సెప్టెంబరు 6 రాశి ఫలాలు.. వీరికి అదృష్ట ప్రాప్తి ఉంది
Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 06.09.2023 బుధవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) 6.09.2023
ట్రెండింగ్ వార్తలు
వారం: బుధవారం, తిథి: సప్తమి,
నక్షత్రం : కృత్తిక, మాసం: శ్రావణం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
మేషరాశి
మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మనస్తాపాలు కలగకుండా చూసుకోవాలి. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో సమస్యలుంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివివాదాలకు దూరంగా ఉండండి. ధనయోగం ఉంది. కొందరి ప్రవర్తన వల్ల లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవాలి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి. శుభఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ఒక విషయంలో లాభపడతారు. ఆపదలు చుట్టుముడతాయి. తెలివిగా వాటిని పరిష్కరిస్తారు. ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అద్భష్టయోగం ఉంది. తగినంత శ్రమ అవసరం. భగవద్గీత వినడం, చదవడం వల్ల, కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. పట్టుదలతో ఎంతటి కార్యాన్ని అయినా ఇట్టే సాధించ గల సమర్థత మీకుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవాలి. రుణ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మిత్రుల సలహాతో ఆపదనుంచి బయటపడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులు సాయపడతారు. మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామపారాయణ చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శత్రు పీడ తొలగుతుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఆర్థిక వృద్ధి ఉంది. గృహలాభం ఉంది. విమర్శలకు దూరంగా ఉండండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళితే అపార్థాలకు తావు ఉండదు. చేయని తప్పుకు నింద పడాల్సి వస్తుంది. వినయ విధేయతలే మీ విజయానికి మూలం. వేంకటేశ్వరస్వామిని పూజించాలి. వేంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శుభఫలితాలు కలుగుతాయి.
సింహరాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయుల వల్ల మేలు జరుగుతుంది. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. విఘ్నాలు ఎదురవుతాయి. మిత్రుల సలహాతో పనులు సఫలీకృతమవుతాయి. మంచి ఆలోచనలతో అధికారులను మెప్పిస్తారు. దూరమైనవారు దగ్గరవుతారు. పట్టుదలతో పేరు తెచ్చుకుంటారు. ధనయోగం ఉంది. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
కన్యారాశి
కన్యారాశి వారికి ఈ రోజు మధ్యస్థము నుండి అనుకూలంగా ఉన్నది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబముతో ప్రశాంతత నెలకొంటుంది. శుభయోగాలు ఉన్నాయి. క్రమక్రమంగా జీవితంలో స్థిరపడతారు. ధనలాభం ఉంది. అధికారం సిద్ధిస్తుంది. సిరిసంపదలు వరిస్తాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి. శ్రీకృష్ణుడిని పూజించాలి. కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
తులా రాశి
తులారాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆస్తిపరమైన తగాదాలు రాకుండా జాగ్రత్తపడాలి. ధనలాభం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. మీరు నమ్మిన ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన చేయించుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. సమిష్టి నిర్ణయాలు ఆపదలను దూరం చేస్తాయి. మొహమాటంతో కొత్త ఇబ్బందులు రావచ్చు. మీదైన ప్రతిభ మిమ్మల్ని అందలమెక్కిస్తుంది. పట్టుదల సడలనీయకండి. మిత్రుల సాయంతో ఒక పనిలో విజయం లభిస్తుంది. అంతా శుభమే జరుగుతుంది. ప్రశాంతంగా కాలం గడుస్తుంది. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఆనందముగా గడుపుతారు. అదృష్ట ప్రాప్తి ఉన్నది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో విభేదించరాదు. మంచి జరుగుతుంది. ప్రశాంతంగా పనిచేస్తే విజయం లభిస్తుంది. గురువుల అనుగ్రహం ఉంటుంది. శుభవార్త వింటారు. వినాయకుని పూజించడం, సంకట నాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
మకర రాశి
మకరరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సొంత నిర్ణయాలు కలసిరావు. ఆర్థికస్థితి అనుకూలం. ఒక విషయంలో పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. ముఖ్య సందర్భాల్లో శ్రద్దగా మాట్లాడండి. ఆత్మీయులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. అర్హతకు తగినంత ప్రతిఫలం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. మనోబలాన్ని పెంచుకోవాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్చించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థముగా ఉన్నది. ఎవరు ఏది చెప్పినా పట్టించుకోకుండా, మీదైన మార్గంలో ముందుకు సాగండి. తెలివితేటలతో అధికారులను మెప్పిస్తారు. ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. బంధుమిత్రుల ఆదరాభిమానాలు లభిస్తాయి. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన చేయించుకోవడం, అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. ఆర్థికంగా బలపడతారు. ఖర్చులు అదుపులోకి వస్తాయి. నలుగురికీ మేలు చేస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కుటుంబ సభ్యుతో ఆనందముగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అజాగ్రత్తగా వ్యవహరించవద్దు. ప్రయాణం చేసేటప్పుడు అతివేగం ప్రమాదకరం. మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000