులకు బాగుంటుంది. దుర్గా సహస్రనామ స్తోత్రాన్ని పారాయ‌ణ చేయండి.

మకర రాశి

మానసిక ఆనందంతో ముందుకు సాగుతుంటారు. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సంతోషభరిత వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగులు క్రమశిక్షణ పాటించాలి. అధికారులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. జాగ్రత్త వహించండి. చండీ హోమం నిర్వహించండి.

కుంభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వాళ్ళు ఈరోజు శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని పనుల్ని అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది. మధ్యవర్తిత్వాలు అనుకూలం కాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు అధికారుల అభిమానాన్ని సంపాదిస్తారు. వ్యాపారులు తమ వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు గడిస్తారు.

మీన రాశి

ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. గృహోపకరణాలను కొనుగొలు చేస్తారు. భగవంతుని నామస్మరణలో మనసు లగ్నం చేయలేకపోతారు. విద్యార్థులకు కృషి తగ్గ ఫలితం లభిస్తుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడులుంటాయి. అయినా అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారులు భాగస్వామ్య వ్యాపార ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది. చేస్తున్న వ్యాపారాన్ని విస్తృత పరుస్తారు. ఆంజనేయ స్తోత్ర పారాయణ శుభప్రదం.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000